ప్రఖ్యాత భారతీయ మోటార్ షో ఆటో ఎక్స్పో 2016 మరింత పెద్దది, మెరుగైనది మరియు ఆసక్తికరమైనదిగా మారబోతోంది

జనవరి 22, 2016 06:36 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గ్రేటర్ నొయిడా ఒక అతిపెద్ద వాహన ప్రదర్శనను త్వరలో చూడబోతోంది

గ్రేటర్ నొయిడా : ఆటో ఎక్స్పో- మోటార్ షో 2016 వచ్చే నెల 5-9 ఫిబ్రవరి 2016 లో ప్రదర్శనకు తేదీ ఖరారు అయ్యింది. ఇది ఇండియా ఎక్స్పో మార్ట్ గ్రేటర్ నొయిడా ఉత్తరప్రదేశ్ నందు జరగబోతోంది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మ్యానిఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ACMA) సమ్యుక్తంగా కాంఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చర్స్(SIAM), కలిసి ఈ ఆటో ఎక్స్పో ని నిర్వహిస్తున్నారు. ఈ ఆటో ఎక్స్పో భారతదేశంలో ఇప్పటివరకూ ఎన్నడూ లేనంత అతిపెద్ద ఆటో షో గా జరబోతుంది.

ఇండియన్ ఎక్స్పో మార్ట్ లిమిటెడ్((IEML)ఈ 2016 మోటార్ షో ఆటో ఎక్స్పో కి వేధికగా ఉంది కనుక ఒక భారీ స్థాయి మరమ్మత్తులను ఇప్పటికే జరుపుకుంది. ఈ విధంగా ఈ ప్రాంగణం 6 పెద్ద హాల్స్ కలిగి అధనంగా 37240చదరపు అడుగుల కార్పెట్ వైశాల్యం కలిగి పూర్తి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థతో మరియు నిర్వధిక విద్యుత్ సరఫరాను కలిగి ఉండబోతోంది. ఈ ప్రాంగణం 2014 లో 8 శాస్వత హాల్స్ ని కలిగి 27,648 చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఇప్పటికే కలిగి ఉండగా అదనంగా కొత్త ప్రదర్శన హ్యాంగర్లను 32400 చదరపు మీటర్ల వైశాల్యం కలిగినటువంటివి అందించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఎగ్జిబిషన్ అంతర్భాగంలో కలిగిన వైశాల్యం 67000 చదరపు మీటర్ల నుంచి పెంచబడి 73,000 చదరపు మీటర్లను ఇప్పుడు కలిగి ఉండబోతోంది.

అంచనాల ప్రకారం ఈ మోటార్ షో 2016 ఆటో ఎక్స్పో మునుపటి కన్నా 20 శాతం ఎక్కువ సందర్శకులను పొంది ప్రదర్శన 5 రోజులకు దాదాపుగా 1.20-1.25 లక్షల మంది సందర్శకులను స్వాగతించబోతోంది అని అంచనా. ఇక మునుపటి ప్రదర్శనలో 55 మంది ప్రదర్శకులు తమ వాహన ఉతపత్తులను ప్రదర్శించగా రాబోయే ఈ ప్రదర్శనకు ఇప్పటికే 65 కి మించిన ప్రదర్శకులు నమోదు కావడం జరిగింది.

మిస్టర్ విష్ణు మాథూర్, డైరెక్టర్ జనరల్, సియాం ఈ విధంగా అన్నారు " ఆటో ఎక్స్పో ఎప్పటి నుంచో ఆటోమొబైల్ సంస్థలకు దేశీయంగా ఒక ఉత్తమమైన వేధికగా నిలుస్తూ వచ్చింది. ఈ ఆటో ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా ఆటో ఉత్పత్తి సంస్థలకు కావలసిన ప్రేరణను ఈ సారి కూడా అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపును తీసుకు వస్తుందని నమ్ముతున్నాము. ఉత్పత్తి రంగంలో, అధ్యయనం మరియు అభివృద్ధిలో, తరువాతి తరం వాహనాల తయారీలో మరియు కాన్సెప్ట్ వాహనాల డిజైన్ మరియు నవీకరణలలో మేము ఈ ఆటో ఎక్స్పో ద్వారా ఒక సమగ్రమైన వేధికను ఉత్పత్తిదారులకు అందించబోతున్నాము. ఈ సందర్భంగా ఇందుకు కృషి చేసినటువంటి మరియు ఈ ఆటో ఎక్స్పో ని పెద్దదిగా ఇంకా ఉత్సాహవంతంగా ఉండేలా ప్రయత్నిస్తున్న అన్ని విభాగాలకు మా ప్రశంసలు తెలియజేస్తున్నాము. మా కార్య నిర్వాహకులు మరియు ఉద్యోగులు ఒక సమిష్టి కృషితో అతి సూక్ష్మ వివరాలలో కూడా జాగ్రత్తలు తీసుకొని దీనిని తీర్చిదిద్దుతున్నారు."

ఆటో ఎక్స్పో - మోటార్ షో 2016 అశోక్ లేలాండ్, ఆడి భారతదేశం, BMW భారతదేశం, డాట్సన్, ఫియట్ భారతదేశం, ఫోర్డ్ భారతదేశం, జనరల్ మోటార్స్, హోండా కార్స్ భారతదేశం, హ్యుందాయ్ మోటార్ భారతదేశం, ఇసుజు మోటార్స్ భారతదేశం, జాగ్వార్ ల్యాండ్ రోవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి భారతదేశం, మెర్సిడెస్ బెంజ్ భారతదేశం, నిస్సాన్ మోటార్ భారతదేశం, రెనాల్ట్ భారతదేశం, స్కానియా వాణిజ్య వాహనాలు భారతదేశం, SML ఇసుజు, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, VE వాణిజ్య వాహనాలు , వోక్స్వ్యాగన్ భారతదేశం మొదలైనవి.ద్విచక్రవాహన విభాగంలో హీరోమోటోకాప్, భారతదేశం యమహా, మహీంద్రా 2 వీలర్స్, పియాజ్జియో వాహనాలు సుజుకి మోటార్సైకిల్ భారతదేశం ట్రైయంప్ మోటార్ సికిల్ భారతదేశం, టీవీఎస్ మోటార్ కంపెనీ మొదలైనవి వారి యొక్క సంకేతికతను ఉత్పత్తులను ప్రదర్శించబోతున్నారు.

ఈ సంస్థలతో పాటూ దేశీయంగా ప్రవేశించబోతున్న కొన్ని కొత్త వాహన ఉత్పత్తులైన అబార్త్, బిఎండబ్లు మోటోరాడ్, జీప్, DSK బెనల్, పొలారిస్, ఇండియన్ మోటార్ సైకిల్స్ వగైరా వంటి వాహనాలు ప్రదర్శితం కాబోతున్నాయి.

వాహనతయారీసంస్థలతో పాటూ ఆటో ఎక్స్పో 2016 లో ఉత్తమ శ్రేణి సైకిళ్ళు, టైర్లు మరియు ట్యూబ్ లు, ఇంధన సంస్థలు ఆటో వాహనాల డిజైన్ మరియు సాంకేతికతలు, వాహనాలకు సంబంధించిన ఇంజినీరింగ్ మరియు IT సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వాహన భీమా సంస్థలు మరియు మీడియా మరియు ఆటో పోటలు లు ఇందులో పాలు పంచుకోబోతున్నాయి.

మునుపటి లానే ఈ సారి కూడా వింటేజ్ కార్ల వేధిక ప్రత్యేకమైన యాక్టివిటీలో భద్రతా సంబంధిత కార్యకలాపాలు, వాహన చోదకుల ప్రదర్శనలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఉత్సాహం ఇంతటితో ఆగదు, సూపర్ ద్విచక్ర వాహనాల యజామౌలు ణ్ఛృ నుండి ఆటో ఎక్స్పో కు తమ వాహనాలను ప్రదర్శించడానికి రాబోతున్నారు మరియు వారు సందర్శకులకు వారి యొక్క ఆశక్తికరమైన వాహనాలను పరిచయం చేస్తూ వాహనం నడిపే విధానాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధరించవలసిన భద్రతా ప్రమాణాలు ప్రాముఖ్యత గురించి వివరించబోతున్నాయి. ఇంకా హాల్ నెం.16 లో ఒక ప్రత్యేకమైన బాలీవుడ్ కార్లను కలిగి ఉంటుంది. ఇక్కడ హిందీ చలన చిత్రాలను వాడిన విఖ్యాత బైకులు మరియు కార్లను ప్రదర్శిస్తారు. ఇదే హాల్ లో సూపర్ కార్లు మరియు బైకులు కూడా సందర్శకులను ఆసక్తి పరచబోతున్నాయి.

ఈ ప్రదేశం ఒక విఖ్యాత ఆహార బ్రాండ్ సంస్థ నుండి ఆహారాన్ని సందర్శకులకు రుచికి అనుగుణంగా సఫరా చేయబోతున్నాయి. తాజ్ మరియు రాడిషన్ హోటల్ వారు రెండు ప్రత్యేక రెస్టారెంట్లను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. అంతేకాకుండా సందర్శకులకు మరింత రుచి ని అందించేందుకు త్వరిత సేవా రెస్టారెంట్లు కూడా ఉండబోతున్నాయి, అవి డామినోస్, డంకెన్ డోనట్స్, KFC,, సబ్ వే మరియు పిజా హుట్ లో ప్రాంతీయంగా ప్రక్యాతి పొందిన చయోస్, చాయ్ పాయింట్, చకోలా, 34 చౌరంగీ లేన్ బేకర్ స్ట్రీట్, పంజాబ్ గ్రిల్, కెబాబ్ ఎక్స్ప్రెస్స్ లు కూడా వారి స్టాల్ లను ఉంచబోతున్నారు. ఈ ఫుడ్ కోర్ట్ సదుపాయం 1000 చదరపు మీటర్లు గా కలిగి ఉండబోతోంది.

ఈ ప్రదేశం ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఒక నిరంతర బస్సు సేవలను బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్, సమీపంలోని మెట్రో స్టేషన్ లకు ఎగ్జిబిషన్ స్థలం నుండి అందుబాటులో ఉంటుంది. DTC బస్సులు మునుపటిలానే ఈ ప్రదర్శన సాలకు సేవలు అందించి ఈ ఆటో షో ని ఘన విజయం చేయబోతున్నాయి. ఇక ఆటో ఎక్స్పో టికెట్లు ప్రజలకు లభ్యంలో మునుపటి నుండే ఉన్నాయి. www.bookmyshow.com. ద్వారా ఇవి ఆన్లైన్ లో కూడా లభ్యంలో ఉన్నాయి. ఒక్కొక టికెట్ ధర రూ.650 బిజినెస్ గంటలకు గాను వారం రోజుల్లో(ఉ.10 నుండి మ.1) కలిగి ఉంటుంది, రూ.300 సాధారణ పబ్లిక్ గంటలలో వారం రోజులకు గానూ(మ.1-6.సా) కలిగి ఉంటుంది మరియు రూ.400 వారాంతరాలలో(ఉ.10-7.సా) వరకూ కలిగి ఉంటాయి.

ఆటో షో టికెట్లు నేరుగా కొనుగోలు చేసే మెట్రో స్టేషన్ ప్రదేశాలు:

1. రాజీవ్ చౌక్

2. బొటానికల్ గార్డెన్

3. ప్రగతి మైదాన్

4. మండీ హవుస్

5. జసోలా

6. ద్వారకా సెకండరీ-12

7. MG రోడ్

కొన్ని టికెట్ అమ్మకపు కౌంటర్లు అమ్మకపు ప్రదేశంలో కూడా కలిగి ఉంటాయి

సియాం వారు చైర్మెన్ మరియు సి ఇఒ ఆఫీస్,జిఎనైడిఎ, ది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రక్ట్ మెజిస్ట్రేట్ మరియు పోలీస్ యంత్రాంగానికి తమ యొక్క సేవలకు గానూ ముందస్తు ధన్యావాధాలు తెలియజేస్తున్నాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience