కొత్త కాంతులతో రాబోవుచున్న టాటా కార్లు
జూన్ 12, 2015 12:48 pm raunak ద్వారా సవరించబడింది
- 13 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా ఇండికా మరియు ఇండిగో ఈసిఎస్ తో పాటు 'కైట్' హ్యాచ్బ్యాక్ మరియు కాంపాక్ట్ సెడాన్ ల విజయం పునరావృతం చేయాలనుకుంటున్నారు, అంతేకాకుండా అరియా ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను మరియు నెక్సాన్ ను కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో తీసుకోవాలని అనుకుంటున్నారు.
జైపూర్: టాటా చాలా సంవత్సరాల నుండి కొత్త కార్లను ప్రవేశపెట్టే మార్గంలో ఉంది. 2014 ఆటో ఎక్స్పో తర్వాత, ఈ స్వదేశీ బ్రాండ్ అయిన టాటా ముందు ఎన్నడూ చూడనటువంటి విధంగా తన యొక్క ఉత్పత్తులను ప్రారంభించింది. జెస్ట్ ను మరియు బోల్ట్ వాహనాలను చూసినట్లైతే, ఈ విభాగంలో రెండు వాహనాలు కూడా అత్యుత్తమ లక్షణాలను అందించేవే, నాణ్యత విషయంలో బోల్ట్ ను ప్రక్కన పెడితే, ఈ విభాగంలో జెస్ట్ చాలా ఉత్తమమైనది. అంతేకాక బోల్ట్ మరియు జెస్ట్ వాహనాల ప్రారంభం తరువాత హారిజోనెక్స్ట్, డిజైనెక్స్ట్, కనెక్ట్నెక్స్ట్, డ్రైవ్నెక్స్ట్ ల ఆధారంగా టాటా అనేక మోడల్స్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆధారాలతో రాబోయే కార్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టబడిన టాటా సఫారీ స్టోర్మ్ 2015 వాహనాన్ని ఈ ఆధారంగా చేసుకొని ప్రవేశపెట్టడం జరిగింది. మనకు టాటా సమీప స్టోర్లలో ఏమి ఉందో చూద్దాం.
టాటా కైట్ హాచ్బాక్ మరియు కాంపాక్ట్ సెడాన్
టాటా కైట్ హాచ్బాక్ మరియు కాంపాక్ట్ సెడాన్ లు రెండూ కూడా, పాత కార్లు అయినటువంటి మరియు ఇండిగో ఈసిఎస్ స్థానంలో ఉండబోతున్నాయి. అయితే, టాటా యొక్క ఫోర్ట్ఫోలియో ను కొనసాగించటానికి వాటిని అలాగే ఉంచి ఉండవచ్చు. కానీ కొత్త కార్లు వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రవేశపెట్టబోతుంది. వీటి యొక్క డిజైన్ల గురించి మాట్లాడటానికి వస్తే, రెండు కార్లు పరీక్ష కింద ఉండగా ప్రస్తుతం బహిర్గతం అయ్యాయి. ఒక్కసారి బయటకు వస్తే, ఈ జెస్ట్ మరియు బోల్ట్ లు డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫిలాసఫీ ను చూసినట్లైతే టాటా సంస్థ లో ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువటి డిజైన్ తో వచ్చాయి. రాబోయే వాహనాల యొక్క అంతర్భాగాలలో బ్లూటూత్ తో పాటు హార్మోన్ ఆధారిత కనెక్ట్ నెక్స్ట్ ఆడియో సిస్టం తో రాబోతున్నాయి.
ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, కైట్ డియోస్ యొక్క ఇంజెన్ 3-సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటుంది. దీని యొక్క పెట్రోల్ ఇంజెన్ 1.2 లీటర్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటుంది. మరియు ఈ ఇంజెన్ 75bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, డీజిల్ ఇంజెన్ ల విషయానికి వస్తే, 1.05 లీటర్ టర్బోచార్గెడ్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఈ డీజిల్ ఇంజెన్ అత్యధికంగా 70bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. హాచ్బాక్ ను మొదట ప్రవేశపెట్టడానికి చూస్తున్నారు, దీని తరువాత కాంపాక్ట్ సెడాన్ అయిన టాటా హెగ్జా ను ఈ సంవత్సరం తర్వాత ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు టాటా హెక్సా, టాటా ఆరియా స్థానం లో రాబోతుంది. ఈ విభాగంలోనికి రావడానికి టాటా చివరి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రాబోయే టాటా హెక్సా, అవుట్గోయింగ్ అవ్వబోతున్న ఆరియా తో పోలిస్తే, చాలా బిన్నంగా ఉండబోతుంది. టాటా ఈ ఏడాది జెనీవా మోటార్ షోలో హెక్సా కాన్సెప్ట్ మోడల్ ను ప్రదర్శించడం మరియు శైలీకృత మరియు ప్రధాన మెకానికల్ నవీకరణలతో రాబోతుంది. రాబోయే హెక్సా మోడల్ యొక్క ధర, ప్రస్తుత ఆరియా ధరను కొంతవరకు పోలి ఉంటుంది.
యాంత్రికంగా చెప్పాలంటే, రాబోయే హెక్సా వాహనం యొక్క ఇంజెన్ 2.2 లీటర్ తో పాటు నవీకరించబడిన వరికార్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజెన్ అత్యధికంగా 155PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, మరియు అత్యధికంగా 400Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. (ఈ విభాగంలో ఇది అత్యధిక టార్క్ ను ఉత్పత్తి చేసే వాహనం). కాకుండా మాన్యువల్, జనరల్ మోటార్స్ కార్పోరేషన్ యొక్క విభాగమైన జనరల్ మోటార్స్ పవర్ట్రెయిన్ నుండి టాటా వాహనాలు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాక, ఇది ఫీచర్ లోడ్ పరంగా టాటా ఆరియా కంటే నాణ్యతను ఇస్తుంది. ఉత్పత్తి అయ్యే వాహనాల యొక్క నిర్దేశాలను, 2016 ఫిబ్రవరి లో భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించే అంచనాలు ఉన్నాయి.
టాటా నెక్సాన్
ఇప్పుడు టాటా సబ్ 4మీటర్స్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలోనికి నెక్సాన్ రూపంలో అడుగు పెట్టబోతున్నారు. దీని యొక్క కాన్సెప్ట్ వెర్షన్ ను గత ఏడాది ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. టాటా హెక్సా లాగానే ఈ నెక్సాన్ యొక్క నిర్దేశాలు కూడా 2016 ఫిబ్రవరి లో ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించవచ్చు. ఈ సబ్ 4 మీటర్స్ వాహనం అయిన నెక్సాన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కు పోటీగా రానుంది. ఇంజెన్ పరంగా చెప్పాలంటే, రెవోట్రాన్ ఆధారిత మరియు ఫియట్ మల్టిజెట్ డీజిల్ ఇంజిన్ల తో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని భావిస్తున్నారు.