రగ్గెడ్ న్యూ ఎస్యువి టైర్ల గ ా రేంజర్ సీరీస్ ను ప్రవేశపెట్టిన జెకె టైర్స్
జూలై 28, 2015 03:26 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఎస్యువి అమ్మకాల అభివృద్ధి తరువాత, జెకె టైర్స్ రేంజర్ శ్రేణి ని ప్రారంబించింది. అంతేకాకుండా, భారతదేశం లో ప్రీమియం ఎస్యూవీ టైర్ల కొత్త శ్రేణిని ప్రారంభించింది. వీరు, అధిక పనితీరు కలిగిన టైర్లను, ఆన్ రోడ్ మరియు ఆఫ్-రోడ్ రహదారుల పై ఉన్నతమైన పట్టును మరియు నియంత్రణను అందించేలా ఈ టైర్లను రూపొందించారు. ఈ రేంజర్ మోడల్ రెండు రకాల వేరియంట్ లను కలిగి ఉంది. అవి వరుసగా, రేంజర్ ఏ/టి. ఇది ఆఫ్ రోడ్ల పై ఉన్నతమైన పటుత్వాన్ని ఇస్తుంది. రెండవది, రేంజర్ హెచ్/టి. ఇది తారు రోడ్లపై మంచి పటుత్వాన్ని ఇస్తుంది. ఈ జెకె టైర్స్ నుండి విడుదల చేయబడిన ఈ టైర్లను గోవా, పనాజీ వద్ద జూలై 26 న ప్రయోగాత్మకంగా రోడ్ డ్రైవ్ ను ప్రారంబించారు. దాని నాణ్యత శ్రేణి మరియు కంపెనీ విశ్వాసాని తెలుసుకునేందుకై, ఉత్పత్తి యొక్క ప్రవేశానికి ముందు రోడ్ డ్రైవ్ ను నిర్వహించారు.
ఈ రేంజర్ సిరీస్ డ్యూయల్ ట్రెడ్ కాంపౌండ్ ను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా పూర్తి లోతు గీతలు తో ఉండటం వలన సరైన రోడ్ కాంటాక్ట్ మరియు ఉన్నతమైన బహుళ ప్రాంతపు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ రేంజర్, ప్రత్యేకంగా కఠినమైన రహదారి భూభాగాల అధిగమించడానికి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల కోసం రూపకల్పన చేసింది. ఈ టైర్లు, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మరియు రోడ్ పై ఎటువంటి పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి. ఈ టైర్లు 10 రకాల పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని రకాల పరిమాణం కలిగిన టైర్లను సుమారు అన్ని రకాల ఎస్యువి లలో మనం చూడవచ్చు. ప్రస్తుతం భారతదేశం లో ఈ క్రింది ఎస్యువి లలో ఈ టైర్లను మనం గమనించవచ్చు. ఆడి క్యూ సీరీస్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, ఫార్చ్యూనర్, నిస్సాన్ ఎక్స్-ట్రైల్, టెర్రనో, పజెరో, ఈకోస్పోర్ట్, డస్టర్ వంటి ఎస్యువి లలో మనం ఈ టైర్లను గమనించవచ్చు.
భారతదేశం ఆపరేషన్స్, జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధ్యక్షుడు అయిన మిస్టర్ వివేక్ కామ్రా ప్రయోగ సమయంలో మాట్లాడుతూ, జెకె టైర్స్ యొక్క అభివృద్ది కి దాని యొక్క టెక్నాలజీ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాలే కారణం అని తెలిపారు. అంతేకాకుండా, రేంజర్ సిరీస్ నుండి ఉత్పత్తి అయిన ఈ వేరియంట్లు ఆర్ అండ్ డి సౌకర్యాలను మరింత పెంపొందించుతున్నాయి అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతను ఈ ప్రయోగ సమయం లో మరొక విషయాన్ని కూడా వ్యక్తం చేశారు అది ఏమిటంటే, కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అయిన ఈ జెకె టైర్స్, కొనుగోలుదారులను దృష్ట్టిలో పెట్టుకొని వారి అవసరాలను అనుగుణంగా అనేక సాకేతిక అధునాతన ఉత్పత్తులను పరిచయం చేయడమే మా ప్రత్యేక లక్ష్యం అని వ్యాఖ్యానించారు.
రేంజర్ సిరీస్ ను వివిధ టెర్రైన్స్ మీద జెకె టైర్స్ ప్రొఫెషనల్ రేసు డ్రైవర్లచే ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినంగా పరీక్షించడం జరిగింది. ఇలా పరిక్షించడం వలన ఈ సిరీస్, అత్యంత నిర్వహణ, పట్టును మరియు బ్రేకింగ్ లలో మంచి పటుత్వాన్ని కలిగి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ జెకె రేంజర్ ఏటి సిరీస్, బ్రేక్ వేయగానే 4 సెకన్లలో ఆగిపోగలవు. అది పొడి రోడ్ లేదా తడి రహదారి పైన అయినా సరే. పొడి రోడ్లపై 0 నుండి 100 కంఫ్ వేగంలో వెళుతున్నప్పుడు, వాహనాన్ని ఆపడానికి 4 సెకన్ల సమయం పడుతుంది. అదే తడి రోడ్లపై 0 నుండి 80 కంఫ్ వేగంతో వెళుతున్నప్పుడు, వాహనాన్ని ఆపడానికి 4 సెకన్ల సమయం పడుతుంది. ఈ టైర్ తయారీదారుడు, సంవత్సరానికి సుమారు 20 మిలియన్ టైర్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని భారతదేశం లో మరియు మెక్సికో లో ప్రస్తుతం 9 ప్లాంట్లను కలిగి ఉన్నాడు. భారత మార్కెట్లో పాటు, జెకె టైర్స్, పెరుగుతున్న డిమాండ్లను చూసి సౌత్ ఈస్ట్ ఆసియా వైపు మక్కుచూపిస్తున్నాడు.