"వ్యక్తిగత వినియోగ వాహనం" మల్టిక్స్ ను రూ.2.32 లక్షల వద్ద ప్రారంభించిన ఐచర్ పొలారిస్ ప్రెవేట్ లిమిటెడ్

జూన్ 19, 2015 11:37 am arun ద్వారా ప్రచురించబడింది

ముంబై: ఐచర్ పొలారిస్ ప్రెవేట్ లిమిటెడ్, ఐచర్ మోటార్స్ లిమిటెడ్ మరియు పొలారిస్ ఇండస్ట్రీస్ మధ్య 50:50 ఉమ్మడి భాగస్వామ్యంతో మల్టిక్స్ అనే వాహనాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశం యొక్క మొదటి 'వ్యక్తిగత యుటిలిటీ వెహికల్'. ఈ వాహనం ఐచర్ పొలారిస్ 'జైపూర్ లో అభివృద్ధి చేయబడినది. ఐచర్ పొలారిస్ ప్రెవేట్ లిమిటెడ్, ఈ వాహనం అభివృద్ధి కోసం మరియు తయారీ కోసం 350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ప్లాంట్ యొక్క వార్షిక సామర్థ్యం 60,000 యూనిట్లు, ఇది ఇంకా 1,20,000 యూనిట్ల వరకూ పెరగవచ్చు. 

మల్టిక్స్ రెండు వేరియంట్లలో మరియు నాలుగు రంగులలో 232,850/- (ఎక్స్-షోరూమ్, జైపూర్) ధరతో లభ్యమవుతున్నది. మల్టిక్స్ ప్రారంభించినపుడు ఐచర్ మోటార్స్ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో మాట్లాడుతూ మేము భారతదేశంలో స్వతంత్రంగా బిజినెస్ చేసేవారిని సుమారు 5.8 కోట్ల మందిని గుర్తించాము. వాళ్ళందిరికీ ఈ మల్టిక్స్ ద్వారా ఆటోమోటివ్ సొల్యూషన్ ఇవ్వాలని భావించామని తెలిపారు. ఇంకా మా లక్ష్యం ఏమిటంటే మల్టిక్స్ పర్యావరణంతో వినియోగదారులు కొత్త అవకాశాలు తీసుకోవడం ద్వారా వారి సామర్థ్యాన్ని నిరూపించుకోగలగాలని తెలిపారు. ఈ వాహనం కోసం వారు 350 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. 

మల్టిక్స్ ముఖ్య ఉద్దేశం ఈ వాహనం ప్రజలని ఎక్కించుకోవడమే కాకుండా సామానులని కూడా తీసుకెళ్ళగలిగే విధంగా ఉండాలని భావిస్తుంది. వీటిలో రెండు వేరియంట్లు ఉన్నాయి ఒకటి 'ఏఎక్స్+' ఇంకొకటి 'ఎం ఎక్స్'. ఏఎక్స్+ లో డోర్ వేస్ లేవు కాని ఎం ఎక్స్ లో డోర్ వేస్ ఉన్నాయి. ఇది ఫోర్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో అమర్చబడిన గ్రీవ్స్ నాలుగు-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఆధారంగా 9.92PSమరియు 27.1Nmటార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ మల్ట్రిక్స్ యొక్క పెద్ద నిల్వ స్థలాన్ని కలిగి ఉంది. దీని యొక్క సామర్ధ్యం 1918 లీటర్లు. దీనిని పవర్ టేకాఫ్ పాయింట్ తో జత చేశారు. ఇది 3 కిలోవాట్ల పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి కంపెనీ ఒక ఎక్స్-పోర్ట్ గా నామకరణం చేసింది. దీని యొక్క లక్షణాల విషయానికి వస్తే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 225మీటర్లు మరియు చెడు రోడ్లను పరిష్కరించడానికి ఒక స్వతంత్ర సస్పెన్షన్ సెట్ అప్ ను కలిగి ఉంది. 

మల్ట్రిక్స్ యొక్క విశ్వసనీయత, భద్రత & మన్నిక ను తెలుసుకోవడానికి ఆఫ్ రోడ్స్ పై 18,00,000 కిమీల టెస్ట్ డ్రైవ్ ను కలిగి ఉంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience