ఆటో ఎక్స్పో 2016 విజయోత్సాహంతో ముగిసింది. ఇది 6 లక్షల మంది ప్రజల సందర్శనతో రికార్డ్ నమోదు చేసుక ుంది
ఫిబ్రవరి 11, 2016 07:10 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
గ్రాండ్ ఆటోమొబైల్ ఈవెంట్, ఆటో ఎక్స్పో 2016, చివరకు ముగిసింది. వాహనాల భారీ ప్రదర్శన ఏడు రోజుల వరకు 6 లక్షల మంది ప్రజలని ఆకర్షించింది. వోల్వో మరియు స్కోడా వాహనాలు ఇక్కడ మిస్ అయ్యాయి. ఇక్కడ BMW, ఆడి, మెర్సిడెస్ మరియు జాగ్వర్ వంటి కార్ ఆటోమొబైల్స్ తయారీదారులు ఇక్కడ ప్రదర్శించారు. వీటిని ప్రేక్షకులు సందర్శించారు.
సియామ్,డైరెక్టర్ జనరల్,మిస్టర్ విష్ణు మాథుర్, ఈ విజయవంతం అయిన ప్రదర్శన గురించి మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేసారు. ఆటో ఎక్స్పో భారత తయారీ బలం మరియు సాంకేతిక సామర్ధ్యాల ప్రదర్శన వలన విజయవంతం అయ్యిందని మాట్లాడారు. ఇక్కడ మొత్తం 108 పైగా కొత్త ఉత్పత్తులు ప్రారంభించ బడ్డాయి. మరియు అంతేకాక చాలా వాహనాలు బహిర్ఘతం చేయబడ్డాయి. అంతే కాక పోయిన వారం 6,01,914 పైగా సందర్శకులు దీనిని వీక్షించారు. ఈ ఎక్స్పో భారత ఆటోమొబైల్ పరిశ్రమలో తయారీదారుల విశ్వాసాలని మరింతగా బలోపేతం చేసింది. మోటార్ షో లో ప్రదర్శించిన ప్రదర్శన కార్లకి మరియు వీక్షించిన సందర్శకులకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ విజయం వారి సమర్ధత వలన చవి చూపించబడింది.
మోటార్ షో లో 65 తయారీదారులు ఉన్నారు. వీరు తమ ఉత్పత్తులని ప్రజలకి చూపించారు. 108 కొత్త ఉత్పత్తులు ప్రజల కోసం వారం అంతా బహిర్గతం చేయబడ్డాయి. లెక్కలేనన్ని ఆహార స్టాల్స్ ని మరియు వినోద కార్యక్రమాలని నిర్వహించటం వలన ఎక్స్పో జరిగిన వారాంతపు రోజులలో ప్రజల తాకిడి చాలా రద్దీగా ఉంటుంది. భారీ పరిశ్రమలు శాఖా మంత్రి, హైవేల మంత్రి శ్రీ అనంత్ Geete, రోడ్, రవాణా శాఖా మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 4 న మోటార్ షో ని ప్రారంభించారు. మొదటి రెండు రోజులు మీడియాకు కాగా, మిగిలిన ఐదు రోజుల సాధారణ ప్రజల కోసం ఈ ఆటో ఎక్స్పోని తెరచి ఉంచారు.
రోజు వారీగా సందర్శకుల వివరాలు;
రోజు |
సందర్శకులు |
ఫిబ్రవరి 3 మరియు 4 వ తేదీ |
75,000 |
ఫిబ్రవరి 5 |
79,000 |
ఫిబ్రవరి 6 |
1,12,400 |
ఫిబ్రవరి 7 |
1,30,975 |
ఫిబ్రవరి 8 |
1,09,539 |
ఫిబ్రవరి 9 |
95,000 |
మొత్తం |
6,01,914 |