Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కార్దేఖో వారు తమ యొక్క 2015 అకోలాడెస్ అవార్డులను ప్రకటించారు

ఫిబ్రవరి 03, 2016 05:17 pm cardekho ద్వారా ప్రచురించబడింది
20 Views

రెనాల్ట్ క్విడ్, మారుతి సుజికి బాలెనో మరియు హ్యుందాయి క్రెటా ఉత్తమ కార్లగా ఉన్నాయి

భారతదేశపు పేరుపొందిన ఆన్లైన ఆటోమొబైల్ పోర్టల్ కార్దేఖో.కాం ఇటీవల తమ యొక్క అకోలాడెస్ 2015 అవార్డ్డులను ప్రకటించారు. ఇవి వారి యొక్క సంవత్సరపు ఆటో అవార్డ్డుల జాబితా. విభిన్న విభాగాలలో అన్ని శ్రేణులలో ఈ అవార్డ్డులు ప్రకటించడం జరుగుతుంది. అవి కొత్త వాహనాలు లేదా ఫేస్లిఫ్ట్ వాహనాలు, అత్యధికంగా నామినేట్ అయిన వాహనాలు ప్రత్యేఖంగా కార్ధేఖో వెబ్సైట్ ద్వారా అత్యధిక వీక్షణలు పొందిన వాహనాలు ఈ జాబితాలో పోటీకి ఉంటాయి. ఇక వివరాలలోనికి వెళితే రెనాల్ట్ క్విడ్ బడ్జెట్ హ్యాచ్బ్యాక్ విభాగంలో ఈ సంవత్సరానికి ప్రధమ శ్రేణిలో నిలిచింది. ఈ వాహనం 70% ఈ విభాగంలో ఓట్లను నమోదు చేసుకొని ప్రధమ స్థానాలలో ఉండగా మారుతి సుజికి బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ గా పేరుపొంది 49% ఓట్లతో ధ్వితీయ స్థానంలో ఉంది. మారుతి సుజికి స్విఫ్ట్ డిజైర్ ఫేస్లిఫ్ట్ 34% ఓట్లతో ఉత్తమ సెడాన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఇక వేగవంతంగా పుజుకుంటున్న కాంపాక్ట్ ఎస్యువి శ్రేణి వాహనాలలో హ్యుందాయి క్రెటా 63% ఓట్లను సంపాదించడం జరిగింది.

ఇక మారుతి సుజికి వారు తమ యొక్క ఎర్టిగా ద్వారా ఇంకొక గెలుపు ని అందుకున్నారు. ఈ వాహనం 67% ఓట్లతో MUV ఆఫ్ ది ఇయర్ గా పేరు తెచ్చుకుంది. ఇంకో ప్రక్క మహీంద్రా ఎక్స్యువి500 77% ఓట్లను తెచ్చుకొని అన్ని విభాగాలను అధిగమిస్తూ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఇక లగ్జరీ సెడాన్ విభాగంలో ఆడీ A6 48% ఓట్లను సంపాదించుకొని లగ్జరీ సెడాన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.

ఇక లగ్జరీ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ అవార్డ్డు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పొర్ట్ కి లభించింది. ఇది 33% ఓట్లను సంపాధించింది. అయితే BMW i8 స్పోర్ట్స్ మరియు పర్వార్మెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్ గా పేరు పొంది 36% ఓట్లను పొందింది. మినీ కూపర్ S మరియు మెర్సెడీస్ బెంజ్ A క్లాస్ ఫేస్లిఫ్ట్ లు ఒకదానితో ఒకటి గట్టి పోటీ ని ఎదుర్కొని నిలిచినప్పటికీ లగ్జరీ హ్యాచ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ పేరుని మాత్రం మినీ కూపర్ 30% ఓట్లతో గెలుచుకుంది.

ఇక 2 వీలర్ విభాగంలో హీరో పాషన్ ప్రో ఎంట్రీ లెవెల్ బైక్ ఆఫ్ ది ఇయర్ గా 39% ఓటులని సంపాదించుకుంది. అయితే హోండా ఆక్టివా 3జి 52% ఓట్లతో స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా పేరుపొందింది. బజాజ్ పల్సర్ AS 200 35% ఓట్లను పొంది ఎగ్జిక్యూటివ్ బైక్ ఆఫ్ ది ఇయర్ గా పేరుపొందింది. బజాజ్ పల్సర్ RS200 ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ గా పేరు తెచ్చుకోగా కావసాకి నింజా H2సూపర్ బైక్ ఆఫ్ ది ఇయర్ గా పేరు తెచ్చుకుంది.

రెనాల్ట్ క్విడ్ కి కార్ ఆఫ్ ది ఇయర్ గా ప్రత్యేఖమైన జ్యూరీ అవార్డ్డు లభించింది. అలాగే మహీంద్రా మోజో కి బైక్ ఆఫ్ ది ఇయర్ గా పేరు వచ్చింది.

కార్దేఖో అకోలాడెస్ ద్వారా వినియోగదారులు ఆన్లైన్ ఓటింగ్ పద్దతిలో వాహనాలను ఎన్నుకోవడం జరుగుతుంది. తద్వారా ఇది భారతదేశంలోని ప్రస్తుతపు మరియు భారతీయ కొనుగోలుదారుల యొక్క పూర్తి అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకోగలిగే ఒక అవార్డ్డులుగా పేరుపొందాయి.

ఒక అధ్యయనం ద్వారా మొత్తం పోల్ అయిన ఓటర్ల సంఖ్య 3.7 లక్షలు. ఇది డిసెంబర్ 15 నుండి జనవరి 2016 మధ్య జరిగిన ఓటింగ్ యొక్క సంఖ్య. ఓటర్లు వారి మొబైల్ ద్వారా అందుకున్న ఒక యునీక్ కోడ్ ద్వారా మరియు టెక్స్ట్ లేదా ఈమెయిల్ మెసేజ్ ద్వారా నిర్ధారింపబడతారు. ఒక్కొక్క వినియోగదారులు కేవలం ఒక్కసారి మాత్రమే తమ ఓటును అందించే విధానం దీని ద్వారా మొదలవుతుంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.6.23 - 10.19 లక్షలు*
కొత్త వేరియంట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.14 - 18.10 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.67.65 - 73.24 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర