• English
  • Login / Register

మారుతి సియాజ్ 2018: మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 5 విషయాలు

మార్చి 15, 2019 05:18 pm anonymous ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారతదేశం యొక్క ప్రత్యేఖమైన ఫేస్‌లిఫ్ట్

Suzuki Alivio

మారుతి సంస్థ 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ని 20, ఆగస్ట్ 2018 లో ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసుకుంది. అయితే ఇది ఇంకా విడుదల కానప్పటికీ, దీని లక్షణాలు ఇంజన్ తో సహా చాలా వరకు మాకు తెలిసినవే. ఇక్కడ మీరు ఫేస్లిఫ్ట్ సెడాన్ గురించి తెలుసుకోవలసిన ఐదు ముఖ్యమైన విషయాలు.

2018 Ciaz

అయితే, రెండు వెర్షన్లు వెనుక నుండి చాలా పోలికలను కలిగి ఉంటాయి. అల్వియో వలే, ఇండియా-స్పెక్ సియాజ్ ఫేస్‌లిఫ్ట్  LED ఎలిమెంట్స్ తో  నవీకరించబడిన టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంది. అల్వియో లో, వెనుక బంపర్ డ్యుయల్ టోన్ ట్రీట్‌మెంట్ తో వస్తుంది, అయితే 2018 సియాజ్ పాత మోడల్ ని పోలి ఉండి, రెఫ్లెక్టర్ హౌసింగ్ చుట్టూ  కొత్త క్రోం చేరికలను కలిగి ఉంది.

ప్రారంభించినపుడు డీజిల్ ఇంజిన్ ఉండదు

1.3-litre DDIS 200 engine with SHVS

సియాజ్ ఫేస్లిఫ్ట్ ప్రారంభించేటపుడు డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉండదు. డీజిల్ ఆధారిత సియాజ్ దీపావళి 2018 నాటికి ప్రారంభించబడుతుందని ఊహించాము మరియు ఎటువంటి మెకానికల్ మార్పులను కలిగి ఉండదు. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి 90PS పవర్ / 200Nm టార్క్ ని ఉత్పత్తి చేసే అదే 1.3 లీటర్ DDiS 200 డీజిల్ ఇంజిన్ తో కొనసాగుతుంది.

ప్రారంభించేటపుడు డీజిల్ ఇంజిన్ ని అదించకపోడానికి ప్రత్యేఖమైన కారణం తెలియనప్పటికీ, ఇది పెట్రోల్-ఆధారిత 2018 సియాజ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని మారుతి సంస్థ అనుకుంటుంది,ఇది ఒక కొత్త ఇంజిన్ ను పొందుతుంది. డీజిల్ సెడాన్ అమ్మకాలు సంఖ్య తగ్గిపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సియాజ్ కారు  పెట్రోల్: డీజిల్ అమ్మకాల నిష్పత్తి ని ఒకసారి 60:40 ఈ విధంగా కలిగి ఉండేది, కానీ ఇప్పుడు గత సంవత్సరం ఈ నిష్పత్తి 80:20 కి పడిపోయింది. దీనికి కారణం గత సంవత్సరం ప్రభుత్వం హైబ్రిడ్లపై విధి రాయితీని తిరిగి తీసుకున్న తరువాత డీజిల్ ఆధారిత సియాజ్ ధరలు పెరిగాయి, తద్వారా డీజిల్ అమ్మకాలు తగ్గిపోయాయి.

కొత్త పెట్రోల్ ఇంజిన్

అయితే అవుట్గోయింగ్ సియాజ్ 1.4 లీటర్ (92Ps పవర్/ 130Nm టార్క్)ని అందించే పెట్రోల్ ఇంజిన్ శక్తిని కలిగి ఉండగా, నవీకరించబడిన సెడాన్ కొత్త 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను పొందుతుంది. ఈ ఇంజిన్ 105Ps పవర్ మరియు 138Nm టార్క్ ని అందిస్తూ మునుపటి 1.4 లీటర్ ఇంజన్ కంటే 13Ps పవర్ మరియు 8Nm టార్క్ ని ఎక్కువగా ఇస్తుంది. మునుపటి లానే 5 స్పీడ్ మాన్యువల్ టెక్నాలజీ మరియు 4- స్పీడ్ ఆటోమెటిక్ తో అందించబడుతుంది. ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్ SHVS (సుజుకి యొక్క స్మార్ట్ హైబ్రిడ్ వాహనం) టెక్నాలజీ తో జతచేయబడుతుంది మరియు ఇది భారతదేశంలో మొదటిసారిగా మారుతి పెట్రోల్ లో అందించడం జరిగింది.

కొత్త సియాజ్ అవుట్గోయింగ్ మోడల్ కంటే మరింత శక్తివంతమైనదిగా ఉన్నప్పటికీ మరింత పొదుపుగా ఉంటుంది,  దీనికిగానూ SHVS టెక్నాలజీ కి ధన్యవాదాలు. ఇది మాన్యువల్ టెక్నాలజీ కి గానూ 21.56 కిలోమీటర్ల మైలేజ్ ని మరియు ఆటోమెటిక్ కి గానూ 20.28 కిలోమీటర్ల మైలేజ్ కలిగి ఉంటుంది. మరోవైపు ప్రీ-ఫేస్లిఫ్ట్ పెట్రోల్ సియాజ్,మాన్యువల్ టెక్నాలజీ కోసం 20.73Kmpl మైలేజ్ ని మరియు ఆటోమెటిక్ కోసం 19.12Kmpl మైలేజ్ ని అందించేది.  

మంచి భద్రతా లక్షణాలు

Dual Front Airbagsఅవుట్గోయింగ్ సియాజ్ డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, EBD తో ABS మరియు ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ ని ఈ శ్రేణిలో ప్రమాణంగా కలిగి ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ సియాజ్ పైన పేర్కొన్న భద్రతా లక్షణాలతో పాటుగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ లాంచ్ అసిస్ట్ వంటి అధనపు లక్షణాలతో ప్రామాణికంగా వస్తుంది. ఈ కొత్త లక్షణాలు సియాజ్ ని భద్రత పరంగా దాని విభాగంలో  మంచి-లక్షణాలను కలిగి ఉన్న కార్లలో ఒకటిగా చేస్తుంది. అయితే, 2018 సియాజ్ కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ ని కలిగి లేదు. ఈ సైడ్ మరియు కర్టైన్ ఎయిర్‌బ్యాగ్స్ సియాజ్ ప్రధాన పోటీదారులయిన హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా మరియు టొయోటా యారీస్ లో ఇప్పటికే అందించబడి ఉన్నాయి.   

పోటీతత్వపు ధర:

Maruti Ciaz

అవుట్గోయింగ్ సియాజ్ యొక్క ధర రూ.7.83 లక్షల దగ్గర ప్రారంభమయ్యి రూ.10.6 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉండి,  దేశంలో అత్యంత సరసమైన పెట్రోల్-ఆధారిత సెడాన్ గా మారుతోంది. అయితే, 2018 సియాజ్ అదనపు ప్రామాణిక ఫీచర్లు మరియు SHVS టెక్ లకు ధరల పెరుగుదల చూడవచ్చు. ఇది పెట్రోల్-ఆధారిత వెర్నా బేస్ వేరియంట్ కంటే చాలా ఖరీదైనదిగా (మరింత లక్షణాలతో కూడా) ఉండవచ్చు. దీనిలో లక్షణాలను మరింత పెంచడం జరిగింది మరియు ఇప్పటికీ విభాగంలో పోటీతత్వపు ఆఫరింగ్ గా  ఉండవచ్చు.    

 

ద్వారా ప్రచురించబడినది
Anonymous
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience