టెస్లా వారు కారు వాటంతట అవే నడపగలిగేట్టుగా ఒక కొత్త ఆటో పైలట్ సాఫ్ట్‌వేర్ ని విడుదల చేశారు
అక్టోబర్ 19, 2015 11:48 am manish ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టెస్లా వారు ఒక ఆటో పైలట్ సాఫ్ట్‌వేర్ ని, టెస్లా వెర్షన్ 7.0 ని ఈ బుధవారం విడుదల చేశారు. దీని వలన కార్లు వాటంతట అవే నడపగలవు. ఇది ఇప్పటికే టెస్లా కార్లకు అమర్చారు. ఇది బ్రేకులు వేయడం, వేగం నియంత్రించడం ఇంకా వాటంతట అవే లేన్ లు మార్చడ వంటివి చేస్తాయి.
టెస్లా సంస్థాపకుడు మరియూ చీఫ్ ఎగ్జెక్యుటివ్ అయిన ఇలాన్ మస్క్ గారు," మేము అత్యంత జాగ్రథగా ఈ విషయంలో అడుగులు వేస్తున్నాము. డ్రైవర్లకు జాగ్రథ కోసం చేతులు స్టీరింగ్ పై ఉంచమని చెబుతున్నాము. నెమ్మదిగా, స్టీరింగ్ పై చేతులు పెట్టడం అవసరం ఉండదు. తరువాత స్టీరింగ్ వీల్ ఇంకా పెడల్స్ ఉండవు," అని అన్నారు.
కారు లేన్ మారడానికి, సిగ్నల్ మార్చడానికి, వేగం నియంత్రించడం వంటివి "ట్రాఫిక్-అవేర్" క్రూయిజ్ కంట్రోల్ సహాయంతో చేయగలదు. పారలెల్ పార్కింగ్ మరియూ ఖాలీ ఉన్న స్థలం వెతకడం కోసం మరియూ డ్రైవర్ ను అలర్ట్ చేయడం కోసం కూడా ఇది ఉపయోగ పడుతుంది.
సాఫ్ట్‌వేర్ కి ట్రాఫిక్ లైట్ల రంగులు గుర్తించలేకపోవడం వంటి లోపాలు ఉన్నాయి. టెస్లా వారు మూడవ త్రయంలో 11,580 యూనిట్ల అమ్మకాలు చేయగలిగింది.
తాజాగా విడుదల అయిన ఎక్స్ ఎస్‌యూవీ కి ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ వస్తుంది. దీనిని 2,500 డాలర్లు (రూ. 1,62,287.50) ధరకి పొందగలరు. ఈ సాఫ్ట్‌వేర్ ని తరువాత కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. "సూపర్ ఆగ్జలరేషన్" పేరిట 0 నుండి 100 కిలోమీటర్లు కేవలం 2.8 సెకనుల్లో చేరుకునే ఒక ఎంపిక కూడా అందిస్తోంది.
అటానమస్ కార్లకి పెద్ద అడ్డంకి ఏమిటంటేఇది చట్టానికి వ్యతిరేకం.