డిమాండ్ లో ఉన్న కార్లు : మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్ మార్చి 2019 లో సెగ్మెంట్ లో అత్యధిక శాతంలో అమ్మకాలు
ఏప్రిల్ 25, 2019 10:17 am dhruv ద్వారా ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి ఆల్టో అమ్మకాల గణాంకాలు ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ లో ఇతర కార్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువలన, రెండవ స్థానం మరియు మూడవ స్థానం ఈ మొదటి లెవెల్ లో ఉన్న మారుతికి ఎంత దూరంలో ఉన్నాయి?
- మార్చి లో ఉండే ఆల్టో యొక్క డిమాండ్ ఫిబ్రవరి 2019 కన్నా తక్కువగా ఉంది.
- అల్టో యొక్క ఈ డిమాండ్ సాధారణ డిమాండ్ కంటే తక్కువ ఉండడానికి కారణం ఏమిటి? నూతన-మోడల్ లేదా ఆల్టో 800 యొక్క నిలిపివేత కారణమా?
- హ్యుందాయ్ ఇయాన్ ఇప్పుడు నిలిపివేయబడింది.
- దీనిలో మిగిలిన పోటీదారులు రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడ్-గో మాత్రమే.
- క్విడ్ మరియు రెడి-గో యొక్క మార్చ్ డిమాండ్ వాటి యొక్క సగం వార్షిక సంవత్సర సగటు డిమాండ్ ని కూడా అధిగమించాయి.
ఈ తరంలో SUV ల కాలంలో ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ లు కూడా వచ్చి తమ అమ్మకాల సంఖ్యను అప్రయత్నంగా పెంచుతూ తమ పనిని కొనసాగించాయి. మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్, డాట్సన్ రెడ్-గో ఈ విభాగంలో భాగంగా ఉన్నాయి. హ్యుందాయ్ ఇయాన్ కూడా ఇటీవల నిలిపివేయబడే వరకూ ఈ విభాగంలో భాగంగా ఉండేది.
మార్చి 2019 |
ఫిబ్రవరి 2019 |
MoM గ్రోత్ |
ప్రస్తుత మార్కెట్ వాటా (%) |
మార్కెట్ వాటా (% గత సంవత్సరం) |
YoY mkt వాటా (%) |
సగటు అమ్మకాలు (6 నెలలు) |
|
మారుతి సుజుకి ఆల్టో |
16826 |
24751 |
-32.01 |
69.95 |
64.11 |
5.84 |
21814 |
రెనాల్ట్ క్విడ్ |
5853 |
5050 |
15.9 |
24.33 |
16.1 |
8.23 |
5484 |
డాట్సన్ రెడ్-గో |
1374 |
1293 |
6.26 |
5.71 |
7.39 |
-1.68 |
1187 |
టేక్ అవే
మారుతి ఆల్టో ఇప్పటికీ కూడా ప్రజల ఎంపికగా ఉంది:
ఆల్టో యొక్క డిమాండ్ గత నెలలో పోలిస్తే భారీగా తగ్గాయి, అయితే, అమ్మకాలు సంఖ్య అనేది దాని సెగ్మెంట్ లో ఇతర కారుల కంటే కూడా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఆల్టో యొక్క సగటు ఆరు నెలల డిమాండ్ పరిశీలనలోనికి తీసుకుంటే గనుక, మార్చ్ యొక్క డిమాండ్ బట్టి మనకి వచ్చిన సంకేతం ఏమిటంటే మారుతి ఆల్టో 800 యొక్క నవీకరణ అయినా త్వరలో ఉంది లేదా అది నిలిపివేయడం అయినా జరుగుతుంది. ఆల్టో K10 ABS, డ్రైవర్ ఎయిర్బ్యాగ్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్ల ప్రమాణాలను కలిగి ఉండటానికి నవీకరించబడింది. ఆల్టో 800 ఆ స్థాయిని చేరుకోడానికి నవీకరించబడుతుందా లేదా అనేది అసలు ఒక్క మాటా కూడా మాట్లాడలేదు. మారుతి ఫ్యూచర్- S భావన ఆధారిత హ్యాచ్బ్యాక్ ని కూడా పరీక్షిస్తోంది, ఇది తరువాతి తరం ఆల్టోగా ఉంటుంది. మనం ఊహించిన దాని కంటే త్వరగా వస్తోందా? కాలమే చెప్తుంది.
రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడి-గో రెండూ కూడా అసలు ఆల్టో ని అందుకోలేవు:
క్విడ్ మరియు రెడ్-గో రెండూ కూడా ఒకే ప్లాట్ఫార్మ్ ఆధారంగా ఉంటాయి. అయినప్పటికీ, ఈ రెండూ కలిసి ఉన్న డిమాండ్ కూడా ఆల్టో యొక్క 2019 మార్చిలో ఉన్న డిమాండ్ కి సగం కన్నా తక్కువగా ఉన్నాయి. మార్చ్ 2019 లో ఆల్టో యొక్క అమ్మకాల్లో మారుతి 32 శాతం తగ్గిపోయింది.
Read More on : Renault KWID AMT
0 out of 0 found this helpful