• English
  • Login / Register

మెడ్యూలెన్స్ భాగస్వామ్యంలో అత్యవసర వైద్య సేవలను అందించనున్న కార్దెకో గ్రూప్

ఫిబ్రవరి 24, 2023 09:31 pm shreyash ద్వారా ప్రచురించబడింది

  • 51 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కార్దెకో సహ-వ్యవస్థాపకులు మరియు CEO, కొత్త షార్క్ అమిత్ జైన్, మెడ్యూలెన్స్ కంపెనీలో ఐదు శాతం వాటాకు ؚరూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టారు. 

Amit Jain, CEO and Co-Founder, CarDekhoకార్దెకో గ్రూప్ ప్రస్తుతం మెడ్యూలెన్స్ؚను తన యాప్ؚ మరియు వెబ్‌సైట్‌లో జోడించింది, దీని లక్ష్యం ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించడం. మెడ్యూలెన్స్ భారతదేశంలో GPS ఆధారిత ఆన్ؚబోర్డ్ అంబులెన్స్ సేవా ప్రధాత, ఈ ఆలోచన షార్క్ ట్యాంక్ TV షోలో ప్రసారమైనది. కార్దెకో CEO మరియు సహ-వ్యవస్థాపకుడు, అమిత్ జైన్, కంపెనీలో 5 శాతం వాటాకు రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టటానికి ఒప్పందం చేసుకున్నారు.

CarDekho Emergency Services

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్యను తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా మెడ్యూలెన్స్ సేవలను కార్దెకో యాప్ మరియు వెబ్ؚసైట్ؚతో అనుసంధానించబడింది. మొబైల్ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితిలో ఎవరైనా అంబులెన్స్ؚను బుక్ లేదా కాల్ చేయవచ్చు. మీ స్మార్ట్ؚఫోన్ నుండి క్యాబ్ సేవలను బుక్ చేసుకునే విధంగానే ఇది కూడా పని చేస్తుంది. 

ఇది కూడా చదవండి: టాటా నానోతో ఈ వైరల్ యాక్సిడెంట్ؚలో మహీంద్రా థార్ ఎందుకు తిరగబడింది

భారతదేశంలో, 500 నగరాలలో ఇప్పటికే మెడ్యూలెన్స్ అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఈ భాగస్వామ్యం గురుంచి వ్యాఖ్యానిస్తూ, కార్దెకో గ్రూప్ CEO మరియు సహ-వ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇలా అన్నారు, “ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో అత్యధిక మరణాలు సంభవించే దేశాలలో భారతదేశం ఒకటి, వీటి వలన ఎన్నో గొప్ప జీవిత కథలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. గాయపడిన వారికి సరైన సమయానికి వైద్య సహాయం అందించగలిగితే ఇందులో కనీసం సగం మంది ప్రాణాలను కాపాడవచ్చు, ఈ అంతరాన్ని పూరించడంలో మెడ్యూలెన్స్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన గ్రూప్ؚగా కార్దెకో, మెడ్యూలెన్స్ؚను తన మొబైల్ యాప్ మరియు వెబ్ؚసైట్ؚలో జోడించింది, తద్వారా ప్రాణాలను కాపాడే ఒక సేవ గురించి అవగాహనను కల్పించడంలో తన వంతు సహాయం చేస్తుంది.”

మరిన్ని వివరాల కోసం ప్రకటన పూర్తి సారాంశం క్రింద ఇవ్వబడింది:

60 మిలియన్ సందర్శకులకు అత్యవసర వైద్య సేవలను అందించడానికి కార్దెకో తన ప్లాట్ؚఫారంలలో మెడ్యూలెన్స్ؚను జోడించింది

ముంబై, 22 జనవరి 2023: తక్షణ వైద్య సంరక్షణ విషయంలో ప్రజలకు సహాయపడే లక్ష్యంతో, కార్దెకో తన మొబైల్ యాప్ మరియు వెబ్ؚసైట్‌కు అంబులెన్స్ సేవా ప్రదాత మెడ్యూలెన్స్ؚను జోడించింది. షార్క్ ట్యాంక్ ఇండియా షోలో కొత్త షార్క్ అమిత్ జైన్, వేగంగా అంబులెన్స్ؚను బుక్ చేసుకునేందుకు సహాయపడే మొదటి GPS-ఆధారిత ప్లాట్ؚఫారం మెడ్యూలెన్స్ؚను, ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు లేకుండా కార్దెకోؚకి జోడించాలని నిర్ణయించారు. అత్యవసర సంరక్షణ సేవ పరిధిని విస్తరించడానికి, రోడ్డు ప్రమాదాల వలన జరిగే మరణాల సంఖ్యను తగ్గించడానికి, భారతదేశంలోని అతి పెద్ద ఆటో టెక్ కంపెనీ – కార్దెకో గ్రూప్ సహ-వ్యవస్థాపకులు, CEO శ్రీ అమిత్ జైన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కంపెనీؚలో 5% ఈక్విటీ కోసం రూ.5 కోట్ల ఆఫర్ؚతో పాటు అమిత్ జైన్ ఈ ఆఫర్ؚను మెడ్యూలెన్స్ؚకు అందించారు- ఇది షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమ చరిత్రలో అతి పెద్ద ఆఫర్. 

కార్దెకో యాప్ మరియు వెబ్ؚసైట్ؚలో మెడ్యూలెన్స్ؚను ఉచితంగా జోడించడం వలన, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు యూజర్‌లు యాప్ లేదా వెబ్ؚసైట్ ద్వారా అంబులెన్స్‌ను బుక్ చేసుకోగలరు. ప్రయోజన-ఆధారిత వ్యాపారానికి సహాయపడటం అనే అమిత్ జైన్ అభిప్రాయానికి ఇది అనుగుణంగా ఉంది, అలాగే భారతదేశంలో రోడ్డు ప్రమాదాల మరణాలను నివారిస్తుంది. 

దేశంలో మొట్టమొదటి GPS-ఆధారిత సాంకేతిక వేదిక మెడ్యూలెన్స్, భారతదేశంలో 500 నగరాలలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 2017లో ప్రారంభమైన మెడ్యూలెన్స్ తక్షణ వైద్య సంరక్షణ అందించడానికి వీలు కల్పిస్తుంది. ఈ రోజులలో ఆహారం లేదా టాక్సీలను బుక్ చేసుకోవడం ఎంత సులభమో, ప్రాణాలను కాపాడటంలో సహాయపడే అంబులెన్స్ؚలను బుక్ చేసుకోవడాన్ని కూడా అంతే సులభతరం చేస్తుంది. ఇది ఫస్ట్-పాయింట్ వైద్య సంరక్షణను అందించడం కోసం రూపొందించబడిన ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ ప్రొవైడర్, అంబులెన్స్ బుకింగ్ మరియు ట్రాకింగ్ వ్యవస్థ. 

ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతు, కార్దెకో గ్రూప్ CEO, సహ-వ్యవస్థాపకులు శ్రీ అమిత్ జైన్ ఇలా అన్నారు, “ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో అత్యధిక మరణాలు రిపోర్ట్ చేయబడే దేశాలలో భారతదేశం ఒకటి, వీటి వలన ఎన్నో గొప్ప జీవిత కథలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. గాయపడిన వారికి సరైన సమయానికి వైద్య సహాయం అందించగలిగితే ఇందులో కనీసం సగం మంది ప్రాణాలను కాపాడవచ్చు, ఈ అంతరాన్ని పూరించడంలో మెడ్యూలెన్స్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన గ్రూప్ؚగా కార్దెకో, మెడ్యూలెన్స్ؚను తన మొబైల్ యాప్ మరియు వెబ్ؚసైట్ؚలో జోడించింది, తద్వారా ప్రాణాలను కాపాడే ఒక సేవ గురించి అవగాహనను కల్పించడంలో తన వంతు సహాయం చేస్తుంది.”

మెడ్యూలెన్స్ CEO ప్రణవ్ బజాజ్ ఇలా అన్నారు, “ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సహాయం కోసం కాల్ చేయడంలో ప్రజలకు సహాయపడే లక్ష్యంతో మెడ్యూలెన్స్ؚను ప్రారంభించాము. ఇప్పటివరకు మా కృషితో కొన్ని వందల ప్రాణాలను కాపాడగలిగాము, షార్క్ అమిత్ జైన్ తీసుకున్న ఈ అడుగు వలన మెడ్యూలెన్స్ సమాజానికి ఉపయోగపడేలా ఎంతో మందికి చేరువవుతుంది, అంబులెన్స్ؚను సరైన సమయానికి అందించడానికి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి వీలు కల్పిస్తుంది.”

తమ వ్యాపారం ద్వారా సామాజిక వైరుధ్యాలతో పోరాడుతూ, సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి కలిగి ఉన్న వ్యాపారవేత్తలు షార్క్ ట్యాంక్ ఇండియా 2.0లో ఎక్కువగా పాల్గొంటున్నారు. లాభం చూసుకోకుండా అటువంటి వెంచర్ؚలను ప్రోత్సహించడం, భారతదేశాన్ని అభివృద్ధి పధంలో నడిపే అటువంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడంలో అమిత్ జైన్ ముందు ఉన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience