Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

పెట్రోల్, డీజిల్ కార్లు ఇప్పటికైతే ఉంటాయి; మరింత సరసమైనవిగా ఉండవచ్చు

సెప్టెంబర్ 10, 2019 02:53 pm dhruv ద్వారా ప్రచురించబడింది

ఆటోమొబైల్ పరిశ్రమలో అమ్మకాలు పెరిగేందుకుగానూ పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్టీని తగ్గించాలని భారత కార్ల తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు

  • పెట్రోల్ మరియు డీజిల్ కార్లు సమీప భవిష్యత్తులో నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశం లేదు.
  • SIAM ప్రభుత్వం నుండి ప్రత్యేఖమైన ఆటోమొబైల్ ఏజెన్సీని అడుగుతుంది.
  • పెట్రోల్ మరియు డీజిల్ కార్లు ప్రస్తుతం జీఎస్టీ లేదా 28 శాతం ఆకర్షిస్తున్నాయి.
  • సమీప భవిష్యత్తులో దీనిని 18 శాతానికి తగ్గించవచ్చు.

న్యూ ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) 59 వ వార్షిక సదస్సులో, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను ఎప్పటికైనా నిషేధించదని వెల్లడించారు. ఇంటర్నేషనల్ కంబషన్ యంత్రాల (ICE లు) ముగింపు దగ్గర పడుతుందనే పుకార్ల నేపథ్యంలో గడ్కరీ యొక్క ప్రకటన వచ్చింది.

ఆటోమొబైల్ పరిశ్రమ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న కారణం చేత ఈ సందేశం కార్ల తయారీదారులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. బిఎస్ 4 నుండి బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు మారడం, అధిక పన్నుతో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క కొత్త శకానికి దారితీసే ప్రణాళికలు చాలా మంది తయారీదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పరిశ్రమను తిరిగి దాని కాళ్ళ మీద నిలబెట్టేందుకు, కార్ల తయారీదారులు ICE కార్లపై గూడ్స్ మరియు సేవల పన్ను (జిఎస్టి) ను తగ్గించాలని కోరుకుంటున్నారు.

ప్రాతినిధ్య ప్రయోజనం కోసం చిత్రం.

వివిధ గూడ్స్ మరియు సేవలపై వర్తించే పన్నులను నియంత్రించే జిఎస్‌టి కౌన్సిల్‌ను పర్యవేక్షించే ఆర్థిక మంత్రిత్వ శాఖకు కార్ల తయారీదారుల సిఫారసుతో పాటు తాను కూడా సిఫార్సు పాస్ చేస్తానని రవాణా మంత్రి చెప్పారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్లపై 28 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, సమీప భవిష్యత్తులో దీనిని 18 శాతానికి తగ్గించవచ్చు. అంతేకాకుండా, హైబ్రిడ్ వాహనాల అమ్మకాలను పెంచడానికి జిఎస్‌టిని తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరినట్లు గడ్కరీ తన సెషన్‌లో ప్రకటించారు.

అన్ని విషయాలను ఆటోమొబైల్స్ చూసుకునే ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సియామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఏజెన్సీ నుండి వచ్చే గైడ్ లైన్స్ కార్ల తయారీదారులు ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి భవిష్యత్తు కోసం వారి రోడ్‌మ్యాప్‌ను నిర్ణయించడంలో సహాయపడతాయి.

ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తుందని గడ్కరీ చెప్పగా, వారి సిఫారసులన్నీ అమలు అవుతాయో లేదో ఇంకా తెలియలేదు.

యాన్యువల్ SIAM సమావేశం నుండి నితిన్ గడ్కరీ యొక్క కొటేషన్

ఆటో ఫైనాన్సింగ్‌కు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతూ, అమ్మకాలను పెంచడానికి తమ సొంత, యాజమాన్య ఫైనాన్సింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని గడ్కరీ ఆటో పరిశ్రమను కోరారు. అతను ఈ విధంగా తెలిపాడు “రాబోయే వాహనాల ధరల పెరుగుదల మరియు BS VI నిబంధనల గడువును పరిగణనలోకి తీసుకుని పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల జిఎస్టిని తగ్గించాలని పరిశ్రమ కోరింది". కొంతకాలం జీఎస్టీని తగ్గించినా, వాహన అమ్మకాలను పెంచడానికి ఇది ఈ రంగానికి సహాయపడుతుంది. ఆయన మాట్లాడుతూ“ ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్‌టి 12% నుండి 5% కి తగ్గించబడింది. అదే ప్రయోజనాన్ని హైబ్రిడ్ వాహనాలకు అందుబాటులో ఉంచాలని నేను ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదిస్తాను. ”

స్క్రాపింగ్ విధానాన్ని త్వరగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ఉత్పత్తి ఖర్చులను భారీగా తగ్గిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చర్చలు జరిగాయి, మేము అలాంటిదేమీ చేయబోవడం లేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను అని చివరిలో ఆయన తెలపడం జరిగింది.

d
ద్వారా ప్రచురించబడినది

dhruv

  • 17 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర