ఢిల్లీ ప్రభుత్వం, 2015 డిసెంబర్ 30 న ఆడ్ ఈవెన్-పాలసీ డ్రై రన్ నిర్వహిస్తోంది
డిసెంబర్ 30, 2015 06:07 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ వార్తలు:
ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1, 2016 నుండి బేసి-సరి ఫార్ముల అమలు కోసం సిద్దమవుతోంది, ప్రభుత్వం డిసెంబర్ 30, 2015 న ప్రయత్నాత్మకంగా చూద్దాము అని నిర్ణయించుకున్నారు. దీని యొక్క టైమింగ్స్ అదే విధంగా ఉ. 8 నుండి సా.8 వరకూ ఉంటుంది. అయితే, ప్రజలు ఈ నియమాన్ని ఉల్లఘించినచో జరిమానా అయితే ఈ రోజు విధించడం జరగదు.
సాధరాణ పరిస్థితులలోనే డిల్లీ పబ్లిక్ రవాణా తీవ్రంగా ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాలలో ఈ ఒత్తిడిని ప్రజా రవాణా తీసుకోగలదా అనే విషయం పై AAF ప్రభుత్వం నెమ్మదిగా ఉంది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్, ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ప్రభుత్వం చేసిన ప్రత్యేక కృషి గురించి చాలా నమ్మకంగా ఉన్నారు. అతను ఒక సందర్భంలో ఇలా అన్నారు " మెట్రో ఫ్రీక్వెన్సీ ప్రస్తుతం ఉన్న 2000 కి అధనంగా జనవరి 1 నుండి 15 కి 3000 కి పెంచుతున్నారు. ఢిల్లీ నుండి గుర్గావ్ మరియు నోయిడా కి ఒక ప్రత్యేక బస్సు సేవ కూడా ఉంటుంది. మాకు గనుక నిర్దిష్ట స్థానాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక డిమాండ్ వస్తే, ఆయా డిమాండుల ఆధారంగా మేము ప్రత్యేక సేవలు జోడిస్తాము. ”
పెరిగిన భారాన్నితట్టుకోవడానికి ముందు చెప్పిన 6000 బస్సులకు బదులుగా అదనంగా 3000 బస్సులను మాత్రమే అందిస్తారు. దీనికి కారణం ఈ నియమం టూ వీలర్స్ కి వర్తించకపోవడం అని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. తీసుకున్న చర్యను వివరిస్తూ, మిస్టర్ రాయ్ ఈ విధంగా అన్నారు " ఈ ప్రయత్నాత్మకంగా నిర్వహించే ఈ డ్రై రన్ లో డిల్లీ మెట్రో దాని పూర్తి సామర్థ్యం అమలవుతాయి. జనవరి 1 నుంచి రోడ్ లో 3,000 ఎక్కువ బస్సులు తిరుగుతాయి. మేము ముందుగా 6000 అని తెలిపాము కానీ ఈ నియమం 4 వీలర్ కి మాత్రమే వర్తింపబడుతుంది మరియు 2 వీలర్ యధాతధంగా తిరగగలవు కనుక ఆ సమయంలోని రద్దీ కి సరిపోగలదని భావిస్తున్నాను. రవాణా శాఖ Pooch-O అప్లికేషన్ ద్వారా సులభంగా అందుబాటులో ఉండే ఆటోరిక్షాలు వచ్చిన తర్వాత డిల్లీ మెట్రాన్ ప్రభుత్వం దానిని అనుసరిస్తూ ఎవరైతే 4 వీలర్స్ ఉన్నారో వారికి మొదటి ప్రత్యామ్నాయం కారు పూలింగ్ అని తెలిపింది.”
ఈ విధానం రాజధానిలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు పాలక పార్టీ ద్వారా చేయబడుతున్న ఒక ప్రయత్నం. రాజధానిలో కాలుష్యం పరిస్థితిని చూసి భారతదేశం యొక్క సుప్రీం కోర్ట్ ఇటీవల ఢిల్లీ ప్రాంతంలో 2,000 సిసి సామర్ధ్యం గల డీజిల్ ఇంజిన్ ని బాన్ చేసింది. స్కార్పియో మరియు జైలో వంటి కొన్ని మహింద్రా & మహింద్రా వారి కార్లు దీనికి ప్రభావితం అయ్యాయి.
ఇంకా చదవండి
టాక్సీలు సిఎంజి లతోనే నడవాలని అమలు చేసిన ఢిల్లీ సుప్రీం కోర్ట్