యహంగ్ 184-ఒక ఆంతరంగిక స్వయం ప్రతిపత్తి గల ఎగిరే వాహనం
జనవరి 12, 2016 05:31 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మానవ నాగరికత లో కొత్త నవీకరనలకు మరియు మార్పులకు ముందు ఎప్పుడూ అనుమానం మరియు భయాలు తలెత్తడం సహజం . 1807 లో మొట్ట మొదటి కబస్తార్న్ ఇంజిన్ వాహనాలలో అమర్చినపుడు ప్రజలు దానిని ఒక బాంబ్ గా అనుకోని అది పేలే అవకాశం ఉందని భయపడ్డారు. తొలిసారి రైట్ సోదరులు డిసెంబర్ 17 ,1907 లో తమ తొలి విజయవంతం అయిన విమానాన్ని తయారు చేసినప్పుడు ప్రజలు దానిని మాయాజాలం అని అదివైకం అని అభివర్ణించారు. మరి ఈ రోజు చూసినట్లయితే అదే విమాన యానం ద్వారా మనం ఎంత ముందడుగు వేసామో అందరికీ తెలిసిన విషయమే. అంతే కాకుండా కార్లు మరియు విమాన యానం ద్వారా మనం ఒక సౌకర్యవంతం అయిన మరియు సురక్షితం అయిన ప్రయాణాలు చేయగలుగుతున్నాము . ఇదే క్రమం లో ఇప్పుడు అటానమస్ డ్రైవింగ్ త్వరలో ప్రజాదరణ పొంది అచిర కాలం లో సర్వ సాధారణం కాబొథున్ది. ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం ఎన్నో ముందడుగులు వేసి ఒక అద్భుతమయిన వేగాన్ని పుంజుకుంటోంది మరి తరవాత ఆవిష్కరణ ఏంటి?
ఈ క్రమం లో ప్రవేశపెడుతున్నారు ,అధునాతన యహాంగ్ 184(AAV) అటానమస్ ఏరియల్ వాహనం. ఈ పేరుకు ఉన్న అర్ధం ఏమిటంటే ఇది ఒక ప్రత్యేక సింగిల్ సీటర్ ఎగిరే డ్రోన్ వాహనం. ఇది కేవలం ఆటో పైలెట్ వ్యవస్థ ద్వారానే నడుపబడుతుంది . ఇటీవల 2016 లో చోటు చేసుకున్న కన్సుమర్ ఎలక్ట్రానిక్ షో లాస్వెగాస్ లో దీనిని ప్రదర్శించారు. అక్కడ ఈ డ్రోన్ వాహనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా ను ఆకర్షించింది. ఈ వాహనం ఒక అల్యూమినియం అల్లాయ్ ఫ్రేం కలిగి ఒక వ్యక్తి కూర్చొనే సౌకర్యం కలిగి ఉంటుంది. ఈ వాహనం ఖాళీ భాగానికి ఎగిరేందుకు గాను 8 ప్రొపెల్లర్లు అమర్చబడి ఉన్నాయి. ప్రతీ రోటారు ప్రత్యేకమయిన మోటారు శక్తి తో నడప బడుతుంది. ఇది ఒక అద్భుతమయిన భద్రతా ప్రమాణం గా చెప్పవచ్చు ఎందుకంటే ఒక్క రోటార్ ఫెయిల్ అయినప్పటికీ ,డ్రోన్ జాగర్తగా లాండ్ అవ్వగలదు. ఈ 8 మోటార్లు ఒక్కొక్కటిగా దాదాపు 142 హార్స్ పవర్ సామర్ద్యాన్ని కలిగి డ్రోన్ ఎగిరేందుకు సహాయపడతాయి. ఈ ఎహాంగ్ 184 (AAV)బరువు 200 కేజీలు. మరియు ఇది దాదాపుగా 120 కేజీల బరువు వరకు ఎత్తగలదు అంతే కాకుండా ఈ డ్రోన్ వెనుక భాగం లో సామాన్లు బద్ర పరుచుకునేందుకు ఒక చిన్న కంపార్ట్మెంట్ కుడా అమర్చబడి ఉంది.
ఇక ఈ వాహనానికి ఈ పేరు వాహనం యొక్క భాగాలను బట్టి తీరు తెన్నులను బట్టి ఇవ్వటం జరిగింది . ఇంకా184 అంటే 1 -ఒక వ్యక్తి కూర్చునే సామర్ద్యం ,8- అంటే 8 ప్రొపెల్లర్లు ,4- అంటే 4 కాళ్ళు కలిగి ఉండటం అని అర్ధం . ఈ డ్రోన్ పూర్తిగా అటానమస్ వాహనం కావటం దీని అదనపు ప్రత్యేకత .ఇందులో వాహనం నడిపే పైలెట్ కేవలం టచ్ స్క్రీన్ ద్వారా చేరే ప్రదేశాన్ని అందిస్తే చాలు మిగతాదంతా డ్రోన్ తనకు తానుగా చూసుకోగలదు . అంతే కాకుండా అత్యవసర పరిస్థుతులలో పైలెట్ తనకు తానుగా కూడా దీనిని నడిపే వీలుంటుంది. ఈ వాహనానికి అమర్చిన బ్యాటరీ కేవలం నాలుగు గంటలలో చార్జ్ అవ్వగలుగుతున్ది.
ఈ డ్రోన్ యొక్క అత్యధిక వేగ సామర్ధ్యం 100km/h ంఅరియు ఇది 3499 మీటర్స్ ఎత్తు వరకు ఎగరగలదు. ఇంకా ఇది గాలి లోనికి చేరుకోవటానికి పట్టే సమయం 23 నిమిషాలు. అదనంగా ఈ డ్రోన్ లో ఎయిర్ కండీషనర్ వ్యవస్థ , గాల్ వింగ్ తలుపులు, లగేజ్ భద్రపరుచుకునే స్థలం , మరియు 4జి కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇది 2016 చివరి లోగా అందుబాటులోకి రానుంది .ఇక ఈ వాహనం యొక్క ధర రో.2 కోట్లు. అంటే ఇది దాదాపు ఒక బి ఎం డబ్ల్యు ఐ 8 కి సమాన ధర గా చెప్పవచ్చు, మరి ఎగిరే వాహనం లో ప్రయాణించాలి అంటే ఆ మాత్రం చెల్లించక తప్పదు మరి.