• English
  • Login / Register

తుది దశకు చేరుకున్న మెక్లారెన్ పీ1 ఉత్పత్తి

డిసెంబర్ 11, 2015 06:30 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రసిద్ధ మైన మెక్లారెన్ ఎఫ్ 1 కారు యొక్క 375వ మరియు ప్రత్యక్ష వారసత్వానికి చివరి ఉదాహరణ అయిన- మెక్లారెన్ పీ1 హైపర్ కార్ ఉత్పత్తి చేయబడినది.

జైపూర్: మెక్లారెన్ ఇకపై పీ1 మోడల్ ను ఉత్పత్తి చేయదు. ఇది విచారకరమైన విషయం. ప్రఖ్యాతమైన పురాణ మెక్లారెన్ ఎఫ్1 ఆధ్యాత్మిక వారసుడిగా తెర దించుతూ చివరి 375వ కారు ఉత్పత్తి చేయబడినది. మెక్లారెన్ 2012 పారిస్ మోటార్ షోలో పరిచయం చేయబడింది మరియు దాని ఉత్పత్తి 2013 లోని వేసవికాలంలో ప్రారంభమయినది . మెక్లారెన్ మొదటి కారు కస్టమర్ కు డెలివరీ కాక ముందే అన్ని 375కార్లు అమ్ముడైపొయాయని కంపెనీ తెలిపింది. మొట్ట మొదటి మెక్లారెన్ పీ1 ఐస్ సిల్వర్ పేంట్ తో పూర్తయ్యింది మరియు చివరి,ఆఖరి ఉత్పత్తికి ఉదాహరణ అయిన మెక్లారెన్ పీ1 375వ కారు పెర్ల్సెంట్ నారింజ రంగు పెయింట్ తో పూర్తి చేయబడింది. ఈ నారింజ రంగు ' 64 వ మరియు చివరి మెక్లారెన్ ఎఫ్1 రేస్ కారు, చాసిస్ #075, వాల్కేనొ ఆరెంజ్' ను ప్రతిబింబిస్తుంది.

మెక్లారెన్ ఆటోమోటివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైక్ ఫ్ల్యూయిట్ మాట్లాడుతూ," మేము అంచనా వేసిన దాని కంటే మెక్లారెన్ ప్1 ఎప్పుడూ లేనంతగా గొప్ప ఘనతను సాధించింది. మూడు సంవత్సరాల క్రితం మొదటిసారి చిన్నగా అనిపించి కొత్త తరం సూపర్ కారుగా , మరియు ప్రపంచవ్యాప్తంగా మెక్లారెన్ బ్రాండ్ ను మెరుగుపర్చే విధంగా ఊహించిన దాని కంటే ఎక్కువగా పేరును సాధించింది. " ప్రఖ్యాతమైన పురాణ మెక్లారెన్ ఎఫ్1 ప్రత్యక్ష వారసత్వానికి చివరి ఉదాహరణగా- మరియు హైబ్రిడ్ శక్తితో నడిచే సూపర్ కార్ల జాతిలో మొదటి కారుగా - దాని స్తానాన్ని పూరించే పెద్ద బాధ్యతను కలిగి ఉంది. ఇందులో అది దాదాపుగా విజయం సాధించింది . ఈ కారు దానికదే ఒక నిజమైన పోటీదారు వలె స్థాపించబడినది. ఎంతో కాలం నుండి పోటీ లో ఉన్న శత్రువులపై రహదారి మరియు ట్రాక్ రెండు విషయాలలో ఒక విలువైన ప్రత్యర్థిగా రుజువు చేసుకుంది. మెక్లారెన్ ఆటోమోటివ్ బ్రాండ్ కి హ్యలొ ప్రాడక్ట్ గా ఇది అధ్భుతమైన పని చేసింది. మేము ఈరోజు మూడు అంచెల, లాభదాయకమైన వ్యాపార కంపెనీ గా ఉండడానికి అది ఒక కారణంగా నిలిచింది.

ఇది మెక్లారెన్ ఎఫ్1 వంటి టాప్ ఔట్పుట్ ఇవ్వలేదు. ఐనప్పటికీ అది విపరీతమైన పనితీరును కలిగి శక్తివంతంగా ఉంది. దీనిలో 3.8 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజన్ అత్యంత శక్తివంతమైన 179 పి ఎస్ విద్యుత్ మోటారుతో కలపబడినది.ఈ కలయిక 7,300 ఆర్ పీ ఎం వద్ద 916 పి ఎస్ (903 బి హెచ్ పి) అవుట్పుట్ ని చేరుతుంది మరియు 900ఎన్ ఎం యొక్క గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో టర్బో లాగ్ లోపాన్ని నివారించడానికి విద్యుత్ మోటారు నుండి 130 ఎన్ ఎం టార్క్ వెంటనే అందుబాటులో ఉంటుంది. ఇందులోని హైబ్రిడ్ పవర్ ట్రేన్ వాహనాన్ని స్థిరమైన స్థితి నుండి 100 కె ఎం పి హెచ్ (62 ఎం పీ హెచ్) వేగాన్ని 2.8 సెకన్లలో అందుకుంటుంది. 200కె ఎం పి హెచ్ వేగాన్నీ 6.8 సెకన్లలో చేరుకుంటుంది మరియు 300కె ఎం పి హెచ్ వేగాన్నీ 16.5 సెకన్లలో చేరుకుంటుంది, అంటే ఇది పురాణ ప్రఖ్యాత మెక్లారెన్ ఎఫ్1 కంటే ఐదు సెకన్లు వేగంగా దానిని చేరుకుంటుంది. దీనియొక్క టాప్ స్పీడ్ ని 350 కె ఎం పి హెచ్ (217 ఎం పీ హెచ్)కు పరిమితమైంది

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience