• English
  • Login / Register

ఫీగో ఆస్పైర్ : ఇది ఫోర్డ్ యొక్క ఉత్తమమైన అడుగుగా భావించవచ్చా?

ఆగష్టు 11, 2015 11:40 am అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్ :

సరే ! ఫోర్డ్ ఎట్టకేలకు వారి మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్ అయిన ఫీగో ఆస్పైర్ ని రెండు రోజుల్లో ముందుకు తీసుకు రానుంది. కాని ప్రశ్న అయితే ఇంకా మిగిలే ఉంది. ఇది భారతదేశంలో ఈ అమెరికా కి చెందిన ఫోర్డ్ యొక్క ఉత్తమమైన అడుగుగా పరిగణించవచ్చా? విజయవంతమైన ఇకాన్, ఫియెస్టా (ఇప్పుడు క్లాస్సిక్) మరియూ ఫీగో వంటి కార్లని మనము చ్హుశాము. కానీ, ఇవి ప్రత్యేకంగా భారతదేశానికై చేయబడినవి మరియూ విజం పొందాయి, ఎందుకంటే ఎంతో సమగ్ర విశ్లేషణ తరువాత ఇవి మార్కెట్ లోకి తీసుకు రావడం జరిగింది. మరో పక్క, ఎస్కార్ట్, మాండియో మరియూ ఫ్యూజన్ వంటి విదేశీ కార్లు ఇక్కడ రాణించలేదు.

ఫీగో ఆస్పైర్, విష్లేషణ తరువాతే వస్తోంది అని అనిపిస్తోంది. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేయడం జరిగింది మరియూ వరే మార్కెట్లకి కూడా ఇవి ఎగుమతి చేయబడతాయి. ఇందులో దక్షిణ ఆఫ్రికా మార్కెట్ ఒకటి. ఆస్పైర్ లో మా మొట్టమొదటి డ్రైవ్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కాంపాక్ట్ తత్వం ముఖ్యంగా సిటీ లలో రోజూ ప్రయాణం చేసే వారికి ఉపయోగపడుతుంది. దీని బాహ్య రూపం విషయానికి వస్తే, చూడటానికి అందంగా ఉంటుంది, ప్రత్యేకంగా ముందు వైపు నుండి. వెనుక వైపు యొక్క రూఫ్ లైన్ హుందాగా కనిపిస్తుంది.

లోపల వైపున, బేజ్ మరియూ బ్లాక్ రంగు అంతర్ఘత స్కీముతో ఈకోస్పోర్ట్ లాగా మరియూ ఫియెస్టా లాగా తయారు చేయబడింది. లోపలి వైపున 5 మంది పట్టే చోటు ఉంది. సింక్ సిస్టం మీ ఫోనుతో బాగా పనిచేస్తుంది మరియూ వాయిస్ కమాండ్స్ ని గుర్తుస్తుంది.

మొట్టమొదటి రోజు నుండి ఫోర్డ్ వారు ఈ కారుని ఎలగైన విజయవంతం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. ముందుగా, నవీకరణ చెందిన 1.5-లీటరు టీసీడీఐ డీజిల్ ఆస్పైర్ ని ఫియెస్టా మరియూ ప్రముఖ ఈకోస్పోర్ట్ కంటే కూడా ముందుగా ప్రవేశ పెట్టడం జరిగింది. కాబట్టి, ఈకోస్పోర్ట్ మరియూ ఫియెస్టా కి ఈ మోటరు ని అమర్చేంత వరకు, ఆస్పైర్ వాటి కంటే మెరుగైన కారుగా పరిగణించబడుతుంది. 100పీఎస్/215ఎనెం కి నవీకరించబడిన డీజిల్ ఇంజిను కాకుండా, ఇందులో సరికొత్త 1.2-లీటర్ టీవీసీటీ పెట్రోల్ మరియూ విభాగానికి మొట్టమొదటిదైన 6-స్పీడ్ డ్యూల్-క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కి 1.5-లీటరు టీవీసీటీ జత చేయబడి అందించడం జరిగింది.

ఇదంతా కూడా ఫోర్డ్ తన చాటున మరొక ఆశ్చర్య పరిచే ఎత్తు ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాని ఇది ఇప్పుడు ఎలంటి స్పందన ని కలిగి ఉంటుందో చూడవలసి ఉంది. చూస్తూనే ఉండండి !

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience