• English
  • Login / Register

టెస్లా వారి ఇన్విటేషన్ ఓన్లీ మోడల్ ఎక్స్ యొక్క వివరాలు బహిర్గతం చేసారు : మీరు ఇవి పొందేందుకు అర్హులేనా?

సెప్టెంబర్ 03, 2015 02:25 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:టెస్లా వారి సిగ్నేచర్ సీరీస్ ఎడిషన్ యొక్క మోడల్ ఎక్స్ క్రాస్ ఓవర్ ని మొదటిగా బుక్ చేసుకోవడానికి టెస్లా మోటర్స్ వారిచే ఆహ్వానం పొందాలి. కేవలం ఈ కొద్ది మందికే అతి రహస్యమైన ఆ ప్రత్యేక లక్షణాలను బహిర్గతం చేయడం జరుగుతుంది. వీటిలో కొన్ని, 0 నుండి 60 కీ.మీ దూరాన్ని 3.8 సెకన్లలో చేరుకోవడం, డ్రైవింగ్ రేంజ్ 240 మైళ్ళు మరియూ ధర 100,000 వేల డార్లర్లకు పైగా.

ఈ వివరాలను కారుని చూడటానికి అవకాశం వచ్చిన ఒక టెస్లా కస్టమర్ బహిర్గతం చేసారు. కేవలం ఆహ్వానం మేరకే ఈ అవకాశం ఉంది మరియూ రెండు డ్రైవ్లైన్ ఎంపికలతో : ముందు వీల్స్ కి 259బీహెచ్పీ ని మరియూ వెనుక వీల్స్ కి 503బీహెచ్పీ ని అందించే ఒక ప్రాథమిక 90-Kwh సెటౌప్, మరియూ ఈపీఏ చే ధ్రువీకరించబడిన 240 మైళ్ళ రేంజ్. ఈ సెటప్ లో కారు 0 నుండి 100 కీ.మీ  కేవలం 3.8 సెకన్లలో చేరుకునే సామర్ధ్యం మరియూ గంటకు 155 మైళ్ళు వెళ్ళే యొక్క ఉన్నత వేగం కలిగి ఉంది. ఇందుకు గాను 10,000 డాలర్లు ఖర్చు అవుతుంది మరియూ ఈ ఎంపిక వలన కారు 0 నుండి 100 కీ.మీ 3.2 సెకన్ల లోపు గానే చేరుకోగలదు. ఇది సెవెన్-సీటర్ క్రాస్ ఓవర్ అనుకుంటే గనుక, ఇది ఎంతో ఆకర్షణీయం అనే చెప్పాలి.

ఇతర ఎంపికలలో భాగంగా - ఒక 750 డాలర్ల ప్యాకేజీ లో, టోవింగ్ మోడ్ టు మిటిగేట్ స్వే, 5000 పౌండ్లు లాగగలిగే సామర్ధ్యం మరియూ మోడల్ ఎక్స్ కి మించి ఒక రెండు-అంగుళాల హిచ్ రిసీవర్ అందుతాయి; 1000 డాల్స్ర్లకు ఒక సబ్-జీరో వెదర్ ఎంపిక, హీటెడ్ స్టీరింగ్ వీల్ మరియూ వాషర్ నాజిల్స్, ఒక వైపర్-బ్లేడ్ డీఫ్రాస్టర్ మరియూ హీటెడ్ సీటింగ్ రెండవ మరియూ మూడవ వరుసలకు కూడా అందించబడతాయి. 

ఈ లిమిటెడ్-ఎడిషన్ మోడల్ ఎక్స్ యొక్క ఇతర లక్షణాలు లో భాగంగా, అల్ట్రా హై ఫైడెలిటీ సౌండ్ సిస్టం, స్మార్ట్ ఎయిర్ సస్పెన్షన్ తో జీపీఎస్ మెమొరీ, ఒక ప్రీమియం అంతర్ఘత ప్యాకేజీ మరియూ ఆటోపైలట్ సెమీ-అటానమస్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ ని దాదాపుగా 132,000 డాలర్లకు టెస్లా వారు అందిస్తున్నారు. ఇది మార్కెట్ లోకి త్వరలో రాబోయే ప్రాథమిక వేరియంట్ కన్న 25,000 డాలర్లు ఎక్కువ. దీనిని సొంతం చేసుకోవాలంటే 40,000 డాలర్లు డిపాజిట్ కట్టాలి. అదే రెగులర్ కస్టమర్ అయితే, కేవలం 5,000 డాలర్ల ఫీజు తోనే వచ్చే 2016 మొదలులో కారు డెలీవరీ అవ్వడానికి బుకింగ్ చేసుకోవచ్చును.  

ప్రాథమిక మోడల్ ఎక్స్ కారు ఫాల్కన్ వింగ్ డోర్లు అమర్చబడి ఉన్నాయి. వీటికి బిల్ట్-ఇన్ సెన్సర్లు ఎటువంటి ఎత్తు ఉన్న గరాజ్ ని అయినా గుర్తించి తెరిచే విధంగా ఉన్నాయి. మూడవ-రో సీట్లుకి ఫోల్డింగ్, టెస్లా సూపర్చార్జ్ నెట్వర్క్ కి ఉచిత చార్జింగ్ మరియూ ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారెంటీ తో పాటుగా అపరిమిత మైలేజీ కూడా ఉంది. సామర్ధత వివరాల విషయానికి వస్తే ఇతర గ్యాస్ పై నడిచే పోర్షే కెయేన్ టర్బో మరియూ బీఎండబ్ల్యూ ఎక్స్5ఎం ఎస్యూవీ మొదలగు పోటిదారులకు ఇది గట్టి పోటీనే ఇస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience