• English
  • Login / Register

సెక్యూరిటీ ఆందోళన వల్ల ఆటోమొబైల్ దిగ్గజాలు నోకియా యొక్క హియర్ మ్యాపుల్లో పెట్టుబడి పెట్టనునారు

జూలై 24, 2015 01:14 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఈరోజుల్లోని ఆటోమొబైల్ రంగంలో సాఫ్ట్వేర్ యొక్క పాత్రని ఉద్ద్యేశంలో ఉంచుకుని హ్యాకింగ్లను అధిగమించేందుకు గాను సెక్యూరిటీ సాఫ్ట్వర్ల మీద దృష్టి సారించడం అత్యవసరం అయ్యింది. దీని కారణంగా ఆటోమొబైల్ దిగ్గజాలు అయిన మెర్సీడెజ్ లాంటి వారు ఇప్పుడు నోకియా హై-డెఫినిషన్ మ్యాప్పింగ్ సిస్టంల పై ఆధారపడనున్నారు. 

డైంలర్ కి చీఫ్ ఎగ్సెక్యూటీవ్ అయిన డైయిటర్ జెట్షే మాటల్లో, మెరుగైన డాటా సెక్యూరిటీ ఉండాలన్న ఉద్ద్యేశంతో మెర్సీడెస్ నోకియా హై-డెఫినిషన్ మ్యాప్పిన్ వైపు మొగ్గు చూపుతున్నరు అని అన్నారు. ఇది కనుక విజయవంతమైతే బీఎండబ్ల్యూ గ్రూపు, ఆడీ మరియూ మెర్సిడెస్ వారు ఈ సాఫ్ట్వేర్ ని థర్డ్ పాఋతీ పోటీదారులకి కూడా అందుబాటు చేశే అవకాశం ఉంది. 

మెర్సీడెస్ యొక్క సాఫ్ట్వేర్ సెక్యూరిటీ గురించి ప్రశ్నించినప్పుడు, జెట్షె గారు, " మీరు పేపరు చదివినట్టయితే మేము మా జర్మన్ పోటీదారులతో ఒక వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, ముఖ్యంగా స్వయంప్రతిపత్తి డ్రైవింగ్ విభాగాన్ని నియంత్రించేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నామో చూడవచ్చు" అని అన్నారు. 

కొంతమంది సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు కారు నడుస్తున్న సమయములో కూడా ఇంటర్నెట్ ని ఉపయోగించుకుని మేము కారుని ఆపివేయగలము అని చూపించిన తరువాత కార్లలో వాడుతున్న ఆధునిక సాఫ్ట్వర్ యొక్క సెక్యూరిటీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం చేత 2.5 బిలియన్ల యూరోలు మరియూ 3 బిలియన్ల యూరోల ($2.74 బిలియన్ తొ $3.29 బిలియన్) వేలంపాట నోకియా వారి హియర్ మ్యప్పింగ్ సిస్టము కోసం వేయబడింది. ప్రశ్న ఏమిటంటే, స్వయంప్రతిపత్తి డ్రైవింగ్ కార్ల నుండి మోబల్ నెట్వర్కులతో అనుసంధానమయ్యే ఈ సాఫ్ట్వేర్ యొక్క పేటెంట్ ని ఎవరు సొంతం చేసుకుంటారు అని. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience