ఎలక్ట్రిక్ కార్లను నిర్మించడానికి సిద్ధం అవుతున్న ఆపిల్
జూలై 28, 2015 01:02 pm manish ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరంభంలో ప్రాజెక్ట్ యొక్క సన్నిహిత వర్గాలు ఈ విధంగా చెప్పారు. గత సంవత్సరం టిమ్ కుక్ జారీ చేసిన "టైటాన్" అనే ప్రాజెక్ట్ కి వందల మంది ఉద్యోగులను ప్రాజెక్టు మీద పనిచేయడానికి కేటాయించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రచురణలో తెలిపింది. ఆపిల్, దాదాపు 50 మంది ఉద్యోగులను కలిగి ఉంది, వీరిని ప్రత్యేకంగా టెస్లా నుంచి తీసుకువచ్చింది. వీరిలో చాలా మంది మెకానిక్ మరియు ఉత్పత్తి రంగాలలో ప్రావీణ్యతను కలిగి ఉన్నారు. క్రింద చూపించిన స్పై షాట్లు డాడ్జ్ కారవాన్ కి సంబంధించినవి. ప్రస్తుతం ఇది ఆపిల్ లీజ్ కి తీసుకుని దాని నిర్వహణను చేపడుతుంది. దీనిలోని రూఫ్ మౌంట్ కి కెమెరాలను మరియు సెన్సార్లతో సహా అటానమస్ డ్రైవింగ్ పరికరాలు అన్ని ఆపిల్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో రూపొందించబడ్డాయి. ఇది ఒక "టైటాన్" నమూనాకు మద్ధతునిచ్చే విధంగా ఉంది.
మాగజిన్ మేనేజర్ ప్రకారం, బీఎండబ్ల్యూ టెక్ దిగ్గజం ప్రస్తుతం పని చేస్తున్నటువంటి ఎలక్ట్రిక్ కారు బీఎండబ్ల్యూ ఐ3 ప్రాజెక్ట్ విషయమై ఆపిల్ సంస్థ బిఎండబ్ల్యూ తో చర్చించింది. టిమ్ కుక్ ఇటీవల జెర్మనీలో జరుగుతున్న ఐ3 ఉత్పత్తిని సందర్శించి బీఎండబ్ల్యూ యజమానులను కలిశారు. అతను ఆపిల్ యొక్క ఇతర అధికారులతో వీరిని కలవడం జరిగింది.
ఈ విషయం గురించి సిఎన్ బిసి అడిగిన ప్రశ్నలకు, బిఎండబ్ల్యూ అధికార ప్రతినిధి ఈ విధంగా చెప్పారు. ఇది, టెలికమ్యూనికేషన్స్, ఐటి పరిశ్రమ సంస్థలతో సాధారణ చర్చలు జరుగుతున్నాయి. ఆపిల్ కూడా దీనిలో పాల్గొంటుంది. అంతేకాకుండా, వాహనం కనెక్టివిటీ విషయాల గురించి కూడా మాట్లాడతారు. దీనిలో ఆయన ఇంకో విషయం కూడా జోడించారు అది ఏమిటంటే, "వాహనం యొక్క అభివృద్ధి మరియు ఉత్పత్తి గురించి చర్చలు మాత్రం లేదు అని ఆయన చెప్పారు.
కానీ 28 ఏళ్ల నుండి ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రముఖుడైన డౌ బేట్స్ ఆపిల్ యొక్క "ఆపరేషన్స్" విభాగంలో చేరడంతో ఈ ప్రాజెక్ట్ మరింతగా అభివృద్ధిని సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
మరో మాజీ ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ న్యూసన్ 2014లో ఆపిల్ సంస్థలో నియమితులయ్యారు. అతను ఫోర్డ్ 1999 '021సీ' కాన్సెప్ట్ ద్వారా అందరికి తెలిసిన అత్యుత్తమ డిజైనర్. అతని డిజైన్ నమ్మలేని విధంగా ఈ యొక్క ఆపిల్ డిజైన్ తో సారూప్యతను కలిగి ఉంది.
ఈ నివేదికల ప్రకారం, ఈ ఆపిల్ ఆటోమేటివ్ పరిశ్రమ నుండి కీలక వ్యక్తులను తీసుకోబోతుంది అంతేకాకుండా దీనితో పాటు, దీని యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ఈవి పరిశ్రమ పై ఉంది. ఆపిల్ పై, ఉద్యోగి ఆక్రమణల కారణంగా దావా వేశారు. అయినప్పటికీ, ఆపిల్ ఈ విషయాన్ని కొట్టి పారేసింది.