జీప్ హ్యాక్ తరువాత, టెస్లా మోడల్ ఎస్ టార్గెట్ చేసిన హ్యాకర్లు
ఆగష్టు 07, 2015 01:31 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: జీప్ హాక్ తరువాత 1.4 మిలియన్ కిపైగా కార్లను ఆ సంస్థ రీకాల్ చేసింది. సెక్యూరిటీ హ్యాకర్లు ఇప్పుడు విజయవంతంగా టెస్లా యొక్క మోడల్ 'ఎస్ ' ను హ్యాక్ చేసి దాని యొక్క వివిధ అంశాలను వారి అదుపులో పెట్టుకుని నియంత్రిస్తున్నారు. వారు కారు యొక్క ఎలక్ట్రానిక్ వ్యవస్థను సులభంగా పొందగలిగారు మరియు దానిని రిమోట్ సహాయంతో విజయవంతంగా ఆపి వేయగలుగుతున్నారు. భౌతికంగా మొదట కారులోకి ప్రవేశించాలంటే, హ్యాకర్లు మొట్ట మొదట దాని ఎలక్ట్రానిక్ వ్యవస్థను ఉపాయంతో తమ ఆధీనంలోకి తీసుకుని తరువాత దాని అడ్మినిస్ట్రేటివ్ అధికారాన్ని పొందుతారు. ఆపైన వారు టెస్లా యొక్క టచ్ స్క్రీన్ వ్యవస్థ ద్వారా గాని స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా గాని దానిని నియంత్రించవచ్చు. క్లౌడ్ ఫేర్ యొక్క ప్రిన్సిపాల్ భద్రతా పరిశోధకుడు మార్క్ రోజర్స్ మాట్లాడుతూ " మేముటెస్లా కారు గురించి వారితో మాట్లాడాము మరియు తప్పనిసరిగా దీని గురించి మరింత సమాచారం కావాలని అభ్యర్థించి అనుమతి తీసుకున్నాము. మేము ఒకసారి ఆ సమాచారం అంతా తీసుకోగలిగితే, అన్ని కంప్యూటర్లను కారులో మళ్లీ తీసి పెట్టే అవకాశం ఉందని" ఆయన అన్నారు.
లుకౌట్ చీఫ్ టెక్నాలజీ అధికారి కెవిన్ మహఫ్ఫీ ఈ హ్యాకింగ్ గురించి తన బ్లాగ్ లో ఈ విధంగా చెప్పారు. ఒకవేళ టెస్లా కారు గంటకు ఐదు మైళ్ళ ప్రయాణం కంటే తక్కువలో వెళుతుంటే అత్యవసర చేతి బ్రేక్ ను ఉపయోగించి దానిని ఆపి వేయవచ్చు. అది అధిక వేగంతో ఉన్నపుడు కూడా వాహనం దానంతట అదే ఇంజను ను ఆపివేసేలా చేయవచ్చు మరియు కారు చిట్ట చివరి వరకు వెళ్లే వరకు డ్రైవరు, స్టీరింగ్ ను కాని బ్రేకింగ్ ను గాని నియంత్రించకుండా చేయవచ్చు. స్పీడోమీటర్ పైన తప్పుడు వేగం ప్రదర్శించడం మరియు ఎలక్ట్రానిక్ విండోస్ ను తగ్గించడం మరియు పెంచడం, డోర్లను లాక్, అన్ లాక్ చేయడం వంటి విధులను హ్యాకర్లు చేయవచ్చు. ప్రత్యక్షంగా ప్రవేశించాలంటేవారికి హస్త నైపుణ్యం కావాలి , కాబట్టి డ్రైవర్ యొక్క భద్రత విషయంలో హ్యాకర్లు సంధి కుదుర్చుకుంటారు. హ్యాకర్లు వాహనం యొక్క బ్రౌజింగ్ సమాచార వ్యవస్థ ను పొందడానికి మరింత ప్రమాదకరమైన వాహనం యొక్క డ్రైవ్ సిస్టమ్స్-బ్రేకులు, స్టీరింగ్, యాక్సెలరేషన్ వంటి వాటిని హ్యాక్ చేస్తారు అనికెవిన్ మహఫ్ఫీ మరియు మార్క్ రోజర్స్ టెస్లాకి హెచ్చరించారు.
ఈ సమయంలో మనం చెప్పుకోదగ్గ మంచి విషయం ఏమిటంటే,టెస్లా ఇలాంటి పరిణామాలను అరికట్టడానికి ఒక పాచ్ ను విడుదల చేసింది మరియు ఈ కొత్త ఈ సాఫ్ట్ వేర్ నవీకరణను మనం ఎయిర్ ద్వారా నవీకరించవచ్చు మరియు దీనిని వైఫై ద్వారా లేదా సెల్యులార్ నెట్ వర్క్ ద్వారా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాస్తవికంగా వారు ఫ్రీక్వెన్సీ వద్దకనుగొన్న ప్యాచ్ వలయాలను తయారీదారులు ఒక ఓవర్-ది-ఎయిర్ ప్యాచ్ విస్టం ద్వారా ప్రతి ఒక కనెక్టెడ్ కారుకి పంపించి అమలు చేయాలి. టెస్లా ఇటువంటి వ్యవస్థను నిర్మించ్నందుకు చాలా సంతోషంగా ఉంది అని మహఫ్ఫీ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. టెస్లా నిజానికి తమ మోడల్ ఎస్ రూపకల్పనలో అద్భుతమైన సెక్యూరిటీ అంశాలను ప్రవేశపెట్టిందని కెవిన్ మహఫ్ఫీ మరియు మార్క్ రోజర్స్ ధ్రువీకరించారు. సైబర్ నిపుణులు, శుక్రవారం లాస్ వేగాస్ లో జరిగే డెఫ్ కాన్ హ్యాకింగ్ సమావేశంలోహాక్ కి సంబధించిన వివరాలను వెల్లడించనున్నారు.