ఆగస్ట్ 11న ఎస్63 ఎఎంజి సెడాన్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా

ఆగష్టు 05, 2015 05:55 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మెర్సిడీజ్ బెంజ్ ఇండియా కొత్త కొత్త వాహన ప్రారంభాలను కొనసాగిస్తునే ఉంది. ఇది ఎస్ 63 ఎ ఎం జి సెడాన్ ని  రాబోయే ఆగస్టు 11, 2015 న  ప్రారంభించబోతున్నది. గత వారం జర్మన్ తయారీసంస్థ జి 63 క్రేజీ రంగు ఎడిషన్ పాటు ఎస్ 500 కూప్ మరియు ఎస్ 65 ఎ ఎం జి కూప్ ని ప్రారంభించింది. ఎస్ 63 కూప్ లానే మెర్సిడెస్ ఎ ఎంజి ఎస్63 సెడాన్ కూడా అదే 5.5-లీటరు వి8 బై-టర్బో ఎ ఎంజి ఇంజిన్ ని కలిగి ఉంది.

ఈ వాహనం యొక్క ఇంజన్ గురించి మొదట మాట్లాడటానికి వస్తే, ఇతర ఏఎంజి వాహనం వలె, ఈ ఏఎంజి ఎస్ 63 సెడాన్ లో ఉన్న ఇంజిన్ కూడా చేతితో తయారుచేసిందే. ఈ వాహనం లో 5.5 లీటర్ బై- టర్బో వి8 ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 585 పి ఎస్ ను మరియు 900 ఎన్ ఎం గల పీక్ టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, త్వరణం విషయానికి వస్తే, ఈ వాహనం, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 4.4 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఈ ఏఎంజి ఎస్63 సెడాన్ 250 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగలుగుతుంది. భారతదేశం లో ఈ వాహనం రేర్ వీల్ డ్రైవ్ తో వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఏఎంజి 63 ఎస్ కూపె లో ఉన్న మేజిక్ బాడీ కంట్రోల్ సస్పెన్షన్ వ్యవస్థ తో వచ్చే అవకాశం ఉంది.

ఈ వాహనం యొక్క లుక్ ను చూసినట్లైతే, ఈ ఏఎంజి ఎస్ 63 సెడాన్ సూక్ష్మ మార్పులతో రాబోతుంది. బాహ్య భాగాల విషయానికి వస్తే, ఈ ఏఎంజి వెర్షన్ స్పోర్టీ బంపర్ తో పాటు ఒక పెద్ద ఎయిర్ ఇంటేక్ ను కలిగి రాబోతుంది. వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, బంపర్ ను కొంచెం పై అమర్చారు దీనితో పాటుగా డిఫ్యూజర్లచే మరియు క్వాడ్ ఎగ్జాస్ట్ లను కలిగి ఉండబోతుంది. మొత్తం లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఎస్ 63 ఏఎంజి సెడాన్ లో, 20- అంగుళాల ఏఎంజి వీల్స్ అందించబడతాయి. అంతేకాక, ఎస్- క్లాస్ వాహనాలతో పోలిస్తే, ఈ వాహనం యొక్క బరువు సుమారు 100 కిలోలు తక్కువ. ధర గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహనం యొక్క ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉండబోతుంది. అంతేకాకుండా, ఇటీవల విడుదల అయిన కూపే వెర్షన్ వలే ఈ వాహనం కూడా సిబియు రూట్ ద్వారా దిగుమతి చేయబడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience