యూకె లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ను సందర్శించిన పిఎం మోడీ
published on nov 16, 2015 05:31 pm by raunak
- 3 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తన ఇటీవలి యూకె పర్యటనలో, టాటా సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క సోలిహుల్ తయారీ యూనిట్ ను సందర్శించారు. ప్రధాని, టాటా గ్రూప్ చైర్మన్ అయిన సైరస్ పల్లోంజీ మిస్త్రీ లతో పాటు జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జె ఎల్ ఆర్) సి ఈ ఓ అయిన రాల్ఫ్ స్పెత్ మరియు వార్విక్ తయారీ గ్రూప్ వ్యవస్థాపకుడు అయిన లార్డ్ కుమార్ భట్టాచార్య ల ద్వారా ఒక రిహార్సల్ ను ఇచ్చారు. ప్రధాని మోడీ, "జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ కర్మాగారం వద్ద తయారీ సౌకర్యాన్ని సందర్శించినప్పుడు భారతదేశానికి మరియు యూకె కు మధ్య ఆర్థిక సమన్విత చాలా సాధించవచ్చు అని చెప్పారు".
సోలిహుల్, అనే ప్రాంతం ల్యాండ్ రోవర్ యొక్క స్థావరం మరియు భారతదేశంలో రాబోయే ఎక్స్ఈ వాహనం మొదటి జాగ్వార్ వాహనంగా అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఎక్స్ ఈ, తయారీ ఈ సంవత్సరం ఏప్రిల్ లో ప్రారంభించారు. ఇది కూడా, సంస్థ యొక్క కొత్త తేలికైన అల్యూమినియం ఆర్కిటెక్చర్ తో వస్తుంది. అంతేకాకుండా, ఈ అల్యూమినియం ఆర్కిటెక్చర్ కొత్త ఎక్స్ ఎఫ్ మరియు ఎఫ్ -పేస్ క్రాస్ఓవర్ వాహనాలలో కూడా అందించబడుతుంది. ఈ కార్లు అన్ని, రాబోయే సంవత్సరాల్లో భారతదేశం లో ప్రారంభించబడతాయి మరియు ఎక్స్ ఈ మొదటిగా ప్రవేశపెట్టబడుతుంది. అంతేకాకుండా ఇది, రాబోయే 2016 ఫిబ్రవరి లో భారత ఆటో ఎక్స్పో సమయంలో ప్రయోగించేందుకు భావిస్తున్నారు. అంతేకాక, ఇది పూనే లో ఉన్న ఏఆర్ఏఐ సౌకర్యం వద్ద (భారతదేశం ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్) ఇటీవల కంటపడినది.
అమెరికన్ వాహన తయారీ సంస్థ అయిన ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి ఈ రెండు బ్రిటిష్ బ్రాండు దిగ్గజాలను, 2008 వ సంవత్సరం లో టాటా మోటార్స్ కొనుగోలు చేశారు. టాటా మోటార్స్ జె ఎల్ ఆర్ ను సొంతం చేసుకున్నపుడు, అది నష్టంలో నడుస్తుంది. అయితే, టాటా స్వాధీనపర్చుకున్న తర్వాత రెండు సంవత్సరాల కాల వ్యవధి లోనే జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ పునరుద్ధరించబడ్డాయి. ప్రస్తుతం కంపెనీ, సోలిహుల్ ప్లాంట్లో ఏడాదికి దాదాపు 4,25,000 వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Health Insurance Policy - Buy Online & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful