Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2024 నుండి మొదలుకొని, భారత ప్రత్యేక కార్ؚల క్రాష్ టెస్టింగ్ పగ్గాలను భారత్ NCAPకు అప్పగించనున్న గ్లోబల్ NCAP

ఆగష్టు 25, 2023 02:12 pm rohit ద్వారా ప్రచురించబడింది

గ్లోబల్ NCAP, భారత్ NCAP అధికారులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు మద్దతును అందించడం కొనసాగిస్తుంది

  • అక్టోబర్ 1, 2023 నుండి భారత్ NCAP కార్ؚలను పరీక్షించడం ప్రారంభిస్తుంది.

  • గ్లోబల్ NCAP 2011లో ప్రారంభమైంది, 2014లో #SaferCarsForIndia ప్రచారాన్ని ప్రారంభించింది.

  • ఇప్పటి వరకు 50 మోడల్ లను క్రాష్ టెస్ట్ చేసింది, 0 నుండి పూర్తిగా 5 స్టార్ؚల వరకు స్కోర్ؚలను కేటాయించింది.

  • మెరుగైన రేటింగ్ ను పొందిన వాహనాలలో మహీంద్రా XUV700, టాటా పంచ్ మరియు స్కోడా కుషాక్ ఉన్నాయి.

ఇటీవల, ప్రతి భారతీయుడి మనసు గర్వంతో ఉప్పొంగిపోతోందని మేము ఖచ్చితంగా చెప్పగలము, ఎందుకంటే మన దేశం రెండు ముఖ్యమైన చారిత్రాత్మక మైలురాళ్లను సాధించింది: చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్ అవ్వడం మరియు భారత్ NCAP (కొత్త విశ్లేషణ కార్యక్రమం) ప్రారంభం కావడం. ఈ రెండు రంగాలలో విజయం సాధించడం, సంబంధిత పరిశ్రమలలో జరిగిన సాంకేతిక అభివృద్ధి కారణంగా సాధ్యమైంది.

View this post on Instagram

A post shared by CarDekho India (@cardekhoindia)

భూసంబంధ పురోగతిపై దృష్టి సారిస్తే, భారత్ NCAP, గ్లోబల్ NCAP అనుసరించే ప్రమాణాలను మరియు ప్రోటోకాల్స్ ను అనుసరిస్తుంది. అందువలన, ఈ అంతర్జాతీయ సంస్థ, భారతదేశానికి ప్రత్యేకమైన మోడల్ ల క్రాష్ టెస్టింగ్ؚను 2024 నుండి నిలిపివేయాలని నిర్ణయం తీసుకొని, కొత్త భారత వాహన భద్రత కార్యక్రమంపై విశ్వాసాన్ని ప్రకటించింది. మన దేశంలో విక్రయించే ప్రతి మోడల్ؚకు BNCAP ప్రత్యేకంగా భద్రతా రేటింగ్ؚలను ఇస్తుంది, ఇది గుర్తించగలిగిన సురక్షితమైన కార్ؚను ఎంచుకోవడంలో కొనుగోలుదారులకు సహాయపడుతుంది.

గ్లోబల్ NCAP ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

ET ఆటోతో ఇంటర్వ్యూలో, గ్లోబల్ NCAP ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డేవిడ్ వార్డ్ ఇలా అన్నారు, “మా లైన్అప్ؚలో మరొక 10 మోడల్ లు ఉన్నాయి అంతే. మేము భారత్ NCAPకి పోటీ కార్యక్రమంగా ఉండాలి అనుకోవడం లేదు. ఇది వినియోగదారులను కంగారు పెడుతుంది, ఎవరికీ ప్రయోజనాన్ని కలిగించదు.”

ఇది కూడా చదవండి: Bharat NCAP: సురక్షితమైన కార్‌ల కోసం ప్రవేశపెట్టనున్న కొత్త కార్యక్రమం గురించి కారు తయారీదారుల అభిప్రాయం

తదుపరి చర్య

గ్లోబల్ భద్రతా సంస్థతో మా సహకారం పూర్తిగా దీనితో ఆగిపోదు, ఎందుకంటే ఈ అంతర్జాతీయ సంస్థ, రోడ్డు రవాణా మరియు హైవేలు (MoRTH)కు టెక్నికల్ సెక్రెటేరియట్ అయిన సెంట్రల్ ఇన్ؚస్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాన్స్ؚపోర్ట్ (CIRT)తో అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (MoU) పై సంతకం చేసింది. ఈ ఒప్పందం భాగంగా, గ్లోబల్ NCAP, భారత్ NCAP అధికారులకు మద్దతును మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడాన్ని కొనసాగిస్తుంది.

ఇది కూడా చదవండి: భారత్ NCAP Vs గ్లోబల్ NCAP: సారూప్యతలు మరియు తేడాల వివరణ

ఇప్పటివరకు భారతదేశంపై గ్లోబల్ NCAP ప్రభావం

గ్లోబల్ NCAP 2011లో ప్రారంభం అయినప్పటికీ, ఇది #SaferCarsForIndia ప్రచారాన్ని2014లో మొదలుపెట్టింది, దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వలన సంభవిస్తున్న అధిక మరణాల సంఖ్యను తగ్గించేందుకు భారతదేశంలో విక్రయించే కార్ؚల భద్రత విశ్లేషణను ఇది ప్రారంభించింది. ఇప్పటివరకు ఇది 50 మోడల్ ల కంటే ఎక్కువ క్రాష్ టెస్ట్ؚను నిర్వహించింది, ఈ వాహనాలు 0 నుండి 5-స్టార్ؚల రేటింగ్ వరకు స్కోర్ؚను పొందాయి. మొదటి బ్యాచ్ ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, అత్యున్నత భద్రత రేటింగ్ؚలను పొందేలా కృషి చేయడానికి మాస్-మార్కెట్ కార్ బ్రాండ్ؚలకు ప్రేరణను ఇచ్చాయి.

గ్లోబల్ NCAP పరీక్షలలో మెరుగైన రేటింగ్ ను పొందిన వాహనాలలో మహీంద్రా XUV700, టాటా పంచ్, స్కోడా స్లేవియా-వోక్స్వ్యాగన్ వర్చుస్/స్కోడా కుషాక్-వోక్స్వ్యాగన్ టైగూన్ జంటలు ఉన్నాయి, ఇవి ఐదు స్టార్ؚలను పొందాయి.

సంబంధించినవి: మెరుగైన భద్రత కోసం క్రాష్ టెస్ట్ పారామితులను అప్ؚడేట్ చేయడం కోసం ఇప్పటికే ప్రణాళికలను కలిగి ఉన్న భారత్ NCAP

భారత్ NCAP సారాంశం

కొత్త భారత్ NCAP అసెస్మెంట్ؚలు అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభం అవుతాయి. ఇవి గ్లోబల్ NCAP ప్రోటోకాల్స్ؚకు అనుగుణంగా రూపొందించబడ్డాయి మరియు ఇందులో ఫ్రంటల్ ఆఫ్ؚసెట్, సైడ్ ఇంపాక్ట్ మరియు పోల్ సైడ్ ఇంపాక్ట్ వంటి భద్రతా పరీక్షలు ఉంటాయి.

మూలం

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.42 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.7 - 9.84 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర