• English
    • Login / Register

    హ్యుందాయ్ క్రిటా నుండి ఆశించే అంశాలు

    జూన్ 15, 2015 10:31 am sourabh ద్వారా ప్రచురించబడింది

    • 13 Views
    • 19 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    హ్యుందాయ్ ఐ20 డ్యుయోస్(ఎలైట్ ఐ 20 మరియు ఐ 20 యాక్టివ్) విజయాన్ని రుచి చూసిన తర్వాత ఇది కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో దాని పేరును నిలుపుకునేందుకు ఎదురు చూస్తూ, క్రిటా అనే ఒక క్రొత్త పేరుతో అడుగుపెట్టబోతుంది, దీనిని ముందుగా చైనా లో ఐఎక్స్25 గా వెల్లడించారు. కొరియన్ తయారీ సంస్థ ప్రకారం, క్రిటా యొక్క ఉచ్చారణ 'క్రియేటివ్' అనే పదంతో పోలి ఉంది. కంపెనీ క్రిటా కారును 21 జూలై న ప్రారంభించనున్నారు. ఇది రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రనో, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టోర్మ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రాబోయే మారుతి సుజుకి ఎస్- క్రాస్ లతో పోటీ పడనుంది. మనం ఇవన్నింటిని పరిగణలోకి తీసుకుని రాబోయే క్రిటా లో భాగస్వాములం అవుదాం.

    బాహ్యభాగాలు

    • హ్యందాయ్ క్రిటా యొక్క ఆకృతి, సాంట-ఫీ ను పోలి ఉంటుంది.
    • కొలతలు పరంగా, క్రిటా 4270 మిల్లీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది (దాదాపు 4.2 మీటర్లు), ఈకోస్పోర్ట్ 3999 మిల్లీమీటర్లు, డస్టర్ 4315 మిల్లీమీటర్లు (4.3 మీటర్లు). ఈ క్రిటా యొక్క వీల్బేస్ 2520 మిల్లీమీటర్లు మరియు ఈ వాహనం యొక్క బూట్ వైశాల్యం 400 లీటర్లు. 
    • ఈ క్రిటా యొక్క డిజైన్, కాంపాక్ట్ ఎస్యువి అయిన హ్యుందాయ్ ఫ్యుడిక్ వెర్నా లో ఉన్న స్కల్ప్చర్ 2.0 డిజైన్ వేదాంతం అనుసరించి ఇది తయారుచేయబడింది మరియు చూడటానికి కూడా ఒకేలా ఉంటుంది.
    • ఈ క్రాస్ఓవర్ అయిన  క్రిటా లో డేటైమ్ రన్నింగ్ ఎల్ ఈ డి లతో పాటు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ను అందిస్తుంది మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ను కూడా కలిగి ఉంటుంది. 
    • భాహ్య భాగాలను చూసినట్లైతే, ఆల్రౌండ్ బాడీ క్లాడింగ్, బ్లాక్డ్ ఔట్ పిల్లర్ మరియు ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్స్ లను గమనించవచ్చు.  

    ఇంజిన్

    • బేబి సాంట-ఫీ లా కనిపించే ఈ క్రిటా లో వెర్నా లో ఉండే ఇంజెన్  
    • ఈ క్రాసోవర్, వెర్నా లో ఉండే 1.6 లీటర్ లేదా 1.4 లీటర్ సీఅర్ డి ఐ ఇంజెన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.  
    • పెట్రోల్ ఇంజెన్ అయితే, వెర్నా లో ఉండే 1.6 లీటర్ విటివిటి ఇంజెన్ తో రాబోతుంది.  
    • ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ వాహనం చైనా లో డీజిల్ వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో అందుబాటులో ఉంది  
    • పెట్రోల్ వేరియంట్లలో అయితే, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో రాబోతున్నాయి.    
    • అంతేకాకుండా అన్ని వేరియంట్లు ఏడబ్ల్యూడి లేదా 4డబ్ల్యూడి తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.    

    అంతర్గతభాగాలు

    • వెర్నా & ఎలైట్ ఐ20 లలో ఉండే డ్యూయల్ టోన్ లోపలిలక్షణాలు ఇప్పుడు క్రిటా లో కూడా ఉండబోతుంది.
    • చైనీస్ వేరియంట్లో ఉండే  పెద్ద టచ్ స్క్రీన్ యూనిట్, ఇప్పుడు భారదేశంలో రాబోయే క్రిటా లో రాబోతుంది.
    • మొబైల్ అప్లికేషన్ ద్వారా నావిగేషన్ తో పాటు స్మార్ట్ఫోన్ ఏకీకరణ
    • వెనుక ఎసి వెంట్ లు
    • వెర్నా లో ఉండే స్టీరింగ్ వీల్
    • హ్యాండ్బ్రేక్ లివర్ చుట్టూ రెండు కప్ హోల్డర్స్ తో పాటు అనేక నిల్వలు  

    ధర పరిధి

    క్రిటా యొక్క ధరలు, రెనాల్ట్ డస్టర్ పరిధిలో ఉండే అవకాశం, అంటే 8 నుండి 13 లక్షల మధ్యలో 

    was this article helpful ?

    Write your Comment on Hyundai క్రెటా 2015-2020

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience