కార్దేఖో.కాం వారు జిగ్‌వీల్స్.కాం ని కొనుగోలు చేశారు - టైంస్ ఇంటర్నెట్ వారు గిర్‌నార్ సాఫ్ట్‌వేర్ లో పెట్టుబడి పెట్టారు

అక్టోబర్ 26, 2015 04:57 pm cardekho ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ: గిర్నార్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆటో పోర్టల్ కార్దేఖో.కాం & గాడీ దేఖో.కాం మరియు టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ యజమానులు ఈ రోజు జిగ్వీల్స్.కాం ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇది టైమ్స్ ఇంటర్నెట్ నుండి గిర్నార్ ద్వారా భారతదేశం యొక్క ప్రముఖ ఆటోమొబైల్ పోర్టల్ లో ఒకటి. ఈ నేపధ్యంలో టైమ్స్ ఇంటర్నెట్ గిర్నార్ సాఫ్ట్వేర్ తో పాటూ  సీక్వోయా కాపిటల్, హిల్ హౌస్, టైబోన్, రతన్ టాటా మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి  ఇప్పుడు పెట్టుబడిదారి.

గిర్నార్ సాఫ్ట్వేర్ గ్రూప్ యొక్క ఆటోమోటివ్ ప్రాపర్టీలలో కలిపి( కార్దేఖో.కాం & జిగ్ వీల్స్. కాం, బైక్ దేఖో.కాం, టయర్ దేఖో.కాం) దగ్గరగా 30 మిల్లియన్ల అసాధారణ నెలవారీ సందర్శకులతో ఏకీకృతమయ్యి వినియోగదారులు డీలర్స్,ఓఇఎం  లకు మరియు ఇతర పరిశ్రమ వాటాదారుల కోసం భారతదేశం యొక్క  1 ఆటోమోటివ్ గమ్యంగా ఉంది.

జిగ్వీల్స్.కాం గిర్నార్ సాఫ్ట్వేర్ తో స్వతంత్రంగా ఒక ప్రత్యేక వ్యాపారంగా పనిచేస్తుంది మరియు ఇతర వాటితో మరియు గిర్నార్ సాఫ్ట్వేర్ యొక్క వనరులతో కలిసి మంచి ఫలితాలను అందిస్తుంది.

గిర్నార్ సాఫ్ట్వేర్ యొక్క స్థాపకుడు / సిఇఒ అమిత్ జైన్, మాట్లాడుతూ " భారతదేశం యొక్క అగ్రస్థానం మరియు అత్యంత గౌరవనీయమైన మీడియా బృందంలో భాగంగా జిగ్వీల్స్.కాం చాలా బలమైన పారంపర్య అంశాలతో వస్తుంది. ఈ వ్యూహాత్మక సేకరణ మా వినియోగదారులను మరింత ఆశక్తికరంగా చేసేందుకు మన నిబద్దతను పటిష్టం చేస్తుంది. ఇది మన మార్కెట్ నాయకత్వాన్ని డిజిటల్ ఆటో వర్టికల్ సందర్శకులు, డీలర్ బేస్ & ఆదాయం వంటిలో మరొక అడుగు ముందుకు నడిపించడంలో తోత్పడుతుంది." అని తెలిపారు.

"మేము మా కంపెనీ లో   ఒక కొత్త పెట్టుబడిదారుగా టైమ్స్ కి స్వాగతం చెబుతున్నందుకు సంతోషిస్తున్నాము. మేము మా ప్రయాణం కొనసాగించుటకు మరియు ఆన్లైన్ ఆటో స్పేస్ లో మా నాయకత్వాన్ని మరింతగా పెంచేందుకు వారి యొక్క మద్దతు కోసం చుస్తున్నాము." అని ఆయన తదుపరి జోడించారు.

సత్యన్ గజ్వని, టైంస్ ఇంటర్నెట్ కి సీఈఓ : " మేము భారతీయ ఆన్‌లైన్ మార్కెట్ లోని అవకాశాల విశిష్ట ఎదుగుదలను చూశాము. ఈ విషయమై గిర్‌నార్‌సాఫ్ట్ వారు దీనిని అవ్కాశంగా తీసుకుంటున్నారు.  ఒక అద్భుతమైన టీం తో కలసి పని చేస్తున్నందున మాకు ఎంతగానో ఆనందంగా ఉంది అని, ఇకపై వచ్చే ఏళ్ళలో మరింత పురోగతికై వేచి చూస్తాము," అని తెలిపారు.  

ఇది గిర్‌నార్ సాఫ్ట్‌వేర్ వారి యొక్క రెండవ అతి పెద్ద కొనుగోలు. గత సెప్టెంబరు ఇది నాస్పర్ గ్రూపు వారికి చెందిన గాడీ.కాం ని కొనుగోలు చేసి కార్దేఖో.కాం యొక్క బలం మరింతగా పెంచుకున్నారు.

గిర్‌నార్ సాఫ్ట్‌వేర్ యొక్క ప్రధాన ఆదాయం కొత్త మరియూ వాడిన కార్ల లీడ్ ఉత్పత్తి, పోర్టల్స్ లో మీడియా అమ్మకాలు, ఇంకా కార్‌బడ్డీ యాప్ ద్వారా కారు యజమాని జీవిత చక్రాన్ని దగ్గరగా గమనించడం వంటి వాటిపై ఆధార పడింది.

గిర్‌నార్ సాఫ్ట్‌వేర్ విస్తృతంగా తూర్పు దక్షిణ ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య మరియూ దక్షిణ అమెరికా ప్రాంతాలలో విస్థరిస్తున్నారు.   

రెయిన్‌మేకర్ గ్రూపు వారు గిర్‌నార్ సాఫ్ట్‌వేర్ కీఇ విషయమై  ప్రత్యేక ఆర్థిక సలహాదారిగా వ్యవహరించారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience