మరణించిన ఎఫ్1 డ్రైవర్ జూల్స్ బయాంచి నివాళిగా ఎఫైఏ వారు కార్ నం.17 ని విరమింపజేస్తున్నారు
జైపూర్: ఫార్ములా వన్ పాలక సంస్థ అయిన ఎఫైఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఎల్ ఆటోమొబైల్) మరణించిన ఎఫ్1 డ్రైవర్ జూల్స్ బయాంచి గౌరవార్ధం కారు నెంబర్ 17 ని నిష్క్రమింపజేస్తున్నట్టు ప్రకటించింది. ఈ 25 ఏళ్ల ఫ్రెంచ్ ఆటగాడు గత సంవత్సరం 5 అక్టోబర్ న జపనీస్ గ్రాండ్ ప్రీలో భయానక క్రాష్ నుండి మెదడు గాయాలు తగిలి తర్వాత చికిత్స పొందుతూ గత వారం మరణించాడు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆయిర్టన్ సెన్నా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రీ లో మరణించిన నాటి నుండి ఒక ఎఫ్1 రేసులో తగిలిన గాయాలకు మరణించిన మొదటి డ్రైవర్ జూల్స్ బయాంచి.
ఫార్ములా వన్ డ్రైవర్లు వారి సొంత సంఖ్యను ఎంపిక చేసుకునే అనుమతి ఉండటం వలన బయాంచి 17 సంఖ్య ఎంచుకున్నాడు. ఈ కారు సంఖ్యలో, దివంగత డ్రైవర్ 2014 లో 15 సార్లు పోటీలో పాల్గొన్నారు.
ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఎల్ ఆటోమొబైల్ (ఎఫైఏ) కి అధ్యక్షుడు అయిన జీన్ టాడ్,"జూల్స్ బయాంచి గౌరవార్ధం Fఈఆ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్షిప్ నుండి కారు నెంబర్ 17 రిటైర్ చేయబడుతుంది", అని అన్నారు. ఫలితంగా, ఈ సంఖ్య ఇకపై ఎఫైఏ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో ఉపయోగింపబడదు.
ఈ ఫ్రెంచ్ రేసర్ ఈ ప్రపంచం వదిలి వెళ్ళే ముందు దాదాపు 9 నెలల కోమాలో ఉన్నారు. భయంకరమైన ప్రమాదంలో అతను మరొక కారు క్రాష్ తీస్తున్న ఒక మొబైల్ క్రేన్ ని అధిక వేగంతో ఢీకొట్టడం జరిగినది.ఆయన అంతిమ సంస్కారాలు తన సొంత పట్టణం అయిన నీస్ లోని సెయింట్ రెపరేట్ కేథడ్రాల్ వద్ద జరిగింది.