ఒక SMS ద్వారా ఉపయోగించిన కారు యొక్క పూర్తి వివరాలను తనిఖీ చేయవచ్చు
డిసెంబర్ 31, 2015 10:19 am sumit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ:
సెకెండ్ హ్యాండ్ కారు ని ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వారికి ఒక శుభవార్త. ఉపయోగించిన కారు తనిఖీ చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకుగానూ ఇప్పుడు రవాణా మంత్రిత్వ శాఖ ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖకు జారీ చేసిన హెల్ప్లైన్ 7738299899 నంబర్ కి ఒక మెసేజ్ అందించడం ద్వారా కారు యొక్క పూర్తి చరిత్ర తనిఖీ చేయవచ్చు. ప్రభుత్వం ఇటీవల భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఒక "FAME ఇండియా ఎకో డ్రైవ్" నిర్వహించారు. ఇది విద్యుత్ వాహనాలు ప్రోత్సహించేందుకు మరియు శక్తి పరిరక్షణ అవసరాన్ని కూడా హైలేట్ చేసేందుకు లక్ష్యంతో ఉంది.
హెల్ప్లైన్ నెంబర్ కొన్నిసార్లు ప్రభుత్వం అధికారులు, అలాగే ఒక నిర్దిష్ట కారు వివరాలను కనుగొనేందుకు ప్రయాసపడే వారు ఉపయోగించవచ్చు. ఈ నెంబర్ కొత్త వెబ్-ఆధారిత అప్లికేషన్ తో కలిసి రిజిస్ట్రేషన్ తేదీ నుండి కారు యొక్క చరిత్రను పసిగట్టగలదు. ఎంఫోర్స్మెంట్ అధికారులు కూడా యాప్ ని లైసెన్స్ అనధికారమైనదా, సరైనదా లేకా కాదా అనేది తనిఖీ చేసుకొనేందుకు ఉపయోగించవచ్చు. దీనిలో ఒక ఉత్తమమైన అంశం ఏమిటంటే ఈ సమాచారం ఉచితముగా అందుబాటులో ఉంటుంది.
ఈ స్కీం గురిచి వివరాలను తెలియజేస్తూ రవాణా శాఖ జాయిన్ సెక్రెటరీ అభయ్ దాంలే ఇలా అన్నారు " ఈ విధానాలు కార్లను అద్దెకు తీసుకొనేవారు మరియు డ్రైవర్లను నియమించుకొనే వారికి వాహనాల గురించి పూర్తి వివరాలను తెలుసుకొనేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ సేవలు ద్వారా రోడ్ల మరియు రవాణా ఎంఫోర్స్మెంట్ శాఖలకు డాక్యుమెంట్లకు సంభందించిన అసలు మరియు నఖిలీ వివరాలు తెలుసుకొనేందుకు ఉపయోగపడతాయి. "
"మేము ఈ సమాచారం మొత్తాన్ని RTO ల ద్వారా అనుసంధీకరించి అందుబాటులో ఉంచాము. అదనంగా కార్ల యొక్క యాక్సిడెంట్ సమాచారలు మరియు ఇతర లావాదేవీల సమాచారాలను పోలీసు రికార్డ్డుల అనుసంధానం ద్వారా అందుబాటులో ఉంచుతున్నాము." అని ఒక ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.
ఈ SMSఆధారిత సేవా మరియు యాప్ నేష్నల్ ఇంఫర్మాటిక్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది రవాణా మినిస్టరీ కి ఇటీవల అందుతున్నటువంటి ఫేక్ వాహనాల పిర్యాదులకు స్పందనగా ప్రభుత్వం చే తీసుకోబడిన ఒక చర్య.