• English
  • Login / Register

మెర్సిడెస్ బెంజ్ వార్షిక ఆదాయం 12.8% అభివృద్ధిలో కాంపాక్ట్ కార్లు మరియు ఎస్యువి ల ఘన విజయం

జూన్ 09, 2015 06:05 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మెర్సిడెస్ బెంజ్ ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది 12.8% ఎక్కువ వాహనాలను విక్రయం చేసింది. అంటే, వినియోగదారులకు 151,135 పైగా వాహనాలు పంపిణీ చేసింది. స్టట్గర్ట్ లో ఈ మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ 728,809 వాహనాలను విక్రయం చేసింది. అంటే, గత ఏడాది తో పోలిస్తే, ఈ ఏడాది 2015 ప్రారంభ నెల నుండి మే వరకు 13.6% అమ్మకాల పెరుగుదలను నమోదు చేసుకుంది.  ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ మెర్సిడెస్ బెంజ్ అతిపెద్ద రికార్డు ను సాధించింది. అమ్మకాల పరంగా గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 23.4% ఎక్కువ అమ్మకాలు జరిగాయి. అంటే, 46,260 వాహనాలను విక్రయం చేసి అతిపెద్ద రికార్డు ను సృష్టించింది. 

జర్మనీ లో తమ మొదటి ప్రపంచ ప్రదర్శన ఈ నెలలో జరుపుకోబోతున్నామని, మా జిఎల్ సి సాధించిన విజయాన్ని కథగా నిర్మించడానికి ప్రణాళిక తో ఉన్నామని " డైమ్లెర్ ఏజీ యొక్క బోర్డు నిర్వహణ సభ్యుడు, మెర్సిడెస్-బెంజ్ కార్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ నిర్వాహకులు ఓల కల్లేనియస్" అన్నారు. "దీని కంటే ముందు వచ్చిన జిఎల్ కె అత్యధికంగా విక్రయించబడుతున్నది ఎస్యువి అని ఆయన కొనసాగించారు.

వీటి అభివృద్ధి అంతా మెర్సెడెజ్-బెంజ్ కాంపాక్ట్ కార్లకు మరియు ఎస్యువి లకు ఉన్న డిమాండ్ తోడ్పాటు వల్లనే సాధ్యమైందని, ఇది ఎల్లప్పుడు ఇలాగే సానుకూలంగా అభివృద్ధి కొనసాగుతూ ఉండాలని ఆయన పేర్కొన్నారు. మెర్సిడెస్ యొక్క సిఎల్ఎ మరియు జిఎల్ఎ అమ్మకాల రికార్డ్ లు మే నెలలో 46,363 యూనిట్లు (+ 22.3%) పెరిగాయి అని ఆయన చెప్పారు.

మే నెలలో సి-క్లాస్ సెలూన్ మరియు ఎస్టేట్ మోడల్స్ 59.5% అభివృద్దితో 33,016 యూనిట్లు విక్రయించగా, ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో మాత్రం 174,875 వాహనాలు 57.3% వృద్దితో విక్రయాలు జరిగాయి. మే లో ఎస్ క్లాస్ సెలూన్ ఇప్పటికీ 8,550 యూనిట్ల రికార్డు అమ్మకాలతో ప్రపంచంలో ఉత్తమ అమ్మకాల లగ్జరీ సెలూన్ గా నిలిచింది. ఎస్యువి సెగ్మెంట్ మే లో 41,210 యూనిట్లు అనగా 18.7% వృద్దితో అమ్మకాలు సాగించింది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience