2016 ఆటో ఎక్స్పో లో 80 కొత్త వాహనాలు ఆవిష్కరించబడనున్నాయి.

జనవరి 18, 2016 08:11 pm nabeel ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2016 సంవత్సరం 13 వ ఎడిషన్ ఆటో ఎక్స్పో ద్వారా గౌరవించబడుతుంది. ఇది దాని అన్ని మునుపటి ఈవెంట్ల కంటే పెద్దగా ఆర్భాటంగా రావాలనుకుంటుంది. 2016 ఆటో ఎక్స్పో లో 80 కంటే ఎక్కువ కొత్త వాహనాలు ఆవిష్కరించబోతున్నారు. మొత్తం 20 దేశాల నుండి 1500 సరఫరాదారులు 2016 షో లో వారి తాజా టెక్నాలజీలు పాల్గొనేందుకు తార్కాణంగా ఉంటుంది. ఇందులో 900 పైగా భారతీయ కంపెనీలు మరియు 50 కొత్త ఎంట్రీలు 600 అంతర్జాతీయ ప్రదర్శనకారులకు వేదిక కానుంది.

ఈ మోటార్ షో భారతదేశం లో ఎక్స్పో మార్ట్, గ్రేటర్ నోయిడా వద్ద జరుగుతాయి. ఇది 73.000 చదరపు మీటర్ల, విస్తీర్ణంలో జరగనుంది. అనగా 2014 లో జరిగిన 12 వ ఎడిషన్ కన్నా 4,000 చదరపు మీటర్లు ఎక్కువ. ఈ సంవత్సరం, మరింత ఆటో అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఆరు పెద్ద మందిరాలు తగినంత విద్యుత్ సరఫరా మరియు ఎయిర్ కండిషనింగ్ కలిగి ఉన్న కార్పెట్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు.సియామ్, అధ్యక్షుడు, మిస్టర్ వినోద్ దాసరి మాట్లాడుతూ "ఆటో ఎక్స్పో సంప్రదాయకంగా ఆటోమొబైల్ పరిశ్రమ కోసం లాభసాటి వేదిక కానుంది" అన్నారు. ఆటో ఎక్స్పో పరిశ్రమకు చాల వరకు నమ్మకాన్ని అందిస్తుంది. మరియు దీనిలో పాల్గొనే బ్రాండ్లు ప్రపంచ స్థాయిలో గుర్తించబడతాయి. మేము ఆటో ఎక్స్పో ఎడిషన్ మరింత ఉత్తేజకరమైన మేకింగ్ కావాలని సహకరిస్తాము అన్నారు. ఆటో ఎక్స్పో సజావుగా , ప్రతీ నిమిషం జాగ్రతగా జరిగేటట్టు చర్యలు తీసుకుంది" అన్నారు.

కాంపోనెంట్ షో పాటుగా ఇంజనీరింగ్ విద్యార్థులకు యువతలో మంచి సృజనాత్మకత ని పెంపొందించే విధంగా " ప్యాషన్ ఫర్ ఇన్నోవేషన్" ని నిర్వహించాలని అనుకుంటుంది. ఈ ప్రదర్శన ప్రగతి మైదాన్ వద్ద 18 మందిరాలు 80,000 చదరపు మీటర్ల అంతటా వ్యాపించి ఉంటుంది. ACMA, అధ్యక్షుడు,మిస్టర్ అరవింద్ బాలాజీ, ఇలా చెప్పారు. " ఈ ఆటో పరిశ్రమ గ్రాడ్యుయేట్ యొక్క మేధో సంపత్తి మరియు కొత్త వి సృష్టించే సామర్ధ్యాన్ని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది అన్నారు" .ఈ సంవత్సరం ACMA యొక్క థీమ్ తో లైన్ లో - రూపకల్పన అభివృద్ధి మరియు భారతదేశం లో సాంకేతికత ,ఒక ఏకైక ఇన్నోవేషన్ పెవీలియన్ ఆటో ఎక్స్పో 2016 వద్ద ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాంగణం ప్రాధమిక లక్ష్యం కూడా దేశంలో ఆటోమోటివ్ రంగం ఉత్పత్తిని అభివృద్ధి చేయటమే తార్కాణంగా ఉంది. అనేక కొత్త భాగాలు కూడా ఆటో ఎక్స్పోలో వ్యక్తిగత కంపెనీ స్టాల్స్ సమయంలో ప్రారంభించాలని అనుకుంటున్నారు".

డైరెక్టర్ జనరల్ సిఐఐ, Mr చంద్రజిత్ బెనర్జీ, దీనిని విశదీకరిస్తూ " ఆటో ఎక్స్పో ఒక 'విలక్షణ మరియు ప్రత్యేక షో' గా అభివర్ణించాడు.ఆటో ఎక్స్పో 30 సంవత్సరాల కాలంలో అసాధారణంగా ఉంది దీనిలో 2016 లో 1580 ప్రదర్శనకారులకు 152 ప్రదర్శనకారులు నుండి పదిరెట్ల పెరుగుదల చవిచూసింది అని అన్నారు. షో యొక్క బలం పెరుగుతూ పోతోంది. Mr చంద్రజిత్ బెనర్జీ ఆటో ఎక్స్పో 2016 లో 80 కొత్త వాహనాలు ఆవిష్కరించ బడుతాయని సాక్షాలని కూడా గమనించారు. Mr డీప్ Kapuria చైర్మన్ ట్రేడ్ ఫెయిర్ కౌన్సిల్, సిఐఐ ఆటోమోటివ్ రంగం వృద్ధి డ్రైవర్, R & D మరియు ఇన్నోవేషన్ గురించి నొక్కి వక్కాణించారు. ఆటో ఎక్స్పో భరోసాను వివిధ అంశాల మధ్య మరింత సహకార విధానం కోసం బాటలు వేసింది . తయారీదారులు, OEM లకు, మెషిన్ టూల్ సరఫరా, మరియు ముడి పదార్థం పరిశ్రమ అనే వివిధ అంశాలు దీనిలో భాగంగా ఉంటాయి. మేము స్థానికంగా పోటీ నుండి ప్రపంచ పోటీకి ఎదిగాలి అంటే మన సంబందాలు ద్రుధంగా ఉండాలి మరియు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి అని కూడా అన్నారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience