675 ఎల్టి స్పైడర్ వేరియంట్ ను బహిర్గతం చేసిన మెక్లారెన్; అంతర్గత వివరాలు `
మెక్లారెన్, దాని 675 ఎల్టి స్పైడర్ ను బహిర్గతం చేసింది. ఈ మోడల్, మెక్లారెన్ గ్రూప్ లో చేరడం జరిగింది మరియు ఈ వాహనాన్ని, ఎల్ టి బ్యాడ్జ్ ను కలిగి ఉన్న రెండవ వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనాన్ని, ముందు వాహనం ప్రవేశపెట్టిన 20 సంవత్సరాలు తరువాత ప్రవేశపెట్టడం జరిగింది. లాండ్ టైల్ అనేది, ఈ వాహనం యొక్క కీలకమైన మరియు ప్రత్యేకమైన అంశం అని చెప్పవచ్చు. ఈ లాంగ్ టైల్ ను కలిగి ఉన్న 675ఎల్ టి స్పైడర్, కూపే లా ఖచ్చితంగా ఉండదు అని భావిస్తున్నారు. మెక్లారెన్, 675 ఎల్ టి స్పైడర్ వాహనాన్ని 500 యూనిట్ల కు మాత్రమే పరిమితం చేసింది. దీని యొక్క డెలివరీలు, 2016 వేసవిలో ప్రారంభమవుతాయి. ఈ 675 ఎల్ టి స్పైడర్ వాహనం, £285,450 (భారతీయ రూపాయిలలో సుమారు, 2.88 కోట్లు) వద్ద ప్రవేశపెట్టబడింది మరియు ఇది, 2015 లో మెక్లారెన్ ఆటోమోటివ్ ద్వారా వచ్చిన ఐదవ మోడల్ గా ఉంది. ఈ సరికొత్త మోడల్, మెక్లారెన్ పి1 జిటీఅర్, 570 ఎస్ కూపే, 540 సి కూపే మరియు 675 ఎల్ టి కూపే అను సూపర్ కారు సిరీస్ పరిదిలో వచ్చి చేరింది.
యాంత్రికంగా, ఈ వాహనం కూపే లో ఉండే సవరించబడిన 3.8 లీటర్ ట్విన్ టర్బో వి8 పవర్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్, పవర్ మరియు టార్క్ ల విషయంలో ఏ మార్పులను కలిగి లేదు. ఈ ఇంజన్, అత్యధికంగా 666 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 700 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 కె ఎం పి హెచ్ నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 2.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 200 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 8.1 సెకన్ల సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ వాహనం, 326 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అన్ని రిట్రాక్టబుల్ రూఫ్ వ్యవస్థ తో కలిపి ఈ 675 ఎల్ టి స్పైడర్ వాహనం, కూపే కంటే 40 కిలోలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.
మెక్లారెన్ 675 ఎల్టి స్పైడర్ యొక్క సాంకేతిక నిర్దేశాలు
PERFORMANCE |
|
0-100 km/h (0-62 mph) |
2.9 seconds |
0-200 km/h (0-124 mph) |
8.1 seconds |
Top speed |
326 km/h (203 mph) |
Power-to-weight |
532PS per tonne |
|
|
ENGINE POWERTRAIN |
|
Engine Configuration |
V8 Twin Turbo / 3799cc |
Power |
666 bhp @ 7,100 rpm |
Torque |
700Nm @ 5,000-6,500 rpm |
Transmission |
7 Speed SSG |
CO2 |
275g/km |
|
|
DIMENSIONS WEIGHT |
|
Dry weight |
1,270kg |
Weight distribution |
42 / 58 |
Length |
4,546 mm |
Width |
2,095 mm |
Height |
1,192 mm |
ఇవి కూడా చదవండి: