• English
  • Login / Register

మహీంద్రా స్కార్పియో: వేరియంట్స్ వివరాలు

మహీంద్రా స్కార్పియో 2014-2022 కోసం rachit shad ద్వారా మార్చి 07, 2019 12:41 pm ప్రచురించబడింది

  • 35 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mahindra Scorpio Grille

మనకు తెలిసిన మహీంద్రా, భారతదేశం కోసం ఎస్యువి లను నిర్మించడంతో నిమగ్నమై ఉంది. మీకు ఏ బడ్జెట్ అయినా, మహీంద్రా మీకు ఒక ఎస్యువి ను అందిస్తుంది. ఏదేమైనా, దాని ఉత్పత్తులలో ప్రతీఒక్కటి భారతదేశంలో ఎల్లప్పుడూ అభిమానులను కలిగి ఉంది. అంతకుముందు, ఇది 2002 లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు 6 లక్షల యూనిట్లు విక్రయించబడ్డాయి. అవును, మేము మాట్లాడుతున్నది మహీంద్రా స్కార్పియో గురించే. ఇది ఒక దశాబ్దం పాటు మహీంద్రా యొక్క ఉత్తమ అమ్మకాల ప్రయాణీకుల వాహనంగా ఉంది.

మహీంద్రా తన రెండవవ తరం వాహనాన్ని తీసుకొచ్చేందుకు- దాదాపు 12 సంవత్సరాల కాలం తీసుకుంది. అయినప్పటికీ, ఒక ఫేస్ లిఫ్ట్ ను తిసుకొచ్చే సమయంలో సమయం ఏమి వృధా కాలేదు ఎందుకంటే దాని రెండవ- తరం స్కార్పియో తో రొజులను కొనసాగిస్తూ వచ్చింది. ఇది ప్రత్యర్ధులకు చాలా అవసరమైన ఎస్యువి మేఇయు వాటికి గట్టి పోటీను కూడా ఇస్తుంది. పోటీ గురించి మాట్లాడవలసివస్తే, స్కార్పియో వాహనం- హ్యుందాయ్ క్రీటా, టాటా సఫారి స్టోర్మ్, నిస్సాన్ టెరానో మరియు రెనాల్ట్ ఉత్పత్తులతో - డస్టర్ మరియు ఇటీవలే ప్రారంభించబడిన క్యాప్చర్తో పోటీ పడనుంది.

రిఫ్రెష్ అవతార్లో మహీంద్రా స్కార్పియో, 9.97 లక్షల రూపాయలు నుండి రూ. 16.01 లక్షల (ఎక్స్-షోరూమ్ ఇండియా) వరకు వెళుతుంది. మనము వేరియంట్- వివరణలోకి వెళ్ళడానికి ముందు, ప్రామాణిక అంశాలను తెలుసుకుందాము.

 

ముఖ్యమైనవి

 

పొడవుX వెడల్పుX ఎత్తు (మీ మీ)   

4456X 1,820X 1,995 (ఎస్3 కోసం 1,930 )

సీటింగ్ సామర్ధ్యం   

7,8,9

Mahindra Scorpio

ఇంజన్ స్పెసిఫికేషన్లు

 

 

 

ఇంజన్  

2.5- లీటర్ ఎం2డిఐసిఆర్

2.2- లీటర్ ఎంహాక్

2.2- లీటర్ ఎంహాక్

స్థానబ్రంశం

2,523 సిసి

2,179 సిసి

2,179 సిసి

గరిష్ట శక్తి

75 పిఎస్

120 పిఎస్

140 పిఎస్

గరిష్ట టార్క్

200 ఎన్ఎం

280 ఎన్ఎం

320 ఎన్ఎం

అందుబాటులో ఉండే రంగు ఎంపికలు: పెర్ల్ వైట్, నపోలి బ్లాక్, మోల్టన్ రెడ్ మరియు డిసాట్ సిల్వర్.

మహీంద్రా సంస్థ, ఈ ఎస్యువి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఇంధన సామర్ధ్య అధికారిక గణాంకాలను ఎవరికి తెలియజేయలేదు.

నవీకరించబడిన స్కార్పియో దాని వేరియంట్ పేర్లతో సహా అనేక మార్పులను పొందింది. ఎస్ తరువాత అనుసరించిన సరి సంఖ్యలను- బేసి సంఖ్యల ద్వారా భర్తీ చేశారు. అంతేకాక, వేరియంట్ జాబితా కూడా ఎనిమిది నుండి ఈసారి 6 కు పడిపోయింది. షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్- వీల్ డ్రైవ్ (4 డబ్ల్యూడి) అత్యంత శక్తివంతమైన ఇంజిన్తో, టాప్- ఎండ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, 5- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్- ఎస్3, ఎస్5 మరియు ఎస్7 (120పిఎస్) రకాల్లో అందించబడుతుంది, అయితే 6- స్పీడ్ మాన్యువల్ మిగిలిన మూడు వేరియంట్లకు అందించబడుతుంది. అన్ని వేరియంట్ లలో ఏ ఏ అంశాలు అందించబడుతున్నాయో చూద్దాం.

వేరియంట్: ఎస్ 3

ధర: రూ. 9.99 లక్షలు

దాని ఎంట్రీ- లెవల్ వేరియంట్లో, స్కోర్పియో 2.5 లీటర్ ఎం2డిఐసిఆర్ డీజిల్ ఇంజిన్తో లభిస్తుంది, ఇది 2.2 లీటర్ ఎంహాక్ మోటర్ వలె శక్తివంతమైనది కాదు. మీ వద్ద ఉన్న డబ్బుతో ఈ వేరియంట్ ను కొనుగోలు చేయదలిస్తే, దీనిలో అందించబడుతున్న ప్రధాన లక్షణాల జాబితా ఇక్కడ ఉంది:

మాన్యువల్ ఏసి               

వినైల్ సీటు అప్హోల్స్టరీ       

7 మరియు 9 సైడ్ సీటింగ్ కన్ఫిగరేషన్ అందుబాటులో ఉంది

టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్           

మాన్యువల్ సెంట్రల్ లాకింగ్       

హెడ్ల్యాంప్ లెవలింగ్

రిమోట్ ఇంధన మూత ఓపెనర్   

ఇంజిన్ ఎమోబిలైజర్           

మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ

మీరు ఊహించిన విధంగా, బేస్- స్పెక్ స్కార్పియో సౌలభ్యం, శక్తి మరియు భద్రత పరంగా చిన్నదిగా ఉంటుంది. ఈ వేరియంట్ లో చక్రాలకు ఏ రకమైన వీల్ క్యాప్లు లేకుండా 15- అంగుళాలతో ఉంటాయి, ఎస్5 లో పూర్తి వీల్ క్యాప్ లు 17- అంగుళాలతో ఉంటాయి. 10 లక్షల కన్నా తక్కువ ధరకే, స్కార్పియో యొక్క ఈ రకం విస్మరించవచ్చు. దాని స్థూల బరువుకు తగినంత లేదు, ఇది 2.5 టన్నుల కంటే ఎక్కువగా ఉంది. అందువల్ల, ఇంజిన్ మరింత ఎక్కువ పనితీరు అవసరం, అందుకే ఇది ఉత్తమ మైలేజ్ ను ఇవ్వలేదు. సంక్షిప్తంగా చెప్పలంటే, మీరు స్కార్పియో కావాలనుకుంటే, మీరు ఎస్5 వేరియంట్ నుండి పరిగణలోకి తీసుకోవాలి.

వేరియంట్: ఎస్5

ధర: రూ. 11.97 లక్షలు

ఎస్ 3 ధరతో పోలిస్తే : రూ .1.98 లక్షలు ఎక్కువ

Mahindra Scorpio

ఈ వేరియంట్లో 2.2 లీటర్ ఎం హాక్ డీజిల్ ఇంజిన్ అందించబడుతుంది, ఈ ఇంజన్ 120 పిఎస్ పవర్ ను / 280 ఎనెం గల టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది, బారీ ఇంజన్ ను భర్తీ చేసింది కానీ తక్కువ శక్తివంతమైన ఎం2డీఇసీఅర్ మిల్లును భర్తీ చేసింది. అయితే, ట్రాన్స్మిషన్ యూనిట్ అదే 5- స్పీడ్ మాన్యువల్గా మిగిలిపోయింది. కాబట్టి, మీరు మీ అదనపు డబ్బుతో ఏమి పొందాలనుకుంటున్నారు? ఎస్3 లో అందించబడిన అంశాలతో పాటు ప్రధాన లక్షణాలను ఎస్5 వేరియంట్లో అందించబడే లక్షణాల జాబితా క్రింద ఇవ్వబడింది:

బాడీ-రంగు ముందు మరియు వెనుక బంపర్స్         

17-అంగుళాల స్టీల్ రింలకు వీల్ క్యాప్లు                   

ఫ్యాబ్రిక్ సీటు అప్హోల్స్టర్తో 

ఒక టచ్ లేన్ మార్పు సూచిక                   

ముందు మరియు రెండవ వరుస కోసం 12వి యాక్ససరీ సాకెట్   

ఫాలో-హోమ్-హోమ్ హెడ్ల్యాంప్స్

ద్వంద్వ ఎయిర్బాగ్స్                             

ఏబిఎస్                                                     

పానిక్ బ్రేక్ సూచన

సీట్ బెల్ట్ రిమైండర్ లాంప్                       

 స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్                               

పెద్ద సీసా హోల్డర్ మరియు కప్ హోల్డర్ 

ఈ స్కార్పియో లో మరింత అద్భుతమైన అంశాలతో మొదలవుతుంది. మరింత శక్తివంతమైన ఇంజిన్, పెద్ద చక్రాలు మరియు మోర్ కిట్ ఆన్- బోర్డ్ మొత్తాన్ని అర్ధవంతమైన ప్యాకేజీ తో అందించబడుతుంది. అదనపు భద్రత పరంగా, ఇది వేగంగా దృష్టి కేంద్రీకృతమై ఉంది, అంటే ఇది రెండు ఎయిర్బాగ్స్ మరియు ఏబిఎస్ లతో కూడా అందించబడుతుంది. ఈ వేరియంట్ ప్రతీ ఒక్కరికీ సరిపోయే విధంగా ఉంది పెద్ద ఆకృతి కలిగి ఈ స్కార్పియో అందరినీ ఆకర్షిస్తుంది, కానీ దీనిని కొనుగోలు చేయాలంటే బారీ బడ్జెట్ కావల్సి ఉంది. ఖచ్చితంగా, ఇది అనేక ఫీచర్ లతో లోడ్ చేయబడటం లేదు, కానీ ఈ పరిమాణం మరియు ధర పరంగా ఊహించిన మొత్తంలో దాదాపు అన్ని ప్రాథమిక లక్షణాలు కలిగి ఉంది.

వేరియంట్: ఎస్7 (120పిఎస్)

ధర: రూ. 13.06 లక్షలు

ఎస్5 ధర పోలిస్తే: రూ 1.09 లక్షలు ఎక్కువ

Mahindra Scorpio

ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలు ఎస్5 వేరియంట్ అందించబడిన వలె ఉన్నాయి. అవును, మీరు ఊహించే ఉంటారు కదూ! ఎస్5 లో అందించబడిన అన్ని అంశాలతో పాటు ఈ ఎస్7 అదనపు ఫీచర్లతో నేరుగా అనుసంధానించబడింది. ఆ ప్రధాన అంశాలు ఏమిటో చూద్దాం:

బాడీ- కలర్ సైడ్ క్లాడింగ్, ఓఆర్విఎం లు మరియు డోర్ హ్యాండిళ్ళు         

ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు             

ముందు సీట్లకు ఆర్మ్ రెస్ట్లు

7 సైడ్ ఫేసింగ్ మరియు 8 ఫ్రంట్ ఫేసింగ్ సీటింగ్ కన్ఫిగరేషన్ అందుబాటులో ఉంది   

 విద్యుత్తు సర్దుబాటు ఓఆర్విఎం లు   

రూఫ్-మౌంట్ సన్ గ్లాస్ హోల్డర్

స్పీకర్లు మరియు ట్వీట్లతో 2- దిన్ ఆడియో సిస్టమ్                             

వెనుక డిఫోగ్గర్, వైపర్ మరియు వాషర్   

 లీడ్-మీ- టు- వాహనం హెడ్ల్యాంప్స్

పుడిల్ లాంప్స్                                                           

ప్రొజక్టార్ హెడ్ లాంప్స్                 

ఇంటెల్పైర్క్

వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్                                                   

యాంటీ థెఫ్ట్ అలెర్ట్           

 సిల్వర్ స్కిడ్ ప్లేట్, ముందు గ్రిల్ ఇన్సర్ట్ మరియు వెనుక సంఖ్య ప్లేట్

పైన అందించబడిన సౌకర్యాల జాబితాతో పాటు, ఎస్7 వేరియంట్ అనేక భద్రతా కారకాలను కూడా మెరుగుపరుస్తుంది, రేర్ డిఫోగ్గర్, వెనుక వైపర్ మరియు వాషర్, యాంటీ థెఫ్ట్ అలెర్ట్ మరియు రివర్స్ పార్కింగ్ ఒక స్లాట్లోకి ప్రవేశించినప్పుడు దృశ్య మరియు ఆడియో నోటిఫికేషన్లను ఇంటెల్లిపార్క్ టెక్నాలజీతో అందిస్తుంది . ఎస్3 మరియు ఎస్5 రకాల్లో లభ్యమయ్యే 8- సీట్ల లేఅవుట్ కోసం చూస్తున్న ఎవరికైనా ఈ వేరియంట్ ఉత్తమంగా ఉంటుంది. అంతేకాక, ఈ ధర వద్ద, స్కార్పియో ఒక అందమైన లక్షణాల ప్యాకేజీతో వస్తుంది మరియు బాడీ కలర్ స్లాట్ లతో వస్తుంది. అంతేకాకుండా, పైకప్పు మీద ఉన్న అదనపు స్కయ్ రాక్ పెద్ద పెద్ద వస్తువులను రవాణా చేయటానికి ఉపయోగపడుతుంది.

వేరియంట్: ఎస్7 (140పిఎస్)

ధర: రూ. 13.37 లక్షలు

ఎస్ 7 (120పిఎస్) ధరతో పోలిస్తే : రూ .31,000 ఎక్కువ

Mahindra Scorpio

ఈ ఎస్7 (140పిఎస్) వేరియంట్ లో అందించబడిన ఫీచర్ జాబితా సరిగ్గా పైన అందించబడిన అదే విధంగా ఉంటుంది. మీరు అదనంగా రూ 31,000 తో, ఏమిమి పొందవచ్చు అంటే, శక్తివంతమైన ఇంజిన్, ఒక 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఒక మెరుగైన బ్రేకింగ్ సెటప్ లను పొందవచ్చు. ఈ వేరియంట్ లో అందించబడిన 2.2 లీటర్ ఎం హాక్ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్ శక్తిని మరియు 320 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చెసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ముందు దానితో పోలిస్తే 20 పిఎస్ మరియు 40 ఎన్ ఎం లు ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది! మీరు ఎస్7 వేరియంట్ కోసం చూస్తుంటే, మీరు రూ .31,000 అదనపు ఖర్చు చేసి ఈ శక్తివంతమైన ఇంజంతో వెళ్ళాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

వేరియంట్: ఎస్9

ధర: రూ. 13.99 లక్షలు

ఎస్ 7 ధర తో పోలిస్తే: రూ. 62,000 ఎక్కువ

ఎస్ 7 ధర తో పోలిస్తే: రూ. 62,000 ఎక్కువ

62,000 రూపాయల ప్రీమియంతో ఈ వేరియంట్ తన ధర ట్యాగ్ను స్పష్టంగా సమర్థిస్తుంది. ఇది ఇప్పుడు అధిక ఖరీదైన అగ్ర శ్రేణి ఎస్11 వేరియంట్లో లభించే అదనపు ఫీచర్లను కూడా పొందుతుంది. ఇక్కడ ఆఫర్లో ఉన్న లక్షణాలు మీ రోజువారీ వినియోగం మరియు దీర్ఘ- కాల యాజమాన్య అనుభవాన్ని అలాగే ప్రీమియం అనుభూతిని అందించగలవు.  మీరు స్కోర్పియో యొక్క అధికారిక ఉపకరణాల జాబితా నుండి కొనుగోలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఇవ్వలేని ఏకైక లక్షణం రేర్ పార్కింగ్ కెమెరా. చివరిగా చేప్పేది ఏమిటంటే, ఎస్9 వేరియంట్ చాలా ఉపకరణాలను మరియు విలువకు తగినట్టుగా అందించబడుతుంది.

ఎల్ఈడి డీఅర్ఎల్ఎస్       

క్రూజ్ నియంత్రణ

 యాంటీ పించ్ మరియు ఆటో రోల్ డ్రైవర్ విండో     

గేర్ షిఫ్ట్ సూచిక

ముందు ఫాగ్ ల్యాంప్లు       

క్లైమేట్ కంట్రోల్                 

 స్పీడ్ హెచ్చరిక             

ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా డ్రైవర్ సమాచార ప్రదర్శన

 

టర్న్ సూచికలతో ఓఆర్విఎం లు     

జిపిఎస్ మరియు ఇతర కనెక్టివిటీ ఎంపికలతో 6 అంగుళాల టచ్స్క్రీన్ 

 

వేరియంట్: ఎస్11

ధర: రూ. 15.14 లక్షలు

ఎస్ 9 ధర తో పోలిస్తే: రూ .1.15 లక్షలు ఎక్కువ

Mahindra Scorpio

రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు టైర్ పీడన పర్యవేక్షణ వ్యవస్థ కాకుండా, ఎస్11 వేరియంట్లోని ప్రతి ఇతర లక్షణం అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, రూ. 1.15 లక్షల ప్రీమియం అధనపు ధరతో మీరు ఎస్9 లో పొందుపర్చిన అదనపు ఫీచర్లు సరిగ్గా సరిపోవు. మీరు టాప్- స్పెక్ స్కార్పియో ఎస్11 వేరియంట్ కావాలనుకుంటే, మీ బడ్జెట్ను రూ 1.23 లక్షల ద్వారా 4డబ్ల్యూడి డ్రైవ్ ట్రెయిన్ యొక్క సామర్ధ్యాన్ని పొందవచ్చు, తదుపరి సౌకర్యాల కోసం ఈ ఎస్ 11 4డబ్ల్యూడి వేరియంట్ ను కొనుగోలు చేయమని మేము సూచిస్తున్నాము.

రైన్ సెన్సింగ్ వైపర్స్               

లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ లివర్ 

ఆటో హెడ్ల్యాంప్లు                     

ఫాక్స్ లెథర్ అప్హోల్స్టెరీ

ముందు గ్రిల్ లో క్రోం ఇన్సర్ట్లు     

టైర్ ఒత్తిడి పర్యవేక్షణ వ్యవస్థ

మార్గదర్శకాలతో రివర్స్ పార్కింగ్ కెమెరా

 

వేరియంట్: ఎస్11 తో 4 డబ్ల్యూడి

ధర: రూ. 16.37 లక్షలు

ఎస్ 11 (2డబ్ల్యూడి) ధర తో పోలిస్తే - రూ. 1.23 లక్షలు ఎక్కువ

Mahindra Scorpio

స్11 వలె, ఈ వేరియంట్ కూడా 140పిఎస్ / 320 ఎన్ ఎం టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క కలయికతో వస్తుంది. అదనపు వ్యయం కోసం, మీరు షిఫ్ట్-ఆన్-ఫ్లై 4 డబ్ల్యూడి వ్యవస్థను పొందుతారు.

గమనిక: పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా.

అలాగే చదవండి: మహీంద్రా స్కార్పియో: ఓల్డ్ వర్సెస్ న్యూ

మరింత చదవండి: స్కార్పియో డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra స్కార్పియో 2014-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience