• English
  • Login / Register

2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో : టాప్ 5 కార్ల ప్రయోగాలు

ఫిబ్రవరి 08, 2016 11:35 am bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో, ప్రజల కోసం ఫిబ్రవరి 5 వ తేదీ నుండి తెరవడం జరిగింది కానీ, పత్రికా రోజులలో అన్ని సరదాగా ఉంది మరియు ఇక్కడ మేము ప్రజల కోసం ఐదు టాప్ కారు ప్రయోగాలను అందించడం జరిగింది. ఈ కార్లు, వెంటనే లేదా త్వరలోనే అమ్మకానికి సిద్ధంగా ఉన్న టాప్ మోడల్స్ ఈ క్రింది ఇవ్వబడ్డాయి.

జాగ్వార్ ఎక్స్ ఈ (రూ 39.90 లక్షలు, ఎక్స్ షోరూం ఢిల్లీ)


బిఎండబ్ల్యూ 3 సిరీస్ వాహనాలకు పోటీగా జాగ్వార్ సంస్థ, బేబీ మోడల్ అయిన జాగ్వార్ ఎక్స్ ఈ వాహనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కారు, ఆటో ఎక్స్పో వద్ద భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది మరియు ఈ కారు వెంటనే అమ్మకాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ముందుగా, ఈ జాగ్వార్ ఎక్స్ ఈ వాహనం పెట్రోల్ వేరియంట్ తో మాత్రమే అందుబాటులో ఉంది మరియు ఈ వేరియంట్, వేర్వేరు ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఈ వాహనానికి, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 200 పి ఎస్ పవర్ ను అదే విధంగా 320 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇదే 2.0 లీటర్ ఇంజన్ టర్బో చార్జెడ్ తో జత చేయబడి అత్యధికంగా, 240 పి ఎస్ పవర్ ను అదే విధంగా 340 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.  

బిఎండబ్ల్యూ 7 సిరీస్ (రూ 1.1 కోట్లు, ఎక్స్ షోరూం ఢిల్లీ)


బిఎండబ్ల్యూ సంస్థ, తదుపరి తరం ఫ్లాగ్ షిప్ ను ప్రవేశపెట్టింది. ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని కొత్త్త 7 సిరీస్ వాహనాలు, భారతదేశంలో రూ 1.1 కోట్ల ధర వద్ద ప్రవేశపెట్టబడ్డాయి. ఈ అన్ని కొత్త 7 సిరీస్ వాహనాలు, బిఎండబ్ల్యూ యొక్క చెన్నై ప్లాంట్ వద్ద తయారు చేయబడతాయి మరియు ఈ వాహనం యొక్క 50 శాతం పరికరాలు స్థానికంగా ఉత్పత్తి చేయబడతాయి. ఈ ఆరవ తరం యొక్క 7 సిరీస్, కార్బన్ ఫైబర్ లను కలిగిన ఫ్రేం లను, ఐ డ్రైవ్ 5.0 తో హ్యాండ్ గెస్టర్ నియంత్రణ ను, డ్రైవర్ ప్రమేయం లేని ఆటోమేటిక్ పార్కింగ్, 4 వీల్ స్టీరింగ్ మరియు అనేక ఇతర టెక్నలాజికల్ వినూత్న అంశాలను అందించడం జరిగింది. ఈ 7 సిరీస్ వాహనాలకు ఈ బిఎండబ్ల్యూ సంస్థ, డీజిల్ అలాగే పెట్రోల్ ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. 730 డి డీజిల్ ఇంజన్, ఆరు సిలండర్ల ఆకృతీకరణ తో అత్యధికంగా 265 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే 740 ఐ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, 3.5 లీటర్ వి6 ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 326 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 750 ఐ వేరియంట్ విషయానికి వస్తే, 4.4 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 444 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని ఇంజన్ లు, 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి.

ఆడి ఆర్8 (రూ 2.47 కోట్లు, ఎక్స్ షోరూం ఢిల్లీ)


ఈ ఆడి ఆర్8 వాహనం అనేది, ఆడి సంస్థ యొక్క స్పోర్ట్స్ కారు గా ఉంది మరియు ఈ కొత్త ఆర్ 8 వాహనం, అనేక కొత్త అంశాలను కలిగి ఉంది. ఈ కొత్త ఆర్ 8 వి 10 ప్లస్ వాహనం అనేది పూర్తిగా కొత్తది మరియు ఇది విర్ట్యువల్ కాక్పిట్ వ్యవస్థ తో వస్తుంది. ఈ కొత్త ఆర్ 8 వాహనం, వేర్వేరు ఉత్పత్తులను విడుదల చేసే ఒకే ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనం, 5.2 లీటర్ వి10 యూనిట్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 540 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 610 బి హెచ్ పి పవర్ ల ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆర్ 8 వాహనం యొక్క ఇంజన్, 7- స్పీడ్ ఎస్ ట్రోనిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు క్వాట్రో ఏడబ్ల్యూడి సిస్టం తో జత చేయబడి విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క చక్రాలకు పంపిణీ అవుతుంది. ఈ ఇంజన్ యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 3.2 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే ఇంజన్ అత్యధికంగా 330 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వోక్స్వాగన్ పోలో జిటి ఐ (అంచనా ధర సుమారు రూ 15 లక్షలు) 


ఈ హాట్ హాచ్ విభాగం ఎక్కువ యాక్టివిటీ ను చూస్తుంది మరియు ఈ వోక్స్వాగన్ పోలో జిటి ఐ వాహనం అనేది తాజా వేరియంట్ అని చెప్పవచ్చు. ఈ వోక్స్వాగన్ పోలో జిటి ఐ వాహనం, సాధారణ పోలో వాహనానికి బిన్నంగా ఉంటుంది. ఈ సాధారణ పోలో వాహనం, 3 డోర్ల లే అవుట్ తో, ఎల్ ఈ డి హెడ్ లైట్ల తో, ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు, నవీకరించబడిన ముందు బంపర్, ఎల్ ఈ డి టైల్ ల్యాంప్లు మరియు ట్విన్ ఎగ్జాస్ట్ అవుట్లెట్లు వంటి అంశాలతో సాధారణం గా ఉంటుంది. ఈ పోలో జిటి ఐ వాహనం, 1.8 లీటర్ టిఎస్ ఐ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 192 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 320 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పోలో జిటి ఐ వాహనం, సిబియూ ద్వారా కొనుగోలు జరుపుతుంది. కావునా, ఈ వాహనం తక్కువ ధరకు ఏమి అందించబడదు. ఈ వాహనం, సెప్టంబర్ 2016 ప్రారంభమయ్యే సరికి ఈ వాహనం యొక్క ధర, సుమారు రూ. 15 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా.

రెనాల్ట్ డస్టర్ (అంచనా ధర సుమారు రూ. 9 లక్షల నుండి)


భారతదేశ ప్రయోగం కోసం ఈ రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ వాహనం, చాలా కాలం పాటు వాయిదా వేయబడుతుంది మరియు ఈ సంస్థ, ఈ ఫేస్లిఫ్ట్ వాహనాన్ని ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించడం జరిగింది అలాగే త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ డస్టర్ ఫేస్లిఫ్ట్ వాహనం, కొత్త ముందు గ్రిల్, కొత్త హెడ్ ల్యాంప్ అసెంబ్లీ, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు కొత్త టైల్ ల్యాంప్ డిజైన్ వంటి అనేక కాస్మటిక్ నవీకరణలు ఈ ఎస్యువి కు అందించబడ్డాయి. ఈ వాహనం యొక్క లోపలి భాగానికి కూడా, కొత్త సీట్ అపోలిస్ట్రీ తో పాటు డాష్బోర్డ్ కు కొన్ని మార్పులు అందించబడతాయి. యాంత్రిక విషయానికి వస్తే, ఈ వాహనానికి మునుపటి వెర్షన్ లో ఉండే అదే ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 110 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 6- స్పీడ్ ఏ ఎం టి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience