• English
  • Login / Register

మారుతి, హ్యుందాయ్ & మరిన్ని సంస్థలతో పాటూ అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల తయారీదారుల జాబితాలో కియా, MG కూడా చేరాయి

నవంబర్ 11, 2019 01:55 pm sonny ద్వారా సవరించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆటోమోటివ్ రంగంలో ఆర్ధిక మాద్యం కొనసాగుతున్నప్పటికీ వివిధ కార్ల తయారీదారులు ఎలా పనితీరుని అందించాయో చూద్దాం

Kia, MG Join The List Of Top 10 Best-Selling Carmakers With Maruti, Hyundai & More

భారత ఆటోమోటివ్ పరిశ్రమ ఈ సంవత్సరం మందగమనాన్ని ఎదుర్కొంటోంది మరియు అక్టోబర్ నెలలో అమ్మకాల సంఖ్యలు విడుదలయ్యాయి. ఇదే నెలలో అనేక పండుగలు కూడా జరుపుకున్నాము. ఇది 2019-2020 ఆర్థిక సంవత్స రానికి మధ్య భాగం కూడా అవ్వడంతో, భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీదారుల సంవత్సర అమ్మకాల గణాంకాలను విశ్లేషించడానికి మరియు పోల్చడానికి ఇది మంచి సమయం.

వీరంతా ఎలా దూసుకుపోతున్నారో, ఎవరు తేలుతున్నారు, ఎవరు మునిగిపోతున్నారు మరియు ఈ అల్లకల్లోల సమయంలో ఎవరు కష్టపడుతున్నారో చూద్దాం:

కార్లతయారీ సంస్థ

అక్టోబర్-19

అక్టోబర్-18

YoY గ్రోత్

 

మారుతి సుజుకి

1,39,121

1,35,948

2.33%

 

హ్యుందాయ్

50,010

52,001

-3.80%

 

మహీంద్రా

18,460

24,066

-23.29%

 

టాటా

13,169

18,290

-28%

 

కియా

12,854

-

-

 

టయోటా

11,866

12,606

-5.87%

 

రెనాల్ట్

11,516

7066

63%

 

హోండా

10,010

14,187

-29.44%

 

ఫోర్డ్

7017

9044

-22%

 

MG

3,536

-

-

 

Kia, MG Join The List Of Top 10 Best-Selling Carmakers With Maruti, Hyundai & More

ముఖ్యమైనవి

  •  మారుతి సంస్థలో ఆర్ధిక మాధ్యం ఉన్నప్పటికీ సంవత్సరానికి సానుకూల వృద్ధిని నమోదు చేసింది. కార్ల తయారీదారు గత ఆరు నెలల్లో ఎస్-ప్రెస్సో మరియు XL6 వంటి కొత్త మరియు అప్‌డేటెడ్ మోడళ్లను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2020 తరువాత డీజిల్ వేరియంట్‌లను పూర్తిగా నిలిపివేసే యోచనను మారుతి ప్రకటించిన విషయాన్ని పరిశీలిస్తే ఇది మరింత ఆకట్టుకుంటుంది.
  •  ఆర్ధిక మాంద్యం ఉన్నప్పటికీ వెన్యూ మరియు గ్రాండ్ i10 నియోస్ వంటి కొత్త మోడళ్లతో హ్యుందాయ్ తమ ఉనికిని చాటుకున్నాయని చెప్పాలి. ఇది పైన పేర్కొన్న మాస్ కార్ల తయారీదారుల కంటే అతి తక్కువ YOY గ్రోత్ ని సంపాదించుకున్నాయి.
  •  సంవత్సరానికి అమ్మకాల పోలిక పరంగా టయోటా తర్వాతి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది, అమ్మకాలలో కేవలం ఆరు శాతం తగ్గుదల ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ యొక్క ఏకైక కొత్త మోడల్ మారుతి బాలెనో గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌ గా బ్యాడ్జ్ చేయబడింది.
  •  ఈ అక్టోబర్‌లో సంవత్సరానికి వృద్ధి పరంగా మహీంద్రా 23 శాతం నష్టాన్ని చవిచూసింది, అనగా 5,500 యూనిట్లు తక్కువ. అక్టోబర్ 2018 తో పోల్చితే టాటా 2019 అక్టోబర్‌లో 5,000 కంటే తక్కువ యూనిట్ల అమ్మకాలకు పడిపోయింది, ఈ పరిశ్రమ తిరోగమనంలో ఈ బ్రాండ్ కూడా కష్టపడుతోందని  అర్ధమయ్యింది.

 Kia, MG Join The List Of Top 10 Best-Selling Carmakers With Maruti, Hyundai & More

  •  అక్టోబర్ 2019 లో సంవత్సరానికి అమ్మకాల గణాంకాలలో 63 శాతం వృద్ధిని రెనాల్ట్ నమోదు చేసింది. క్విడ్ ఫేస్‌లిఫ్ట్, డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మరియు ట్రైబర్ యొక్క ఇటీవలి లాంచ్ ల ద్వారా ఇవి సాధ్యపడ్డాయి.
  •  హోండా అమ్మకాలలో దాదాపు 30 శాతం క్షీణత నమోదు చేయగా, ఫోర్డ్ సంవత్సరానికి అమ్మకాలలో 22 శాతం పడిపోయింది.

కొత్తగా వచ్చిన MG మోటార్ మరియు కియా అక్టోబర్ 2019 లో ఒక్క SUV తో – MG హెక్టర్ మరియు కియా సెల్టోస్ అమ్మకాల సంఖ్యను ఆస్వాదిస్తున్నాయి. చిన్న సెల్టోస్ కియాను ఐదవ స్థానంలో ఉంచుతుంది, వోక్స్వ్యాగన్, స్కోడా, నిస్సాన్ మరియు ఇతరుల కంటే హెక్టర్ ముందుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

1 వ్యాఖ్య
1
A
alok bhagat
Nov 8, 2019, 1:24:27 PM

Please give Maruti's carwise statics.

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience