మరీ నెమ్మదిగా నడుస్తున్న కారణంగా గూగుల్ వారి సెల్ఫ్-డ్రైవ్ కారుని ఆపారు!

నవంబర్ 17, 2015 02:45 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

2012 నుండి రోడ్లపై నడుస్తున్న గూగుల్ అటానమస్ కారు ఆఖరికి పోలీసుల చేతికి ఒక సంఘటన కారణంగా చిక్కింది. ఈ కంపెనీ వారి కారు ఈమధ్యనే కాలిఫోర్నియాలో మరీ నెమ్మదిగా నడుస్తున్న కారణంగా పోలీసులచే ఆపబడింది. ఈ సంఘటన మౌంటెయిన్ వ్యూ లో చోటు చేసుకుంది. అప్పుడు ఈ కారు గంటకి 56 కిలోమీటర్ల కనీస వేగం పరిణితి ఉన్న లేన్ లో గంటకి 39 కిలోమీటర్ల వేగంతో నడిచింది. నివేదిక ప్రకారం, " ఆఫీసరు కారు ఆపి ఆపరేటర్లతో ఈ కారు వేగం నియంత్రించే తీరు ఎటువంటిదో వివరాలు తెలుసుకుని, ఈ కారు వలన ఎటువంటి ఇబ్బందులు  తలెత్తవచ్చునో  అనే వివరణన్ని అందించచారు."

ఈ సంగటన తరువాత, గూగుల్ వారు ఒక అధికారిక ప్రకటనతో ముందుకు వచ్చారు," మరీ నెమ్మదిగా నడవడమా? మనుషులని ఈ తప్పిదం కారణంగా నిలదీయడం అంథగా జరగదు. మా కార్ల వేగాన్ని మేము రక్షణ కారణాల వలన గంటకి 25 మైళ్ళ వేగం వద్ద నియంత్రించాము. రయ్యి మని వీధులలో వెళ్ళకుండా, హాయిగా ప్రశాంతంగా నడవాలి అనే ఉద్దేశంతో ఇల నియంత్రించడం జరిగింది.

ఈ ఆఫీసరు లాగే, మా ప్రాజెక్టు గురించి మరింత తెలుసుకోవాలి అని అనుకునే వారు ఇలా మమ్మల్ని క్రిందకు తోసేందుకు ప్రయత్నిస్తారు. ఒక 1.2 మిలియన్ మైళ్ళు అటానమస్ గా నడిచిన ఈ తరువాత (ఇది మానవ డ్రైవింగ్ లో 90 ఏళ్ళ తో సమాన అనుభవం) మేము ఎప్పుడు వేలు ఎత్తి చూపబడలేదు అని గర్వంగా చెప్పగలము!," అని అన్నారు.

జులై 2015 నుండి, గూగుల్ సెల్ఫ్-డ్రైవ్ కార్లు 14 చిన్నపాటి ట్రాఫిక్ ప్రమాదాలను నమోదు చేసింది. కంపెనీ వారి ప్రకారం, ఈ అన్ని ప్రమాదాలకి కారణం నడిపే వ్యక్తి లేదా అవతలి వారిదే తప్పించి, గూగుల్ టెక్నాలజీ తప్పిదం కానీ లోపం కాని కారణం కాదు అని అంటున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience