రూ. 14,990 వద్ద శాన్ మారినో-330 ని ప్రారంభించిన బ్లాపంక్ట్

నవంబర్ 16, 2015 05:22 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

బ్లాపంక్ట్ ఇండియా ఒక 6.2-అంగుళాల డబుల్ డిన్ టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ శాన్ మారినో 330 ని ప్రారంభించింది.  జర్మన్ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ దేశంలో దీనిని రూ. 14,990 ధరకి అందించింది. ఈ వ్యవస్థ బ్లూటూత్, యుఎస్‌బి, ఎస్‌డి కార్డ్ మరియు ఆక్స్-ఇన్ వంటి కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.    

బ్లాపంక్ట్ ఇండియా ప్రొడక్ట్ హెడ్ దీపక్ అస్రాని మాట్లాడుతూ " మేము ఓఇఎం స్పేస్ లో మా పాదముద్ర విస్తరించేందుకు కొనసాగిస్తున్నాము. సగం పైగా మా ప్రపంచ ఆదాయం ప్రపంచ ప్రముఖ ప్రయాణీకుల కార్లకు మరియు వాణిజ్య వాహనాలకు నిజమైన ఓఇఎం పరిష్కారాలను అందించడం ద్వారా వస్తాయి. కార్యాచరణలో మార్పు, ప్రదర్శన మరియు సాంకేతిక కలిగిన శాన్ మారినో 330 ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రేడియో కనెక్టివిటీ, అనుసంధానం, ప్రాసెసింగ్ పవర్, మల్టీమీడియా ప్రదర్శన, ట్యూనర్ నాణ్యత మరియు సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్ఫేస్ పరంగా ఒక కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనుభవాన్ని అందిస్తుంది." అని తెలిపారు.   

ఈ వ్యవస్థ 800X480 పిక్సల్స్ రిజుల్యూషన్ కలిగియున్న ఒక 6.2-అంగుళాల టచ్ యూనిట్ ని కలిగి ఉంది. సంస్థ ప్రకారం, ఈ యూనిట్  యొక్క అంతర్నిర్మిత లెర్న్ ఆప్షన్ వాహనం యొక్క బహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ తో అనుసంధానం అయ్యేందుకు సహాయపడుతుంది . బ్లాపంక్ట్ శాన్ మారినో-330  అధిక నాణ్యత 24 బిట్ / 192kHz  శాంప్లింగ్ మరియు  4x45 వాట్లు గరిష్ట ఉత్పత్తి అందించే ఆన్ బోర్డు యాంప్లిఫైయర్ ని కలిగి ఉంటుంది. ఇది ప్రీ అవుట్స్ 3 సెట్లు (ఫ్రంట్ / ఎడమ / సబ్‌వూఫర్) తో వస్తుంది మరియు బాక్స్ లో ఒక హ్యాండ్హెల్డ్ ఐఆర్ రిమోట్ కంట్రోల్ తో పాటు సెలెక్టబుల్ క్రాస్ఓవర్ పాయింట్లతో ఎస్యుబి అవుట్ పుట్ చానెల్ కోసం క్రాస్ఓవర్ ని నిర్మించబడి ఉంది.            

ఇంకా చదవండి

కార్‌దేఖో.కాం మరియు వాటి అనుబంధ సంస్థలు అక్టోబర్ నెలలో 33 మిలియన్ సందర్శకులతో రికార్డు సృష్టించాయి!

.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience