CarDekho యొక్క మాతృ సంస్థ, గిర్నార్ సాఫ్ట్, ఉన్నత విద్యా పురోగతి సమర్థించేలా CollegeDekho లో US$1M డాలర్ పెట్టుబడి పెట్టింది
డిసెంబర్ 09, 2015 12:45 pm cardekho ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డిల్లీ:
కాలేజ్‌దేఖో, కళాశాలలు మరియు విద్యార్థులను కలిపే ఒక ఆన్లైన్ వేదిక
భారతదేశ ఆటోమొబైల్ ఆటో స్పేస్ లో ముందున్న కార్‌దేఖో.కాం యొక్క మూల సంస్థ గిర్నార్‌సాఫ్ట్, ఇటీవల ఒక మిలియన్ యు.ఎస్ డాలర్స్ పెట్టుబడితో భారతీయ విద్యారంగంలో కాలేజ్‌దేఖో అనే స్టాట్అప్ ను ప్రతిపాదించింది. ఈ కాలేజ్‌దేఖో విధ్యారంగంలో ఎంతో జిజ్ఞాస కలిగిన పెట్టుబడిదారుల ద్వారా ఆవిర్భవమైంది. ఈ వెబ్‌సైట్ ద్వారా భారతదేశంలోని కాలేజీ ప్రవేశాల సమస్యలను తీర్చే ప్రయత్నం వీరు చేయబోతున్నారు.
ఈ పెట్టుబడిదారుల యొక్క పెట్టుబడిల ద్వారా గిర్నార్‌సాఫ్ట్ టెక్నాలజీ అధారిత ఇండస్ట్రీ ని తయారుచేసి ఎన్నో బలమైన సమస్యలకు పరిష్కారన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పెట్టుబడులు ఒక సమర్ధవంతమైన మరియు ముందు చూపు కలిగిన యాజమాన్యం చేతుల మీద నడపబడుతుండడం వలన కాలేజ్ దేఖో ఒక సురక్షితమైన సంస్థ గా ఎదగబోతోంది అని చెప్పవచ్చు.
ఈ ప్రతిపాదనల వెనుక కారణం చెప్తూ గిర్నార్‌సాఫ్ట్, సహ వ్యవస్థాపకుడు, సి.ఇ.ఒ అమిత్‌జైన్ మాట్లాడుతూ" భారతదేశంలో ఉన్నత విద్య సంభందిత కార్యాకలాపాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మరియు వీటిని అంది పుచ్చుకోడానికి ఒక నవీకరించబడిన మార్కెట్ అవసరం. ఇంకా అనాధిగా వస్తున్న పారంపర్య సమస్యలు నుంచి ఈ విద్యా రంగాన్ని తీసుకొని రావడానికి ఇవి దోహద పడగలవు. ఈ నవీకరించబడిన ఆలోచనలు నేటి విద్యార్ధులకు విద్య మరియు కెరియర్ సంభందిత అవకాశాల పట్ల ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోడానికి దోహదపడగలవు అని నమ్ముతున్నాను. ఇందుకు అధనంగా కాలేజ్‌దేఖో యాజమాన్యం యొక్క ఆశక్తి మరియు ముందు చూపు ఈ పీటుబడిని ఇంకా ఈ ప్రయత్నాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళగలవు అని నమ్ముతున్నాను." అని వివరించారు.
కాలేజ్‌దేఖో, సహ-వ్యవస్థాపకుడు మరియు సి.ఇ.ఒ రుచి అరోరా ఇలా అన్నారు " ఏ సందర్భంలో చూసినా భారతదేశం మొత్తం మీద దాదాపు 36,000 కాలేజీలలో 30 మిలియన్ విద్యార్ధులు నమోదు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగంలో మూడవ స్థానంలో ఉన్న మన దేశంలో ఎన్నో అవకాశాలు ఇంకా తొలి దశలోనే ఉన్నాయి. ఇవి వ్యాపార పరంగా, ఎన్నో అభివృద్ధి అవకాశాలను అందించగలుగుతున్నాయి. కాలేజ్‌దేఖో ఒక నిస్పాక్షికమైన మరియు పూర్తి పారదర్శకమైన సేవలను, సౌకర్యాలను విద్యార్ధులకు మరియు కాలేజీలకు అందించే ఉద్దేశ్యంతో మోదలు పెట్టడమైంది. ఈ వెంచర్ ద్వారా మేము విద్యార్ధులకు నిజాయతీ అయిన మరియు ఒక సమగ్రమైన సేవలను అందించబోతున్నాము. ఇది విద్యార్ధులకు వారి కెరియర్ ఎంపికలలో వారి ఆశక్తులకు, వారి సామర్ధ్యాలకు అనుగుణమైన కెరియర్ ను ఎంచుకొనేందుకు దోహద పడుతుంది."
విద్యార్ధులకు, కాలేజీలకు మధ్య ఒక వారధిగా పరస్పర అవగాహన సేవలను అందించే ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా తమ టెక్నాలజీ ని ఉపయోగిస్తూ ఈ కాలేజ్‌దేఖో ఉండబోతోంది. కాలేజ్‌దేఖో తమ తొలి పెట్టుబడిని, వనరులను మార్కెటింగ్ మరియు తమ ఇతర విభాగాలను బలోపేతం చేసుకోడానికి ఉపయోగించబోతున్నారు. గిర్నార్‌సాఫ్ట్ యొక్క పెట్టుబడి కాలేజ్‌దేఖో కి మూల ధనంగా వ్యవహరించబోతోంది మరియు రాబోయే కాలాలలో వారి అభివృద్ధి ద్వారా సంపాధించిన వనరులు సంస్థను ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి.
ఇంకా చదవండి