• English
  • Login / Register

ఇండియన్ ఆటో ఇండస్ట్రీ 2026 సంవత్సరానికి రూ.18.9 ట్రిలియన్, అనగా 285 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది అని అంచనా

సెప్టెంబర్ 04, 2015 03:43 pm nabeel ద్వారా సవరించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: తాజా నివేదికల ప్రకారం, భారతదేశం లోని ఆటో విభాగం వచ్చే దశాబ్దానికి 4 రెట్లు పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. ప్రచురితమైన నివేదిక ప్రకారం, బుధవారం రోజున హెవీ ఇండస్ట్రీస్ విభాగం వారు, ఇండియన్ గ్రోస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (జీడీపీ) లో ఆటో విభాగం 12% పైగా మరియూ తయారీ విభాగంలో 7.5% వచ్చే దశాబ్దానికి పెరగనున్నాయి. ఇలా అయితే, ఆటోమొబైల్ విభాగం దాదాపుగా రూ.18.9 ట్రిలియన్ (యూఎస్డీ 285 బిలియన్) కి 2026 సంవత్సరానికి పెరుగుతుంది. 

ఇంకా ఇంకా అంతర్జాతీయ బ్రాండ్లు భారతదేశానికి వస్తున్నాయి. దేశంలో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ మంచి అంతర్జాతీయతను చవి చూస్తోంది. జీప్ మరియూ జేఎలార్ వంటి బ్రాండ్లు ఇప్పుడు భారతదేశాన్ని ఎదుగుతున్న మార్కెట్ గా గుర్తించాయి. ఈ ఏడాది మొదట్లో, ఫియాట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ వారు టాటా మోటర్స్ లిమిటెడ్ వారి విస్థరణ అయిన ఫియట్ ఇండియా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 280 మిలియన్ డాలర్ల పెట్టుబడిని చేస్తునట్టు ప్రకటించారు. ఫియట్ క్రైస్లర్ వారు ఈ పెట్టుబడి ద్వారా కొత్త జీప్ వాహనం తయారీకి ఇది దోహదం చేసి 2017 సంవత్సరం రెండవ త్రైమాసికానికి ఉత్పత్తి మొదలు అయ్యేట్టుగా సహాయపడుతుంది అని అభిప్రాయపడుతున్నారు. టాటా వారి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ సంవత్సరపు అత్యధికంగా 58,481 వాహనాల అమ్మకాలను చవి చూశారు. ఇది గత ఏడాదికంటే 6 శాతం ఎక్కువ. కొత్త డిస్కవరీ స్పోర్ట్ ని రూ.46.10 లక్షల ఎక్స్-షోరూం ముంబై ధరకు విడుదల చేసారు.

 మెర్సిడెస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్లు  15 ఇన్ 15 వ్యూహంతో భారతదేశంలోని వారి ప్రాముఖ్యతను విస్తరించుకుంటుంది. జర్మన్ నుండి సరికొత్త రెండు ఎంట్రీలలో ఒకటి ఫ్లాగ్షిప్ 2015  మెర్సిడెస్ ఎ ఎంజి ఎస్ 63 సెడాన్ రూ 2.53 కోట్లు వద్ద ఆగస్ట్ 11 న ప్రారంభించబడినది మరియు ఇంకొక సి63 ఎస్ ఎ ఎంజి సెడాన్ రూ.1.3 కోట్లు( ఎక్స్-షోరూం, డిల్లీ) వద్ద నిన్న ప్రారంభించబడినది. ఈ రెండు కార్లు కూడా 1 కోటి ని దాటి ఉండి భారతదేశంలో మెర్సిడీస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఇదేకాకుండా, వాహనతయారీదారుడు కొత్త ఆటో హంగర్ ని రాయిపూర్ లో ప్రారంభించారు. దీనివలన సంస్థ భారతదేశంలో విస్తరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience