ఫాస్ట్ ట్యాగ్ ఇప్పుడు తప్పనిసరి!
డిసెంబర్ 21, 2019 01:38 pm dhruv attri ద్వారా సవరించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నాల్గవ వంతు టోల్ లేన్లు జనవరి 15 వరకు క్యాష్ ని స్వీకరించడం కొనసాగిస్తాయి
ఈ నెల ప్రారంభంలో 15 రోజుల పొడిగింపు తరువాత, నేషనల్ హైవే లపై ప్రయాణించే వాహన యజమానులందరికీ ఫాస్ట్ ట్యాగ్‌లు ఇప్పుడు తప్పనిసరి. అన్ని కొత్త కార్లు షోరూమ్ నుండే ఈ RFID (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ఆధారిత ఎలక్ట్రానిక్ చెల్లింపు ఎంపికను కలిగి ఉంటాయి, అయితే పాత కార్ల యజమానులు వాళ్ళ కోసం ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలి.
- టోల్ ప్లాజాల గుండా వెళ్ళినప్పుడు క్యాష్ చెల్లింపు లేకుండా ఉండే సులువుని ఫాస్ట్ ట్యాగ్ మీకు అందిస్తుంది. దీని వలన హైవే మీద మరింత వేగంగా వెళ్ళవచ్చు, ఫ్యుయల్ వినియోగాన్ని తగ్గించడం మరియు హైవే లపై డ్రైవింగ్ ని మరింత సులువుగా పూర్తి చేయవచ్చు.
- మీరు దీన్ని 22 సర్టిఫైడ్ బ్యాంకులు, నేషనల్ హైవే టోల్ ప్లాజాస్ మరియు e-పేమెంట్ అగ్రిగేటర్స్ వంటి పాయింట్ ఆఫ్ సేల్ ప్రదేశాలలో కొనుగోలు చేయవచ్చు. వివరాల కోసం మా దశల వారీగా ఉన్న గైడ్ ని చూడండి.
- ఈ రోజు నుండి ఫాస్ట్‌ట్యాగ్ లు తప్పనిసరి అయితే, టోల్ ప్లాజాల వద్ద అధికారులు 25 శాతానికి పైగా హైబ్రిడ్ లేన్ లను నడుపుతూనే ఉంటారు. అంటే క్యాష్ ఆధారిత లేన్స్ 2020 జనవరి మధ్య వరకు కొనసాగుతాయి.
- చెన్నైతో సహా కొన్ని ప్రాంతాల అధికారులు ట్యాగ్‌లను వేగంగా అనుసరిస్తున్నట్లు ధృవీకరించారు. ఈ ఫాస్ట్‌ట్యాగ్‌లతో కూడిన రోడ్లపై కనీసం 75 శాతం కార్లు ఉండాలనేది లక్ష్యం.
- ఆ సంఖ్యను సాధించిన తర్వాత, ఫాస్ట్‌టాగ్ లేన్‌లోకి ప్రవేశించే ఫాస్ట్‌టాగ్ కాని వాహనానికి జరిమానా సాధారణ రుసుము కంటే రెట్టింపు అవుతుంది.
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?
0 out of 0 found this helpful