ధరల పెంపు: జనవరి నుండి ఖరీదైనవిగా ఉండబోతున్న కార్లు
డిసెంబర్ 14, 2015 02:47 pm konark ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబాయి: 2015 సంవత్సరంలో చాలా కొత్త కార్లు ఆటో పరిశ్రమలో ప్రారంభించబడ్డాయి. మెర్సిడీస్ మార్కెట్ లో 15 ప్రొడక్ట్స్ ని ప్రారంభించింది. మారుతి దాని ఖరీదైన ఉత్పత్తులకు దాని ప్రీమియం షోరూమ్ చైన్ నెక్సా ని పరిచయం చేసింది. అయితే, ఫియాట్ కూడా ఇంధన సామర్ధ్యాన్ని కోరుకొనే వినియోగదారుల కోసం అబార్త్ ని దేశంలో ప్రారంభించింది. అయితే, కొందరు తయారీదారులు జనవరి 2016 నుండి ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించారు.
ఇక్కడ రాబోయే ధరల పెంపు ధృవీకరించిన కారు తయారీదారుల సంకలన వార్తలు
1. మారితి
భారతదేశం యొక్క అతిపెద్ద కారు తయారీ సంస్థ 2016 జనవరి నుండి వారి మొత్తం లైనప్ యొక్క ధరలు రూ.20,000 పెంచుతుంది. మారుతి అధికారులు ప్రకారం," అమెరికన్ డాలర్ కంటే రూపాయి విలువ పడిపోయిన కారణంగా దాని భర్తీ చేసి సమతౌల్యంగా ఉంచేందుకు ధరల పెంపు పెంచడం జరుగుతుంది. సంస్థ వినియోగదారుల కొనుగోలు నిర్ణయం చైతన్యపరచటంలో లక్ష్యంతో ఉంది, కాబట్టి వారు సంవత్సరం ముగిసే లోగా కావలసిన కార్లు కొనుగోలు చేసుకుంటారు మరియు డీలర్స్ వారి యొక్క సంవత్సరపు మిగిలి ఉన్న అమ్మకాలను క్లియర్ చేసుకొనే అవకాశం ఉంది." గతంలో ఇదే రోజు రాబోయే yBA కాంపాక్ట్ SUV భారత రోడ్లపై పరీక్ష చేయబడుతూ రహస్యంగా కనిపించింది.
2. హ్యుందాయి
కొరియన్ ఆటో దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2016 నుండి రూ.30,000 ధర పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఈ పెంపు ఇయాన్(రూ.3 లక్షలు సుమారు) నుండి శాంటా ఫే వరకు (సుమారు రూ.27 లక్షలు) మరియు వాటిలో ఐ 10, గ్రాండ్ ఐ 10, ఎలీట్ ఐ20, యాక్టివ్ ఐ20, ఎక్సెంట్, వెర్నా మరియు ఎలంట్రా కూడా ఉన్నాయి. ఉత్పత్తిపై పెరిగిన ఇన్పుట్ ఖర్చులు మరియు భారత కరెన్సీ తరుగుదల ఈ పెంపు కి కారణాలు.
3. టొయోటా
జపనీస్ కార్ల తయారీసంస్థ టొయోటా భారతదేశంలో దాని మొత్తం లైనప్ ధరలు జనవరి నుండి 3% వరకు పెంచనున్నట్టుగా తెలిపింది. టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డైరెక్టర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్), ఎన్ రాజా మాట్లాడుతూ " మేము ధరల పెంపు ని చాలా కాలం ఆపివేశాం , కానీ ఇన్పుట్ ఖర్చులు, విద్యుత్, నిర్వహణ మరియు విదేశీ మార్పిడి ఖర్చులు పెరిగాయి. అందువలన మేము జనవరి నుండి మా వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించుకున్నాము. అననుకూల విదేశీ మార్పిడి హెచ్చుతగ్గులు కూడా ధర పెంపు కోసం ఒక అంశంగా ఉంది." అని తెలిపారు.
4. మెర్సిడీస్
విజయవంతంగా 2015 లో 15 ఉత్పత్తులు ప్రారంభించిన తర్వాత, జర్మన్ తయారీసంస్థ తన అన్ని కారల మోడల్స్ కోసం 2 శాతం ధర పెంపు ప్రకటించింది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వలన ఈ లగ్జరీ తయారీసంస్థ తన ఉత్పత్తులకు ధరలను పెంచింది. "ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో, మేము బ్రాండ్ కి మా వినియోగదారులు యొక్క పెట్టుబడి కాపాడడం కోసం, మార్కెట్ లో మా ప్రీమియం బ్రాండ్ స్థానాలు కొనసాగటానికి మరియు ఒక లాభదాయకమైన వ్యాపారం కొనసాగించేందుకు మా ఉత్పత్తులకి కొన్ని ధరల సవరింపులు అందించడం జరిగింది." అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO, రోలాండ్ ఫోల్గేర్స్ పేర్కొన్నారు.
5. BMW
ధరల పెంపుతో BMW ఇండియా కూడా వారి వాహనాలు అంతటా 3% ధరల పెంపు ప్రకటించింది మరియు మినీ ఉత్పత్తి శ్రేణి జనవరి 1, 2016 నుంచి అమలులోకి వస్తుంది. BMW ప్రస్తుతం దాని చెన్నై ప్లాంట్ చెన్నై వద్ద BMW 1 సిరీస్, BMW 3 సిరీస్, BMW 3 సిరీస్ గ్రాన్ టురిస్మో, BMW 5 సీరీస్, BMW 7 సిరీస్, BMW X1, BMW X3 మరియు BMW X5 వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. "ధరలు పెరుగుదల వెనకాతల ఉన్న ముఖ్య లక్ష్యం, మా వినియోగదారులకు అత్యంత అవసరమైన మరియు అసాధారణమైన ఉత్పత్తులు అందించే మా ప్రయత్నాన్ని కొనసాగించడం మరియు వారి మొత్తం యాజమాన్యపు అనుభవానికి మరింత విలువ జోడించడం కొరకు. 'పరిపూర్ణ డ్రైవింగ్ ప్లెజర్' యొక్క సర్కిల్, వినూత్న ఉత్పత్తుల పరిచయం వలన మరియు ప్రపంచ స్థాయి డీలర్షిప్లు నిర్మించడం వలన పూర్తవుతుంది." అని BMW గ్రూప్ ఇండియా, ప్రెసిడెంట్ మిస్టర్ ఫిలిఫ్ వోన్ సహర్ తెలియపరిచారు.