• English
  • Login / Register

భద్రతా ప్రమాణాలను అవలంబించమని భారతదేశాన్ని కోరుతూ ఎస్ఐఏఎం కి ఎన్ సి ఏ పి లేఖ

ఆగష్టు 25, 2015 12:40 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

క్రాష్ టెస్ట్ విఫలమైన కారణంగా సబ్ 1,500 కిలో గ్రాముల వాహనాలపై గౌహతి హైకోర్టు నిషేధం విధించిన తరువాత, గ్లోబల్ న్యూ కార్ అస్సెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్ సి ఏ పి), జనవరి 1, 2015 నుండి యునైటెడ్ నేషన్స్ ప్రమాణాలతో సైడ్ ఇంపాక్ట్ పరీక్ష ను స్వీకరించడం మరియు అమలు పరచడం జరపమని భారతదేశం యొక్క (ఎస్ ఐ ఏ ఎం) ను కోరింది. జూన్ 26 న, క్రాష్-పరీక్ష నిబంధనలను విఫలమైన కారణంగా వేర్వేరు తయారీ సంస్థల యొక్క 140 మోడళ్లను గౌహతి హైకోర్టు నిషేధించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 27 న జరగనుంది.

గ్లోబల్ ఎన్ సి ఏ పి సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ మాట్లాడుతూ "భారతదేశం, వాహన భద్రత పరంగా ఆటో కార్ రంగంలో 20 సంవత్సరాల నుండి యూరోపియన్ దేశాల తర్వాత స్థానంలో ఉందని చెప్పారు. అనేక భారతీయ మరియు అంతర్జాతీయ ఆటో తయారీదారులు ఎగుమతి చేసిన కార్లు ఇప్పటికే గ్లోబల్ భద్రతా నిబంధనలను చేరుకున్నాయని, కాబట్టి వాటిని భారతదేశం లో అదే సాధనతో స్వీకరించడం పెద్ద కష్టం కాదని" ఆయన అన్నారు.

లేఖలో, భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) కు వార్డ్ ఈ విధం గా రాశారు, "అంతర్జాతీయ క్రాష్ పరీక్షలలో విఫలం అయిన కారణంగా చిన్న నాలుగు ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని ఇటీవలి అస్సాం మధ్యంతర కోర్ట్ ఆర్డర్ జారీ చేసింది. అంతేకాకుండా, కొత్త యజమానులకు రక్షణ నిబంధనలను అక్టోబర్ 2017 నుండి భారత ప్రభుత్వం అమలులో పెట్టబోతుంది. సియామ్ గౌరవపూర్వకంగా కారు భద్రత పై స్వచ్ఛందంగా తమ సొంత చొరవను తీసుకోవాలని గ్లోబల్ ఎన్ సి ఏ పి తెలిపింది. అంతేకాకుండా, భారతీయ కారు కంపెనీలను ఒప్పించే క్రమంలో రహదారి భద్రతను అమలు చేయడానికి ఐరోపా వాహనతయారీ దారులు దీనిని విస్తరించేందుకు మరియు ఆచరణలోకి తెచ్చేందుకు స్వచ్ఛంద కార్యక్రమాలను చేపడుతుంది" అని ఆయన వివరించారు.

చివరి సంవత్సరం ఎన్ సి ఏ పి, ఫ్రంటల్ ఆఫ్సెట్ క్రాష్ టెస్ట్ ను ప్రదర్శించింది. ఈ టెస్ట్ లో మన దేశంలో ఉన్న మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఐ 10, ఫోర్డ్ ఫిగో మరియు డాట్సన్ గో వంటి అనేక కార్లు విఫలమయ్యాయి. ఈ పరీక్షలు అభివృద్ధి చెందిన మార్కెట్ లో ఒక ప్రామాణిక అంశంగా ఉంటాయి. అదే విధంగా, అన్ని కారు కంపెనీల యొక్క అన్ని మోడల్స్ ఈ టెస్ట్ లను బరించి గెలుపొందవలసి ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, భారతదేశం లో ఇప్పటి వరకు ఇలాంటి టెస్ట్ లు నిర్వహించబడలేదు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience