• English
  • Login / Register

క్రాష్ టెస్ట్ లో విఫలమైన 140 మోడళ్ల కార్లను నిషేధించిన అస్సాం హై కోర్ట్

ఆగష్టు 20, 2015 12:27 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భద్రతా నిబంధనలను అందుకోలేని కారణంగా అస్సాంలోని ఆటోమొబైల్ రంగంలో చిన్న కార్ల అమ్మకాలను మరియు ఆవిష్కరణలను నిషేధించడమైనదని అస్సాం హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ పిటీషన్ ను రహదారి సురక్షితమైన వాహనాలను తయారుచేయడానికి సమాధానంగా దాఖలు చేశారు. ఈశాన్య భారతదేశంలో అస్సాం అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్, కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వలన దీనిపై చాలా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. మారుతి, హ్యుందాయ్, హోండా వంటి పెద్ద సంస్థలు స్విఫ్ట్, ఆల్టో, ఐ 10, ఇయాన్ మరియు జాజ్ వంటి వారి ప్రసిద్ధ మోడల్లకై నమోదు చేసుకున్నారు. గౌహతి హైకోర్టు ఉత్తర్వు ద్వారా ఈ నమోదులన్నీ ఆగిపోయాయి. దీనివలన ఎస్యూవి మరియు ఎంపివి లకు ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇవి తగినంత పటిష్టమైనవిగా ప్రభావాలను తట్టుకునే విధంగా ఉంటాయి.

వరుసగా రెండు సంవత్సరాల తిరోగమనం తర్వాత మార్కెట్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో 7% వృద్ధిని సంపాదించుకుంది. ఇలాంటి సమయంలో ఇది కారు తయారీదారులకు ఒక చెడు వార్తగా చెప్పవచ్చు. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ప్రకారం, దేశంలో ఈశాన్య రాష్ట్రాల యొక్క కార్ల అమ్మకాలు దాదాపు 12% ఉన్నాయి. 

గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సి ఏ పి) వంటి క్రాష్ టెస్ట్ లో, అస్సాం లో అమ్మబడిన కార్లకు కూడా ఈ టెస్ట్ ను వర్తింపజేయాలని అర్జీదారులు ఉద్ఘాటించారు. ఎందుకంటే ఈ రాష్ట్రం పర్వత ప్రాంతం మరియు ప్రమాదాలకు లోనయ్యే ప్రాంతం అందుకే ఈ ప్రాంతంలో తిరిగే అన్ని వాహనాలకు అధిక భద్రత ప్రామాణికత అవసరం. కాబట్టి ఇక్కడ అన్ని వాహనాలకు ఈ టెస్ట్ వర్తింప చేయాలి అని పిటీషన్ దాఖలు చేశారు. ఈ వాదనను ఏకీభవిస్తూ, హైకోర్టు జూన్ 26 న క్రాష్-పరీక్ష నిబంధనలను చేరుకోలేని అన్ని సంస్థల 140 మోడల్ల కార్లను నిషేధించింది. ఈ కేసు విచారణ తదుపరి నెల ఆగస్టు 27 న జరగనుంది. 

గత ఏడాది ఎన్ సి ఏ పి ఫ్రంటల్ ఆఫ్సెట్ క్రాష్ పరీక్షను నిర్వహించారు. దీనివలన ఒక వాహనం యొక్క ముందు భాగంలోని ఒక చిన్న ప్రాంతంలో ఇంపాక్ట్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ టెస్ట్ ఫ్రంటల్ క్రాష్ టెస్ట్ కంటే కఠినంగా ఉంటుంది. 
భారతదేశంలో మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఐ 10, ఫోర్డ్ ఫిగో మరియు డాట్సన్ గో వంటి చాలా కార్లు మన దేశంలో అభివృద్ధి చెందినప్పటికీ ఈ పరీక్షలలో విఫలమయ్యాయి. భారతదేశం వాహన భద్రత పై ఇటువంటి కఠినమైన విధానాన్ని ఇంకా చూడవచ్చు. 

కోర్ట్ తాత్కాలిక ఆదేశాలు ఈ విధంగా చెప్తున్నాయి. సెంటర్ ఆటో తయారీదారులు 1500కిలోల లోగా ఉన్న చిన్న నాలుగు చక్రాల వాహనాలను క్రాష్ టెస్ట్ మరియు ఎమిషన్ టెస్ట్ లో పెట్టకుండా విడుదల చేయకూడదు మరియు విక్రయించకూడదు అని ఆర్డర్ చేశారు. ప్రతిస్పందనగా, అస్సాం లో రవాణా అధికారులు క్రాష్-పరీక్ష నిబంధనలకు అనుగుణంగా లేని ఏ ఒక్క వాహనాన్ని అమ్మరాదని డీలర్స్ నికోరారు. దీని ఫలితంగా అస్సాంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిషేధించబడినది. 

కారు తయారీ సంస్థలు ఈ ఆర్డర్ వలన ఆందోళన చెంది భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) ద్వారా తమ వాదనను తెలియజేసుకుంటున్నారు. హ్యుందాయ్, మారుతి సుజుకి, టయోటా, హోండా వంటి సంస్థలు కోర్టు ఆదేశానుసారం సమస్యలను ఎదుర్కుంటున్నామని అంగీకరించారు. 

తయారీదారులు 2017 లో ఫ్రంటల్ క్రాష్ టెస్ట్, స్టీరింగ్ ఇంపాక్ట్ టెస్ట్ మరియు మరింత కఠినమైన ఫ్రంటల్ ఆఫ్ సెట్ క్రాష్ టెస్ట్ లు ఇవన్నీ భారతదేశం లో విజయవంతంగా అమలు చేశాక వారి ఉత్పత్తులు ఆ పరీక్షలన్నిటిలో పాల్గొంటాయని తెలిపారు. వారు ఫ్రంటల్ క్రాష్ పరీక్ష నిబంధనలను చేరుకోగలిగితే గనుక, ఉత్పత్తుల అమ్మకాలు మరియు నమోదులు ఆపేది లేదని కూడా తెలిపారు. ఈ నిబంధనలు ప్రస్తుతం భారతదేశం లో వర్తించవు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience