'సెట్కో' ఆటోమోటివ్ కొత్త జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉదిత్ షేథ్
జూలై 22, 2015 10:01 am konark ద్వారా సవరించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: మిస్టర్ ఉదిత్ షేథ్ 'సెట్కో' ఆటోమోటివ్ యొక్క కొత్త జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. అతను జూలై 15, 2015 న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుండి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పదోన్నతి చేపట్టారు.
ఉదిత్ షేథ్ 2002 నుంచి సెట్కో ఆటోమోటివ్ సంస్థలో ఒక భాగంగా ఉన్నారు మరియు అతని వ్యూహాత్మక కార్యక్రమాలు ఆ సంస్థకి ఒక కీలక భాగంగా పనిచేశాయి. అతని వ్యూహాలు కంపెనీ టర్నోవర్ రూ. 10 కోట్ల నుండి ప్రస్తుతం రూ. 500 కోట్ల వరకు పెరగడంలో సహాయపడినవి.
ఈ సందర్భంగా ఉదిత్ షేథ్ మాట్లాడుతూ "నేను సెట్కో ఆటోమోటివ్ లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించబడినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా పట్ల వారికి ఉన్న విశ్వాసానికి మరియు నమ్మకానికి డైరెక్టర్ల మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కొత్త పాత్రలో, మా సిఎండి మిస్టర్ హరీష్ షేథ్ మరియు బోర్డ్ డైరెక్టర్ల అందరి మార్గదర్శకత్వంలో నేను నా కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి కంపెనీని ముందుకు నడిపించే క్రమంలో నా నిరంతర ప్రయత్నం ఉంటుంది మరియు సంస్థ యొక్క అన్ని ప్రక్రియలను మేము నేటి అభివృద్ధి పథంలో కొనసాగించడానికి కృషి చేస్తాము " అని ఆయన వాఖ్యానించారు.
సెట్కో, మీడియం & హెవీ కమర్షియల్ వాహనాలను(ఎం హెచ్ సివి) దాదాపు 85% వరకు భారతదేశంలో ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా వాల్యూమ్ పరంగా టాప్ 3 తయారీదారులుగా నిలుస్తుంది.