• English
  • Login / Register

మొదటి రోజు - ఉత్తమ ఆటో ఎక్స్పో

ఫిబ్రవరి 05, 2016 04:04 pm cardekho ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆటో ఎక్స్పో యొక్క 13 వ ఎడిషన్, అనేక వాహనాల మిశ్రమాన్ని తీసుకొస్తుంది. అనేక ప్రముఖమైన కాన్సెప్ట్ లతో మరియు అనేక వాహనాల ప్రారంభాలతో మన ముందుకు వస్తుంది. మొదటి రోజు నుండి ఉత్తమ ఉత్పత్తుల జాబితా క్రింద ఇవ్వబడ్డాయి:

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా

అనేక మంది ఎంతగానో ఎదురుచూస్తున్న విటారా బ్రెజ్జా మొదటి రోజు ప్రదర్శనమిచ్చింది. ఈ వాహనం, ఇదే విభాగంలో ఉండే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు టియువి 300 వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వడానికి షోరూం ల వద్ద కు రాబోతుంది. ఈ బ్రెజ్జా వాహనానికి, మారుతి యొక్క డి డి ఐ ఎస్ 200 డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 90 పి ఎస్ పవర్ ను అదే విధంగా 200 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం మన ముందుకు వచ్చే వరకు వేచి ఉండలేము.

హోండా బి ఆర్- వి

హోండా యొక్క పెద్ద వాహనం బి ఆర్- వి ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడుతుంది. ఈ ఎస్యువి వాహనం, ఏడు సీట్ల అమరిక తో చాలా విశాలంగా ఉంటుంది. ఈ బి ఆర్ వి వాహనానికి, హోండా యొక్క నమ్మకమైన 1.5 లీటర్ ఐ విటెక్ మరియు ఐ డి టెక్ మోటార్ లను అందించడం జరిగింది. ముందు గా డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, హోండా యొక్క వాహనం అయిన సిటీ మాదిరిగా ఉత్పత్తులను విడుదల చేస్తుంది. మరోవైపు పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 120 పి ఎస్ పవర్ ను అదే విధంగా 145 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం ఖచ్చితంగా, క్రెటా వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది.

జీప్ రాంగ్లర్ మరియు గ్రాండ్ చెరోకీ

చివరికి అమెరికన్ ఐకాన్, కొద్ది వాహనాలతో ఆటో ఎక్స్పో వద్ద కు వచ్చింది. భారతదేశంలో జీప్ యొక్క అధికార ఉత్పత్తులు అయిన జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్ మరియు గ్రాండ్ చెరోకీ వంటి వాహనాలను ఇటీవల ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించింది. జీప్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేకమైన చెకోరీ ఎస్ ఆర్ టి వాహనాన్ని బహిర్గతం చేసింది. ఈ ఎస్ ఆర్ టి వాహనం, ఒక బారీ 6.4 లీటర్ వి8 మోటార్ తో జత చేయబడి ఉంది. ఈ ఇంజన్ యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి సుమారు 5 సెకన్ల సమయం పడుతుంది.

ఇన్నోవా క్రిష్టా

ప్రముఖమైన ఇన్నోవా యొక్క రెండవ తరం వాహనం, 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శింపబడింది. ఈ క్రిష్టా వాహనం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ తో కూడిన 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఆడియో వ్యవస్థ, క్రూజ్ కంట్రోల్ మరియు విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే సీటు వంటి అనేక ప్రముఖ మైన అంశాలను అందించడం జరిగింది. మరోవైపు ఈ వాహనానికి బారీ శక్తివంతమైన ఇంజన్ ను అందించడం జరిగింది. బాహ్య కొలతలు విషయానికి వస్తే, మునుపటి వెర్షన్ తో పోలిస్తే ఈ వాహనం, 150 మిల్లీ మీటర్లు ఎక్కువ పొడవును అలాగే 35 మిల్లీ మీటర్ల ఎక్కువ ఎత్తును మరియు 65 మిల్లీ మీటర్ల ఎక్కువ వెడల్పు ను కలిగి ఉంది.

టాటా హెక్సా

ఈ టాటా హెక్సా, విజయం సాదించలేకపోయిన ఏరియా ఎంపివి ప్లాట్ఫాం ఆధారంగా రూపొందించబడింది మరియు ఈ వాహనం, గత సంవత్సరం జరిగిన జెనీవా మోటార్ షోలో ఈ కాన్సెప్ట్ వాహనం బహిర్గతం అయ్యింది. ఈ హెక్సా వాహనం, అత్యంత శక్తివంతమైన 2.2 లీటర్ వెరికార్ 400 డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, ఇటీవల బహిర్గతం అయిన సఫారీ స్ట్రోం నుండి తీసుకోవడం జరిగింది. ట్రాన్స్మిషన్ ఎంపిక విషయానికి వస్తే, ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మరియు 6- స్పీడ్ జిఎం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు ఈ హెక్సా వాహనం, 4 డబ్ల్యూడి వ్యవస్థ తో జత చేయబడి ఉంటుంది.

జాగ్వార్ ఎక్స్ ఈ

అత్యంత ప్రముఖమైన జాగ్వార్ వాహనం, నేడు భారత మార్కెట్ లో అడుగు పెట్టింది. ఈ వాహనం, రూ 39.9 లక్షల వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ ఎక్స్ ఈ వాహనం, ఇదే విభాగంలో ఉండే బి ఎం డబ్ల్యూ 3 సిరీస్, ఆడి ఏ4 మరియు మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ వాహనానికి, అత్యంత శక్తివంతమైన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, వేరియంట్ రకాన్ని బట్టి అత్యధికంగా 200 పి ఎస్ పవర్ ను అలాగే 240 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎక్స్ ఈ వాహనానికి అందించబడిన ఇంజన్, 8- స్పీడ్ జెడ్ ఎఫ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience