టెస్లా వారు భారతదేశంలో ఫ్యాక్టరీని స్థాపించవచ్చును
అక్టోబర్ 29, 2015 05:28 pm manish ద్వారా ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా లోని టెస్లా ఫ్యాక్టరీని ప్రధాన మంత్రి నరేద్ర మోడీ ఈమధ్య సందర్శించిన తరువాత, టెస్లా వారు భారతదేశంలో వీరు సదుపాయం ప్రారంభిస్తారు ఏమో అనే విషయం తలెత్తింది. మోడీ గారి సందర్శన వెనుక ప్రధానమైన కారణం టెస్లా వారి పవర్ వాల్ బ్యాటరీ ప్యాక్స్ విషయమై. ఆఫ్-గ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్ టెక్నాలజి ని భారతదేశానికి తీసుకురావాలి అన్న సంకల్పం ఈ సందర్శన వెనుక ప్రధాన అంశం. చైనా లో కారు తయారీ సదుపాయం ప్రారంభించాలి అని టెస్లా వారు ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. భారతదేశంలో కారు బ్యాటరీ తయారీ సదుపాయం నిర్మించాలి అన్న యోచనలో ఉన్నారు. టెస్లా వారి ఎలక్ట్రిక్ కార్లు లిథియం బ్యాటరీలను వాడతాయి. ఇవి సెల్ ఫోనుల్లో కూడా వాడుకలో ఉంటాయి. ఇటువంటి బ్యాటరీల తయారీ ఫ్యాక్టరీని 'గిగా ఫ్యాక్తరీ' అని పిలుస్తారు.
సంస్థాపకుడు మరియూ సీఈఓ అయిన ఇలాన్ మస్క్ గారు," స్థానికంగా ఉన్న డిమాండ్ కారణంగా ఇక్కడ ఒక ఫ్యాక్టరీని ప్రారంభించడం వలన దీర్ఘ కాలికంగా మేలు చేస్తుంది," అని అన్నారు.
చైనాలో టెస్లా యొక్క విస్తారణ గురించి స్పందిస్తూ, చైనాలో సదుపాయం ప్రారంభించే సమయానికి దాదాపుగా 3 నుండి నాలుగు ఏళ్ళు పడుతుంది అని ఇలాన్ మస్క్ గారు ట్వీట్ చేసి వివరించారు. ఈ అడుగు టెస్లా యొక్క 3వ మోడల్ విడుదలకి సంబంధించినది. ఇది మాస్ మార్కెట్ కోసం కంపెనీ వారు సమర్పిస్తున్న ఎలక్ట్రిక్ కారు.
ఎలక్ట్రిక్ కారు టెక్నాలజీ విషయమైన్ టెస్లా వారి గొప్ప ఆవిష్కరణలు చేశారు. ఈమధ్యే, రూ.60 లక్షల ఖరీదు చేసే టెస్లా మోడల్స్ కి సాఫ్ట్‌వేర్ పునరుద్దరణ వచ్చింది మరియూ ఇప్పుడు ఆటో పైలట్ ఫంక్షన్ కలిగి ఉండి, కారు అటానమస్ గా నడిపే వీలుని కల్పిస్తుంది.