ఎస్యువి లకోసం తయారుచేసిన జెకె టైర్స్ యొక్క న్యూ రేంజర్ సిరీస్ టైర్లు నడుపబడ్డాయి

ఆగష్టు 01, 2015 01:36 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ జెకె టైర్స్ యొక్క న్యూ రేంజర్ సిరీస్ టైర్లు, ఆఫ్ రోడ్ల పైన మరియు తారు రోడ్డు మీద రెండిటి మీదా ఎస్యువి లతో గోవా సమీపంలో, పనాజీ వద్ద నడుపబడ్డాయి 

జైపూర్: జెకె టైర్స్, గోవా సమీపంలో పనాజీ వద్ద కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు కార్యక్రమం లో ఈ ఎస్యువి టైర్లు అయిన న్యూ రేంజర్ సిరీస్ ను ప్రారంభించింది. ఈ న్యూ రేంజర్ సిరీస్, రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉన్నాయి. అవి వరుసగా, ఏ / టి ఆల్-టెర్రైన్ మరియు హెచ్ / టి హైవే టెర్రైన్. ఈ సిరీస్ పది రకాల పరిమాణాలలో ఈ క్రింది ఎస్యివి ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఆ ఎస్యువి పేర్లు వరుసగా, ఆడి క్యూ3 / క్యూ5, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ తో పాటు ప్రీమియం మరియు కాంపాక్ట్ ఎస్యువి లు అయిన ఫార్చ్యూనర్, ఎక్స్-ట్రైల్, టెర్రినో, డస్టర్ పజెరో, ఈకోస్పోర్ట్ వంటి వాహనాల కోసం ఆ పరిమాణాలు కలిగిన టైర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, జెకె టైర్స్ నుండి విడుదల అయిన న్యూ రేంజర్ సిరీస్ యొక్క ఏ / టి మరియు హెచ్ / టి వేరియంట్లు ఆఫ్ రోడ్లపై విజయాన్ని సాధించాయి. అంతేకాకుండా, మిస్టర్ హరి సింగ్ ర్యాలీలో విజేతగా నిలవడమే కాకుండా మార్గనిర్దేశం గా నిలిచాడు.

ఈ ఆఫ్ రోడ్ అనుభవం వర్షం లో గోవా వద్ద ఉన్న పనాజి సమీపంలో డొనా పౌలా చుట్టు ప్రక్కల జరిగింది. జెకె టైర్స్, రేంజర్ ఏ/ టి టైర్ల కొరకు స్లాలొమ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేసుకుంది. అయితే మరోవైపు, తారు రోడ్డు పరీక్ష కోసం, గోవా వద్ద ఉన్న వెర్నా లో జిగ్-జిగ్ ట్రాక్ ను ఎంచుకోవడం జరిగింది.

ఆఫ్-రోడింగ్ అనుభవం కోసం జెకె టైర్ ఆఫ్-రోడ్ ఎక్స్పో పక్కన ఏర్పాటు చేశారు. ఆఫ్ రోడ్ వాహనాలు అయిన టాటా సఫారి, మహీంద్రా స్కార్పియో మరియు మహీంద్రా థార్ వంటి వాహనాలు ఎన్నుకోబడ్డాయి. ఇది ఇలా ఉండగా, తారు రోడ్డు అనుభవం కోసం టయోటా ఫార్చ్యూనర్ అండ్ మహీంద్రా ఎక్స్యువి5ఓఓ వాహనాలు ఉన్నాయి.

రేంజర్ 235/70 R16 ఏ / టి టైర్ తో ఆఫ్ రోడ్ల పై మహింద్రా థార్ తో ప్రారంబించింది. అంతేకాకుండా మరోవైపు సఫారీ మరియు స్కార్పియో కోసం, పెద్ద మొత్తంలో స్లాలొమ్ మార్గం ఎన్నుకోబడింది. దీనితో పోలిస్తే, థార్ కోసం ఎన్నుకోబడిన మార్గం చాలా కఠినమైన మరియు తీవ్రమైన ట్రాక్ అని చెప్పవచ్చు.

థార్ కోసం సృష్టించబడిన ఈ చిన్న రోడ్డు ట్రాక్ చాలా ఎసెండింగ్ మరియు డిసెండింగ్ పల్లాల తో పాటు తీవ్రమైన అర్టికులేషన్ గుంటలు మరియు రాయి మరియు కంకర తో ఉన్నాయి. 

జెకె టైర్స్, సఫారీ మరియు స్కార్పియో కోసం ఎన్నుకోబడిన మార్గం గోవా లో వర్షం కారణంగా చాలా పెద్ద మొత్తంలో మరియు బురదతో ఉంది .

కంపెనీ, పట్టు మరియు కంట్రోల్ తో పాటు ఒక మంచి డ్యూయల్ ట్రేడ్ కాంపౌండ్ పై ప్రధానంగా దృష్ట్టి కేంద్రీకరిస్తుంది. (డిటిసి- టెక్ టైర్స్ వివిధ రబ్బరు సమ్మేళనం తో ఉంది మరియు ఇది స్థిరత్వాన్ని, నిరోధకత ట్రాక్షన్ మరియు మూలల పట్టును కలిగి ఉంటుంది).

రేంజర్ ఏ/టి వేరియంట్లో టైర్లు ఉన్నతమైన పట్టుని అందించడం మేము కనిపెట్టాము. ఇవి ఎక్కువుగా ఆఫ్ రోడింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.   

తారు రోడ్డు అనుభవం మాట్లాడుతూ, ఈ రోడ్ పై ఎక్స్యువి500 వాహనాన్ని 235/65 R17 పరిమాణాన్ని కలిగిన రేంజర్ హెచ్ / టి టైర్ తో నడిపారు. పైన చెప్పినట్లుగా, జెకె టైర్లు ఎస్యువి ల కొరకు మంచి గరిష్ట పట్టు & నియంత్రణ' ను కలిగి ఉండేలా తయారు చేశారు. రహదారులపై జిగ్ జగ్ టేఅక్ ను ఎన్నుకోవడం జరిగింది. దీన్ని పై రేంజర్ హెచ్ / టి టైర్ ను ఉపయోగించారు. ఈ మోనోకోక్యూ వేదిక, ఆధారిత ఎక్స్యువి500,  రేంజర్ హెచ్ / టి టైర్ తో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ  ఎక్స్యువి500 లో ఉండే టైర్లు మంచి గ్రిప్ ని అందిస్తాయి మరియు వాహననికి మంచి పట్టు ని అందిస్తాయి.

రోడ్ శబ్దం స్థాయిలను నియంత్రణలో ఉంచేవారు మరియు విభాగంలో ఉత్తమ స్థానాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాక, పట్టు ను మరియు స్టఫ్ఫ్ తో కూడిన దృడత్వాన్ని కలిగి ఉండతమేకాకుండా, బ్రేకింగ్ విషయం లో కూడా ఈ సిరీస్ మంచి పటుత్వాన్ని కలిగి ఉంటాయి. ఎక్స్యువి500 ను పరీక్ష చేసినప్పుడు గమనించినట్లైతే బ్రేకింగ్ విషయం లో మంచి పటుత్వాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మంచి నియత్రణను కూడా అందించడం జరిగింది. రేంజర్ ఏ / టి టైర్, పొడి రహదారుల పై 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 4 సెకన్ల సమయం పడుతుంది అని మరియు అదే విధంగా తడి రహదారుల పై 0 kmph నుండి 80 kmph వేగాన్ని చేరడానికి కూడా 4 సెకన్ల సమయం పడుతుందని సంస్థ వారు దృడ నిశ్చయంతో తెలిపారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience