వారాంతపు విశేషాలు: టాటా జైకా మరియు వోల్వో S90 బహిర్గతం, ఆటోమొబైల్ ఉత్పత్తి చెన్నై లో ఆగిపోయింది మరియు సెలెరియో అన్ని వేరియంట్లలో ABS మరియు ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉంది

డిసెంబర్ 09, 2015 11:01 am nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఈ వారం  హెచ్చు తగ్గులను చాలా చూసింది. హోండా బ్రియో అత్యధిక అమ్మకాలలో అగ్రస్థానంలో నిలువగా, హ్యుందాయ్, ఫోర్డ్, రెనాల్ట్-నిస్సాన్ మరియు ఇతర వాహన తయారీదారులు ఇటీవల వరదల కారణంగా చెన్నై లో కార్యకలాపాలు ఆపవలసి వచ్చింది. BMW తరువాత, మెర్సిడెస్ బెంజ్ కూడా జనవరి నుండి  2% ధరల పెంపు ప్రకటిస్తానని తెలిపింది.  టాటా జైకా హాచ్బాక్ చిత్రాలు మరియు వివరాలు విడుదల చేయగా, ఫియట్ కూడా లీనియా కి భర్తీ గా టిపో వాహనం వస్తున్నట్లు వివరించింది. మరోవైపు మారుతి సెలేరియో అన్ని వేరియంట్లలో ABS మరియు ఎయిర్ బాగ్స్ యొక్క ఎంపికను కలిగి ఉంది. అయితే, వోల్వో దాని రాబోయే S90 సెడాన్ యొక్క అధికారిక చిత్రాలను విడుదల చేసింది. కాబట్టి, ఈ వారం జరిగిన విశేషాల గురించి గురించి తెలుసుకుందాం పదండి !      

చెన్నై వర్షాల కారణంగా, హ్యుందాయ్, ఫోర్డ్, రెనాల్ట్- నిస్సాన్ మరియు ఇతర వాహన తయారీదారుల కార్యకలాపాలు నిలుచుట

తమిళనాడు రాజధాని లో ప్రజలు భారీ వర్షాలు కారణంగా నిరాశతో నగరం విడిచి వెళ్లారు మరియు దాని పౌరులు ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఒంటరిగా ఉన్నారు. వరదలు కారణంగా వాహనాలు ఒకే మార్గం ద్వారా వెళుతున్నాయి మరియు ఇప్పుడు ఈ అలల ప్రభావ పరిస్థితులలో ఆటోమోటివ్ పరిశ్రమ ప్రభావితం అయ్యింది. హ్యుందాయ్ (భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాహన తయారీదారుడు), రెనాల్ట్- నిస్సాన్, ఫోర్డ్ మరియు ఇతర వాహన తయారీదారుల యొక్క చెన్నై ఆధారిత తయారీ ప్లాంట్లు మరియు వారి సౌకర్యాలు వద్ద కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేయవలసి వచ్చింది. ఈ గోలియత్ వాహన తయారీదారులు, గత రెండు వారాల వ్యవధిలో రెండవ సారి ఈ చర్యలను తీసుకుంది. ఇంకా చదవండి

మహీంద్రా, హ్యుందాయ్, మారుతి మరియు టొయోటా సేల్స్ పెరుగుదల; హోండా సంస్థ నవంబర్ అమ్మకాలలో తగ్గుదలను చూసింది

భారతదేశం లో ఆటోమొబైల్ రంగంలో పోటీ ఇప్పుడు గతంలో కంటే మరింత తీవ్రంగా ఉంది. ఈ సంవత్సరం కొత్త ప్రారంభాలు మరియు కాంపాక్ట్ SUV మరియు మినీ SUV ల ఆవిర్భావం పెరుగుతున్న రద్దీకి కారణాలు. పోటీతత్వపు ఖరీదు వలన మరియు చెరిగిపోతున్న వాహన విభాగాల తీరుతెన్నులు మరియు నవీకరణలు వలన ఈ సమాకలిన మార్కెట్ ను అందిపుచ్చుకోవడానికి వాహన తయారీదారులు విభిన్న వ్యూహాలతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా చదవండి

ముంబై లో రహస్యంగా పట్టుబడిన మహీంద్రా S101

మహీంద్రా S101(కోడ్ నేం) ప్రోటోటైప్ ఒక వాణిజ్య చిత్రీకరణ సమయంలో రహస్యంగా కనిపించింది. కారు అనుబందిత చిత్రీకరణ పరికరాలతో ముంబై లో రౌండ్స్ తిరుగుతూ దర్శనమిచ్చింది. ఈ చిత్రాలు ఒక భారతీయ ఆటో బ్లాగ్ రీడర్ అయిన 'రిజ్రోహ్రా' చే నిర్భందించబడినవి. ఊహాగానాల ప్రకారం కారు వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో ప్రారంభించబడుతుంది మరియు 'మహీంద్రా XUV100' గా చెప్పబడుతుంది. మహీంద్రా S101 ఒక క్రాస్ఓవర్ స్టైలింగ్ ని కలిగి ఉంటుంది మరియు మారుతి వ్యాగన్ఆర్, టాటా జికా మరియు చెవీ బీట్ వంటి వాటితో పోటీ పడవచ్చు. స్టైలింగ్ మరియు చేవ్రొలెట్ బీట్ గురించి మాట్లాడితే, అమెరికన్ హాచ్బాక్ లా వెనుక డోర్ హ్యాండిల్స్ కారు యొక్క సి-పిల్లర్స్ పైన అమర్చబడి ఉంటాయి. ఇంకా చదవండి

క్రెటా కొనుగోలు సమయంలో, ఒక వేరియంట్ ఆధారంగా నిర్ణయించలేము? ఈ విధంగా ప్రయత్నించండి!

హ్యుందాయ్ క్రెటా, ఇప్పటివరకు ఒక గొప్ప విజయాన్ని సాధించింది. యుటిలిటీ వాహనాల చార్ట్ లో అగ్ర శ్రేణి అమ్మకాలలో ఉండే బొలెరో వాహనం నుండి ఈ క్రెటా, ప్రదమ స్థానాన్ని సంపాదించింది. కానీ, ఈ స్థానాన్ని మూడు నెలల కాలం పాటు కాపాడుకుంది. ప్రస్తుతం ఈ వాహనం, ఈ విభాగంలో ఉండే ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనాల్ట్ డస్టర్, మారుతీ ఎస్ క్రాస్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. హ్యుందాయ్ క్రెటా యొక్క స్పష్టమైన వివరణాత్మక పోలిక చదవండి. ఈ కారు కొనుగోలు ప్రణాళికా వారికి, సంస్థ వారు ఒక సమగ్ర చిత్రాల రూపంలో అనేక రకాల వేరియంట్ల ఒక సంక్షిప్త విశ్లేషణ ఈ క్రింద ఇచ్చారు. ఇంకా చదవండి

హోండా బ్రియో 2015 భారతదేశం యొక్క ఉత్తమ నిర్మిత కారుగా వెలువడింది

వారి తాజా అధ్యయనంలో, J.D. పవర్  భారతదేశంలో  గత 5 సంవత్సరాలలో కార్ల తయారీ నాణ్యత ఎలా గణనీయంగా మెరుగైనది అని చూపిస్తుంది.  ఈ అధ్యయనం ఎనిమిది వాహన విభాగాలలో లోపాలు 200 పైగా సమస్య లక్షణాలు  వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఈ అధ్యయనం ఇప్పుడు 19వ సంవత్సరంలో ఉంది మరియు  J.D.పవర్ 2015 భారతదేశం ప్రారంభ నాణ్యత  స్టడీ SM (IQS) అని పిలవబడుతుంది. ఇది నవంబర్ 2014 మరియు జూలై 2015 మధ్య ఒక కొత్త వాహనం కొనుగోలు చేసిన 8,438 వాహన యజమానులు నుండి అంచనాల ఆధారంగా రూపొందించబడింది. ఈ అధ్యయనం  17 తయారీల నుండి 69 వాహనం నమూనాలను కలిగి ఉంది. ఈ అధ్యయనం భారతదేశం అంతటా 30 నగరాల్లో మే 2015 నుండి సెప్టెంబర్ 2015 వరకు జరిగినది. ఇది యాజమాన్య మొదటి రెండు నుండి ఆరు నెలల్లో వారి కొత్త వాహనం సమస్యలు వలన యజమానులు ఎదుర్కొన్న సమస్యలను కొలుస్తుంది మరియు ఎనిమిది వాహనం కెటగిరీలు కవర్ చేసి  200 లకు పైగా సమస్య లక్షణాలను పరిశీలిస్తుంది. ఇంకా చదవండి

ఫియట్ అందించిన వివరాల ప్రకారం లీనియా ప్రత్యామ్నాయం - టిపో

ఈ వాహనం ఈ సంవత్సరం ప్రారంభంలో మే లో టర్కీ లో బహిర్గతమైనది మరియు ఏజియా అని పిలబడుతుంది. ఫియాట్ దీనిని టిపో గా పేరు మార్చి మిగిలిన ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ పేరు గతం నుండి పునరుత్థానం చేయబడింది,  ఎందుకంటే ఆ వాహనం 1988 నుండి 1995 వరకూ వచ్చిన మోడల్స్ లో బాగా ప్రఖ్యాతి చెందిన మోడల్ మరియు దాదాపు 2 మిలియన్ మోడల్స్ ని తయారు చేశారు. ఇంకా ఇది భారత మార్కెట్ లోనికి ఎప్పుడు వస్తుందో ఇంకా ప్రకటించలేదు. కానీ, ఫియట్ ఇండియా తదుపరి ఒకటి లేదా రెండు సంవత్సరాలలో ఏజింగ్ లీనియా ని దీనితో భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. భారతదేశంలో ఈ వాహనం మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ఇతర వాహనాలతో పాటూ హోండా సిటీ మరియు మారుతి సుజికి సియాజ్ వంటి వాటితో పోటీ పడవచ్చు. ఇంకా చదవండి

విడుదలైన టాటా జికా యొక్క అధికారిక చిత్రాలు

టాటా రాబోయే జికా హాచ్బాక్ యొక్క అధికారిక చిత్రాలను విడుదల చేసింది. ఈ వాహనం నానో మరియు బోల్ట్ మధ్య లో ఉంచబడుతుంది. డిజైన్ వలే, టాటా  వారి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఏస్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ ని నియమించి మార్కెటింగ్ వ్యూహాన్ని పునరుద్ధరించింది. జికా జనవరి 2016 లో విడుదల కానుంది మరియు ఇతర వాహనాలతో పాటూ మారుతి సుజుకి సెలెరియో, హ్యుందాయ్ ఐ 10, చేవ్రొలెట్ బీట్ వంటి వాటితో పోటీ పడనున్నది. ఇంకా చదవండి

స్విఫ్ట్ మరియు S-క్రాస్ కి AMT వెర్షన్ ని పెట్టాలని యోచిస్తున్న మారుతి సుజికి

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పై భారత వినియోగదారులు బాగా ఆశక్తి చూపిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వెళితే, దేశం యొక్క అత్యంత ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుతం నిర్వహించే ప్రతి విభాగంలోనూ ఈ సాంకేతికత తీసుకుని రావాలనే  వారి కోరికను వ్యక్తం చేసింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఇంజనీరింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఛ్.వ్ రామన్ మాట్లాడుతూ, సంస్థ ప్రస్తుతం నిర్వహించే ప్రతి విభాగంలోనూ 'టు పెడల్'టెక్నాలజీ తీసుకు వచ్చేందుకు పని జరుగోతుంది. తద్వారా వినియోగదారులకు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. సంస్థ ఈ టెక్నాలజీ ని అందుబాటు ధరల లోనికి తీసుకు వచ్చేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం, ఏ ఎంటి వెర్షన్ కార్లు సాధారణ మాన్యువల్ వెర్షన్ కంటే ఎక్కువ ఖరీదు గా ఉన్నాయి. ఇంకా చదవండి

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గుదల

భారతదేశం లో ఇంధన ధరలు ఇటీవలి పెంపు తర్వాత తగ్గాయి. ఈ  పెట్రోల్ మరియు డీజిల్ యొక్క ధరల కోతలు డిసెంబర్ 1, 2015 నుంచి అమలు చేశారు. డీజిల్ ధరలు లీటర్ కి  25 పైసలు తగ్గగా, పెట్రోల్ ధరలు లీటర్ కి 58 పైసలు తగ్గించబడినది. న్యూఢిల్లీలో, డీజిల్ లీటర్ కి రూ. 46.55 ధరను కలిగియుండగా, పెట్రోల్ రూ. 60,48 ధరను కలిగి ఉంది. ఇటీవలి ధర హెచ్చుతగ్గులతో, ఇంధన ధరలు వినియోగదారులకు అనుకూలంగా కొనసాగుతున్నాయి. భారతదేశం లో, ఇంధన ధరలు ప్రతి 15 రోజులకు మారుతూ ఉంటాయి. ఈ ద్రవ్య హెచ్చుతగ్గులకు అత్యంత కారణం అమెరికన్ డాలర్- భారత రూపాయి మారక రేటు.  ఇంకా చదవండి 

మారుతి సుజుకి సెలెరియో ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ని కలిగి ఉంది

మారుతి సుజుకి సెలెరియో అన్ని వేరియంట్లలో డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ని కలిగి ఉంటుందని ప్రకటించింది. సెలేరియో 2014 లో ప్రారంభించబడినది మరియు AMT టెక్నాలజీ తో ప్రజాదరణ పొంది ప్రారంభించబడిన దగ్గర నుండి రూ. 1.3 లక్షల యూనిట్లకు పైగా విక్రయించబడినది. మారుతి సుజుకి సెలేరియో ని ఎయిర్బ్యాగ్స్ మరియు ABS తో రూ. 4.16 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరతో అందిస్తుంది. ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience