కార్ధెకో వారు చెన్నై వరద ప్రభావిత ప్రాంతాలలోని కార్ల నష్టాల భర్తీకి ఒక భారీ స్థాయి వేలం పాటని ప్రకటించారు :

జనవరి 11, 2016 06:43 pm cardekho ద్వారా ప్రచురించబడింది

దాదాపు ఒక యాభై  ఆడి కార్ల వేలం చెన్నైలోని అమ్బత్తూర్ యార్డ్ లో  9 వ తారీకు శనివారం చోటు చేసుకుంది 

కొత్త ధిల్లీ,జనవరి 8,2016 : భారతీయ ప్రఖ్యాత ఆటోమొబైల్ పోర్టల్ అయిన కార్ దేఖో తమ యొక్క వేలం విభాగాల ద్వారా , చెన్నై వరద ప్రభావిత ప్రాంతాల వాహనాల నష్టాల భర్తీ కొరకు ఒక భారీ స్థాయి వేలం పాటను ప్రకటించారు. ఈ కార్ దేఖో యొక్క వేలం పాటల ద్వారా మరమ్మత్తు లకు కూడా సాధ్యపడని అనేక వరద తాకిడికి గురయిన వాహనాలను సద్వినియోగపరిచే విధంగా , తద్వారా ఇన్సూరెన్స్  సంస్థలకు ఒక పరిష్కారాన్ని  చేకూర్చే దిశగా ఈ వేలం ని  చేపట్టారు. వరద తాకిడి తరువాత తలెత్తిన అనేక వాహన భీమా సమస్యలకు మరియు  భీమా వినియోగదారుల  అభ్యర్ధనలకు ఒక  త్వరిత మరియు సమగ్ర పరిష్కార మార్గాన్ని చూపటం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.    

ఇటీవలి చెన్నై లో నెలకొన్న వరద పరిస్థితుల దర్మిళ, బీమా సంస్థలకు ఒక వెల్లువెత్తిన సంఖ్యలో వాహనాల బీమా అభ్యర్ధనలు లభించాయి. ఈ సందర్భంలో, నెలుకొన్న అభ్యర్ధన పరిష్కార సమస్యల వలన కాల వ్యవధి జాప్యం జరిగింది తద్వారా వాహన యజమానులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ సందర్భంలో కార్ధెకో సంస్థ యొక్క విభాగమైన "కార్ధెకో ఆప్షన్స్" వెలువెంటనే రంగంలోకి దిగి ఈ వాహనాల అభ్యర్ధనలను ఒక దారిలోకి తెచ్చేందుకు మరియు త్వరిత పరిష్కారం దిశగా పనిచేస్తుంది. వాహనాలను టోవింగ్ చేయుట, భద్రపరచుట, శుభ్రపరచుట లేదా తడి ఆర్చుట, చిన్నపాటి మరమత్తులు జరుపుట మరియు వేలం వేయుట వంటి సేవలను అందిస్తూ, కార్ధెకో వారు తమ యొక్క పూర్తి సేవలను వరద ప్రభావిత ప్రాంతాలకు అందిస్తున్నారు.  

అభిషేక్ గౌతమ్, సిఒఒ ,   కార్ దేకో ఆక్షన్స్ , సకాలంలో చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడుతూ   "చెన్నై లోని భీమా సంస్థలు వాహనాల యొక్క వాదనలు ,స్థల పరిమితులు, అంగబలం కొరత మరియు కొనుగోలు దారులు లేకపోవుట అనే అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి అన్నాడు. నష్టాన్ని తగ్గింపు చేసే ప్రచార చర్యల ప్రారంభం ద్వారా  భీమా కంపెనీల యొక్క సర్దుబాటుకి  మరియు సమగ్ర పరిధి ద్వారా వినియోగదారుల వాదనలు తేల్చేందుకు ఈ  మద్దతు సేవలు ఉపయోగపడుతాయి. చెన్నై లో మేము మా ఖాతాదారుల వాహనాల ను సురక్షితంగా ఉంచుకోవడానికి బహుళ గజాల ప్రత్యేక వాహనాలని ఏర్పాటు చేసాము. మా బృందం లోని సభ్యులు ఎక్కువ చొరవ చూపించి వినియోగదారులకి మరియు భీమా సంస్థలకి వ్యక్తీకరించిన పరిష్కారం చూపించి సమస్యలకి సర్దుబాటు చేస్తారని  మాకు బలమయిన నమ్మకం ఉంది." అని అన్నారు 

కార్ధెకో వారి వాహనాల ఈ వేలం యొక్క కార్యాచరణ తీరుతెన్నులు ఈ విధంగా ఉండబోతున్నాయి:

వరద ప్రభావిత వాహనాలు ఒక థర్డ్ పార్టీ సేవా సంస్థ ద్వారా కార్ధెకో యొక్క వేలం ప్రదేశానికి తరలించబడతాయి, తరువాత ఈ వాహనాలు శుభ్రత మరియు తడి ఆర్చుట వంటి చర్యలు చేయబడతాయి.
తదనంతరం కార్ధెకో వారి ఆన్లైన్ మరియు వేలం ప్రదేశాలలో త్వరిత మరియు సమగ్ర రీతిలో వేలం వేయబడతాయి. 

     కార్ధెకో వారు అదనంగా బీమా అభ్యర్ధులకు ఇన్స్యూరెన్స్ దాకల పత్రాలు, ఎన్వోసి వంటి పత్రాలను సమకూర్చుకునేందుకు తమవంతు సహాయాన్ని ఇక్కడ అందిస్తారు. అదనంగా, కార్ధెకో వారు ఐసి ఐసి ఐ లాంబార్డ్, రిలయన్స్ జనరల్, ఫ్యూచర్ జనరాలీ, టాటా ఏ ఐ జి, బారతీ -ఏ ఎక్స్ ఏ, హెచ్ డి ఎఫ్ సి, ఎర్గో, ఐ ఎఫ్ ఎఫ్ సి ఓ- టోక్యో, ఎల్ & టి, జి.ఐ మరియు ఎస్ బి ఐ జనరల్ వంటి ఇన్స్యురెన్స్ సంస్థల తోటి సమ్యుక్తంగా కలసి మరమత్తులకు అతీతమైన వాహనాలను అమ్మే దిశగా పనిచేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం చెన్నై ఈ విధంగా ఉన్నటువంటి కార్ల సంఖ్య పదివేలు ఉండవచ్చు.     

ఇటీవల స్థాపించబడిన కార్ దేఖో ఆక్షన్స్ మార్కెట్లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్నాయి. తరువాతి  మూడు నెలల్లో 5,000 వరద బాధిత వాహనాలను విక్రయించాలని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థ దాని హెడ్ క్వార్టర్స్ వద్ద ఒక ప్రత్యేక 15 సభ్యుల బృందం మరియు 3 యార్డ్ వేలం జరిగే స్థలంలో 15 సభ్యుల బృందంని నియమించాలని,  మరియు వారానికి  3 ఆన్ లైన్ ఆక్షన్స్ సదుపాయాలని అందించాలని నిర్ణయించుకున్నారు. వీరు 4 స్టాక్ యార్డ్స్ ,3 టోయింగ్ ఏజెన్సీస్, మరియు  కార్లని శుబ్రపరిచే 3సంస్థలతో కలిసి ప్రతి రోజూ 50 వాహనాలని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసారు. 

ఈ కంపనీ లో కుప్పలు కుప్పలుగా పడి ఉన్న వాహనాలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. శనివారం చెన్నై లోని అమ్బత్తూర్ యార్డ్ లో 50 ఆడి వాహనాలకి ఆక్షన్ విధించబడింది .
కార్ధెకో గురించి కొన్ని వివరాలు:

         గిర్నార్ సాఫ్ట్వేర్ ప్రైవేట్. లిమిటెడ్. వారి సంస్థ అయిన కార్ధెకో.కాం మార్చి 2008 లో నెలకొల్పబడింది. కార్ధెకో.కాం ప్రస్తుతం, భారతదేశంలోని అత్యంత పేరు పొందిన మరియు అగ్రగామి ఆటోపోర్టల్ వారు వాహనాల వినియోగదారులకు, వాహనాల యజమానులకు, వాహనాలపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు మరియు అభిమానులకు ఇంకా వాహన డీలర్లకు దేశవ్యాప్తంగా సేవలను అందిస్తున్నారు. ఇటీవల వీరు, గాడి.కాం, జిగ్ వీల్స్.కాం, బైయ్యింగ్ ఐ క్యూ మరియు దృశ్య 360 ఎస్ వంటి సంస్థలను సముపార్జించారు. ఈ ఆటోపోర్టల్ సంస్థ నెలసరి దాదాపు 33 మిలియన్ వీక్షించేవారిని మరియు దాదాపు 22 మిలియన్ ప్రత్యేక సందర్శకులను పొందుతుంది. గిర్నార్ సాఫ్ట్వేర్ వారు విదేశీయ ఉత్పత్తులు మరియు అవుట్సోర్స్ సాఫ్ట్వేర్ సేవలను అందించే లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ. ఈ కంపెనీ వారు ఇటీవల జనవరి 2015 లో ముగించిన సిరీస్ బి ఫండింగ్, 3000 కోట్లకు పైగా నిదులను సమకూర్చుకోగలిగారు. హాంకాంగ్ మూలంగా కలిగిన హిల్ హౌస్ మరియు టైబోర్నే వంటి పెట్టుబడి సంస్థలు వీరితో భాగం పంచుకుంటున్నాయి. ఇటీవల వీరు శ్రీ రతన్ టాటా మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ల దగ్గర నుండి కూడా నిదులను పొందగలిగారు. ప్రస్తుత గిర్నార్ సొఫ్ట్ వారి నికర విలువ రూ 2,500 కోట్లు గా కలిగి ఉంది. 2021 సంవత్సరం నాటికి, వీరు ప్రపంచవ్యాప్తంగా ఒక బహుళ బిలియన్ డాలర్ల సంస్థ గా ఎదిగాలి అని ఆశయంతో ఉన్నారు.

   సంస్థ గురించి అదనంగా తెలుసుకోవడానికి, మా వెబ్సైట్ ను సందర్శించండి www.cardekho.com

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience