Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మరీ నెమ్మదిగా నడుస్తున్న కారణంగా గూగుల్ వారి సెల్ఫ్-డ్రైవ్ కారుని ఆపారు!

నవంబర్ 17, 2015 02:45 pm nabeel ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

2012 నుండి రోడ్లపై నడుస్తున్న గూగుల్ అటానమస్ కారు ఆఖరికి పోలీసుల చేతికి ఒక సంఘటన కారణంగా చిక్కింది. ఈ కంపెనీ వారి కారు ఈమధ్యనే కాలిఫోర్నియాలో మరీ నెమ్మదిగా నడుస్తున్న కారణంగా పోలీసులచే ఆపబడింది. ఈ సంఘటన మౌంటెయిన్ వ్యూ లో చోటు చేసుకుంది. అప్పుడు ఈ కారు గంటకి 56 కిలోమీటర్ల కనీస వేగం పరిణితి ఉన్న లేన్ లో గంటకి 39 కిలోమీటర్ల వేగంతో నడిచింది. నివేదిక ప్రకారం, " ఆఫీసరు కారు ఆపి ఆపరేటర్లతో ఈ కారు వేగం నియంత్రించే తీరు ఎటువంటిదో వివరాలు తెలుసుకుని, ఈ కారు వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చునో అనే వివరణన్ని అందించచారు."

ఈ సంగటన తరువాత, గూగుల్ వారు ఒక అధికారిక ప్రకటనతో ముందుకు వచ్చారు," మరీ నెమ్మదిగా నడవడమా? మనుషులని ఈ తప్పిదం కారణంగా నిలదీయడం అంథగా జరగదు. మా కార్ల వేగాన్ని మేము రక్షణ కారణాల వలన గంటకి 25 మైళ్ళ వేగం వద్ద నియంత్రించాము. రయ్యి మని వీధులలో వెళ్ళకుండా, హాయిగా ప్రశాంతంగా నడవాలి అనే ఉద్దేశంతో ఇల నియంత్రించడం జరిగింది.

ఈ ఆఫీసరు లాగే, మా ప్రాజెక్టు గురించి మరింత తెలుసుకోవాలి అని అనుకునే వారు ఇలా మమ్మల్ని క్రిందకు తోసేందుకు ప్రయత్నిస్తారు. ఒక 1.2 మిలియన్ మైళ్ళు అటానమస్ గా నడిచిన ఈ తరువాత (ఇది మానవ డ్రైవింగ్ లో 90 ఏళ్ళ తో సమాన అనుభవం) మేము ఎప్పుడు వేలు ఎత్తి చూపబడలేదు అని గర్వంగా చెప్పగలము!," అని అన్నారు.

జులై 2015 నుండి, గూగుల్ సెల్ఫ్-డ్రైవ్ కార్లు 14 చిన్నపాటి ట్రాఫిక్ ప్రమాదాలను నమోదు చేసింది. కంపెనీ వారి ప్రకారం, ఈ అన్ని ప్రమాదాలకి కారణం నడిపే వ్యక్తి లేదా అవతలి వారిదే తప్పించి, గూగుల్ టెక్నాలజీ తప్పిదం కానీ లోపం కాని కారణం కాదు అని అంటున్నారు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర