పడమటి భారతదేశం కోసం మాసెరాటి వారు GPP ని భాగస్వామిని చేసుకున్నారు
సెప్టెంబర్ 23, 2015 10:09 am cardekho ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: విలాసవంతమైన కారు బ్రాండు, మాసెరాటీ భారతదేశంలో గొప్పగా అడుగు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన కార్లకి పెట్టింది పేరు అయిఉన ఈ మాసెరాటి ధనికుల మొదటి ఎంపిక. ఈ బ్రాండ్ కి ఇప్పటికే భారతదేశంలో అభిమానులు ఉన్నారు పైగా ఇప్పుడు వారికి ఇది మరింత చేరువంది. మాసెరాటి వారు GPP ని వారి భాగస్వామిగా పడమటి ప్రాంతం కోసం ఎంచుకున్నారు.
మిస్టర్. సుఖ్బీర్ బగ్గా గారు గ్రూప్ ప్లానెట్ పెటల్ (GPP) ని నడిపారు. ఇది గుజరాత్, మధ్య ప్రదేశ్ మరియూ ఇప్పుడు మహరాష్ట్రా లో కూడా ఆటోమోటివ్, ఇన్సురెన్స్, ఫైనాన్స్ మరియూ రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో కార్యకలాపాలు సాగిస్తుంది. GPP వారు హ్యుండై, నిస్సాన్, అశోక్ ల్యేల్యాండ్ , యమహా మరియూ సుజుకీ వంటి బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే సమయంలో, పెటల్ మనీ మరియూ పెటల్ ఇన్సురెన్స్ వంటి వాటిని కూడా నడుపుతుంది.
ఈ డీలర్షిప్, పెటల్ మాసెరాటి పేరున నడుస్తుంది మరియూ ముంబై లో ఒక విలాసవంతమైన షోరూం ని త్వరలోనే స్థాపిస్తారు. ఒక వర్క్ షాప్ ని కూడా ఈ ఊబర్ కార్ల సర్వీసుకై జత చేస్తారు. ఈ సదుపాయాలు వచ్చే నెల అక్టోబర్ 2015 లో మొదలవుతాయి కార్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
ఈ క్రింది మోడల్స్ భారతదేశంలో అందుబాటులో ఉంటాయి.
Maserati Ghibli Diesel - INR 1.12 cr
Maserati Quattroporte Diesel- INR 1.49 cr
Maserati Quattroporte GTS Petrol - INR 2.18
Maserati GranTurismo Petrol - INR 1.78 cr
Maserati GranTurismo Sport Auto - INR 2.02
Maserati GranTurismo MC Stradale - INR 2.36 cr
Maserati GranCabrio - INR 2.06 cr
Maserati GranCabrio Sport - INR 2.20 cr
Maserati GranCabrio MC Stradale - INR 2.41 cr