2015 ఆన్లైన్ లో ఎక్కువగా వెతకబడిన కార్ల యొక్క టాప్ 10 జాబితా: వాటిలో ప్రత్యేకతలు

డిసెంబర్ 28, 2015 02:30 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం దగ్గరగా వస్తోంది. సాధారణ ప్రజల కోసం, 2015 వ సంవత్సరం పోటీతత్వ భారతీయ ఆటోమోటివ్ స్పేస్ లో కొత్త కార్లు మరియు ఫేస్‌లిఫ్ట్ ల తో అనేక ప్రారంభాలను తీసుకొచ్చింది. ఈ సంవత్సరం కొన్ని అద్భుతమైన కార్లు, కొన్ని అంతగా పాపులర్ కాని కార్లు చాలానే విడుదల చేయబడ్డాయి. ఏదేమైనప్పటికీ ఈ యేడాది అంతగా అభివృద్ధి కి నోచుకొని భారతీయ ఆటోమోటివ్ రంగంలో ఇది ఒక మెరుగైన సంవత్సరం అని చెప్పవచ్చు. క్రెటా, బాలెనో మరియు క్విడ్ ఇదంతా కూడా 2015 విజయాలకి ఉదాహరణగా చెప్పవచ్చు.

10. హోండా సిటీ:

అద్భుతమైన రైడ్ నాణ్యత కారణంగా ఈ సిటీ కారు 2015 లో అత్యంత ప్రముఖ జాబితాలో టాప్ 10 లో నిలిచింది. మారుతి సియాజ్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ వెంటో తో హోండా సిటీ ఈ సంవత్సరం పునఃరుద్ధరించిన పోటీని ఎదుర్కుంది. కానీ దాని అపారమైన ప్రజాదరణతో రాబోయే సంవత్సరం లో ఇంకా మంచి స్థానంలో ఉండవచ్చని భావిస్తున్నారు.

9. మారుతి ఆల్టో కె 10:

ఈ కారులో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కొనుగోలుదారుల ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది మరియు వారు ఎక్కువగా ఈ కారుని శోధించేలా చేసింది.

8. మారుతి సెలెరియో:

ఇండో-జపనీస్ కార్ల తయారీదారులు 2015 భారతదేశంలో అత్యంత శోధించిన కార్ల ర్యాంకులో ఇది మరొక వాహనం. హ్యుందాయ్ ఐ 10 తో పోటీ ఉన్నప్పటికీ దీని ఆటోమేటిక్ వేరియంట్ వలన విజయం సాధించగలిగింది. ప్రజలు ఎక్కువగా మారుతి సుజికి ని నమ్ముతారు, సెలేరియో దీని పూర్తి ప్రయోజనంగా మార్చుకుంది.

7. హ్యుందాయ్ క్రెటా:

సౌత్ కొరియన్ ఆటోమేకర్ సంస్థ యొక్క క్రెటా 7 వ స్థానంలో నిలిచింది. మహింద్రా బొలేరో అత్యధికంగా అమ్ముడైన యుటిలిటీ వెహికల్ స్థానం నుండి తప్పుకుంది మరియు 2 నెలలు అదే స్థానంలో ఉంది.

6. డాట్సన్ గో ప్లస్:

డాట్సన్ సంస్థ నుండి వచ్చిన ఒకెఒక్క వాహనం డాట్సన్ గో ప్లస్ MPV. ఇది అత్యంత ఎకనమికల్ కారు మరియు ఇంటర్నెట్ లో వినియోగదారులు ఎక్కువగా వెతుకున్న కారు.

5. మారుతి స్విఫ్ట్ డిజైర్:

దాని విభాగంలో అత్యంత విజయవంతమైన వాహనంగా స్విఫ్ట్ డిజైర్ 5 వ స్థానంలో ప్రశాంతంగా ఉంది. హోండా అమేజ్ మరియు ఫిగో ఆస్పైర్ వంటి పోటీదారులతో పోటీ పడుతూ ఇటీవల వచ్చిన ఒక ఆటోమేటిక్ వెర్షన్ యొక్క స్పైడ్ న్యూస్ తో ఈ వాహనం యొక్క అసక్తి వినియోగదారులలో చాలా పెరిగి అమ్మకాల బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి.

4. హ్యుందాయ్ ఎలీట్ ఐ 20 :

కారు దాని విభాగంలో ఒక నాయకుడు. ఇది బాలెనో నుండి పునరుద్ధరించబడిన పోటీని ఎదుర్కుంటోంది, అయినప్పటికీ ఇది ఇంకా ప్రజాధారణ పొందుతూ 4 వ స్థానంలో ఉంది.

3. మారుతి స్విఫ్ట్:

ఈ వాహనం అమ్మకాలు బాలెనో యొక్క ప్రారంభంతో నవంబర్ నెలలో కొద్దిగా తగ్గుదల చూశాయి. మారుతి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో 17,000 యూనిట్లు కంటే ఎక్కువ అమ్మకాలు చూశాయి మరియు నవంబర్ లో 12,000 పడిపోయింది. ఈ కారు వినియోగదారులు ఎక్కువగా శోధించిన జాబితాలో 3వ స్థానంలో ఉంది.

2. మారుతి బాలెనో:

బహుశా ఈ ఏడాది అత్యంత విజయవంతమైన ప్రారంభాలలో ఈ వాహనం ఒకటి. బాలెనో యొక్క రాజశం ఉట్టిపడేటటువంటి లుక్స్, హైటెక్ టెక్నాలజీస్, ఆర్ధిక ధర ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు 27.4 kmpl మైలేజ్ ని అందిస్తుంది మరియు అత్యంత ఎకనమికల్ కారు.

1. రెనాల్ట్ క్విడ్:

2015 లో అత్యంత శోధించిన కారు రెనాల్ట్ క్విడ్. ఈ ఫ్రెంచ్ కారు అత్యంత విజయం సాధించడానికి కారణం దాని సెగ్మెంట్. దీని పోటీదారులకు పోటీ ని ఇస్తూ క్విడ్ ప్రారంభమైన రెండు వారాలలో అస్థిరమైన 25,000 బుకింగ్స్ నమోదు చేసుకుంది. దీనిలో మైక్రో SUV లుక్ తో క్విడ్ ఒక ఎకనమికల్ కారు.      

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience