ఈ ఏడాది పదవీ విరమణ చేయబోవుతు న్న టెస్లా మోటార్స్ సిఎఫ్ఒ దీపక్ అహుజా
జూన్ 11, 2015 11:51 am sourabh ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: టెస్లా మోటార్స్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏలోను మస్క్ ఒక సందర్భంలో మట్లాడుతూ "ఈ కంపెనీ యొక్క సిఎఫ్ఒ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) అయిన దీపక్ అహూజా ఈ సంవత్సరం పదవి నుండి విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం నాడు జరిగిన షేర్ హోల్డర్స్ సమావేశంలో మిస్టర్ ఏలోను మస్క్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు, కంపనీ తయారు చేసిన అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్ కారు రూపొందించడంలో మిస్టర్ అహూజా ఒక వారసుడిగా చాలా సహాయం అందించారని ఆయన తెలిపారు.
అహుజా కి నిర్బంధంగా చెల్లించాల్సిన మొత్తము, చెల్లించామని సిఇఒ ఏలోను మస్క్ జరిగిన సమావేశం లో చెబుతూ " టెస్లా ప్రారంభించిన రోజుల్లో మేము ఇద్దరము కలిసి సవాళ్లను అధిగమించామని ఆయన పేర్కొన్నరు, అంతేకాకుండా మా మొట్టమొదటి సిఎఫ్ఒ గా, అతను వివిధ పెట్టుబడి రౌండ్లలో మాకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు, టెస్లాను పబ్లిక్ లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం వలన వారి సహాయంతో మాకు వ్యాపారాన్ని ఒక స్థిరమైన అంచులకి తీసుకెళ్లగలిగాము మరియు చాలా బలమైన ఫైనాన్స్ టీం నిర్మించుకోగలిగాము" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలో అహూజా, టెస్లా వద్ద ఒక "నాన్ స్టాప్ అడ్రినాలిన్ రష్" అని, ఇది నేను నా దగ్గర ఉన్న పెద్ద జాబితాలో నుండి కొన్ని విషయాలు తనిఖీ చేసుకోవాల్సిన సమయం అని మరియు ఇతర లక్ష్యాలను అధిగమించాల్సిన సమయం వచ్చిందని" ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో రానున్న టెస్లా మోటార్స్ యొక్క ఉత్పత్తుల గురించి మస్క్ మాట్లాడుతూ "కొత్త మోడల్ ఎక్స్ క్రాస్ఓవర్ మొదటి డెలివరీలను మూడు, నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని" చెప్పారు. వాహనాల యొక్క భద్రతా రేటింగ్స్ పరంగా "ప్రతి వర్గం లోని ఫైవ్ స్టార్ రేటింగ్ తో మీకోసం" రూపుదిద్దుకొని ఉంటాయని, దీనిని రోడ్ పైన సురక్షితంగా తిరిగే ఒక ఎస్యువి లాగా తయారు చేయండి అని అహూజ సంభాషించారు.